ప్రముఖ ఇండియన్ ఎయిర్‌లైన్ సంస్థ విస్తారా (Vistara) తాజాగా తన ఫ్లైట్ టిక్కెట్ల (Flight Tickets)పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. సమ్మర్‌టైమ్ సేల్ పేరుతో దేశీయ, అంతర్జాతీయ ఫ్లైట్ టిక్కెట్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ (Discounts) తీసుకొచ్చింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ అనే మూడు క్లాసుల ప్రయాణాలపై ఈ సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ కింద ఏప్రిల్ 19, 2022 నుంచి ఏప్రిల్ 21, 2022 వరకు డొమెస్టిక్ ఫ్లైట్ (Domestic Flight) టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్ ఏప్రిల్ 19 నుంచి 25 వరకు ఓపెన్ అయి ఉంటాయి.
ముందుగా వచ్చిన వారికి ముందుగా సీట్లు..
ఎకానమీ క్లాస్‌కు కనీస ఫ్లైట్ టికెట్ ధర రూ.2,499 నుంచి ప్రారంభమైతే... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.3,459... బిజినెస్ క్లాస్‌కు రూ.9,999 నుంచి ధరలు స్టార్ట్ అవుతాయి. ప్రయాణికులు విస్తారా వెబ్‌సైట్, ఐఓఎస్/ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, విస్తారా ఎయిర్‌పోర్ట్ టిక్కెట్ ఆఫీసులు (ATOs), ఎయిర్‌లైన్ కాల్ సెంటర్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు (OTAs) లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రమోషనల్ ఛార్జీలకు డైరెక్ట్ ఛానెల్ డిస్కౌంట్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు/సాఫ్ట్ ప్రయోజనాలు వర్తించవు. ప్రయాణికులు ఈ బుకింగ్‌ల కోసం వోచర్‌లను ఉపయోగించలేరు. బుకింగ్ కోసం సీట్లు పరిమితంగా ఉంటాయి. ముందుగా వచ్చిన వారికి ముందుగా సీట్లు కేటాయించే పద్ధతిని విస్తారా ఫాలో అవుతుంది.
* సమ్మర్‌టైమ్ సేల్ రూట్స్ & ప్రైసెస్
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకానమీ క్లాస్‌కు రూ.2,499.
ఢిల్లీ - చండీగఢ్ ఎకానమీ క్లాస్‌కు రూ.2,519.. ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.3,459.. బిజినెస్ క్లాస్‌కు రూ.14,439
ఢిల్లీ - లక్నో ఎకానమీ క్లాస్‌కు రూ.2,939... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.3,939.. బిజినెస్ క్లాస్‌కు రూ.9,999
ముంబై - చండీగఢ్ ఎకానమీ క్లాస్‌కు రూ.4,149... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.5,449... బిజినెస్ క్లాస్‌కు రూ.16,159
ఉదయపూర్ - ఢిల్లీ ఎకానమీ క్లాస్‌కు రూ.2,969... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.3,959... బిజినెస్ క్లాస్‌కు రూ.14,839
ఢిల్లీ - అమృత్‌సర్ ఎకానమీ క్లాస్‌కు రూ.3,089... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.4,179... బిజినెస్ క్లాస్‌కు రూ.12,409
ఢిల్లీ - లేహ్ ఎకానమీ క్లాస్‌కు రూ.3,089.. ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.3,929... బిజినెస్ క్లాస్‌కు రూ.12,849
ఢిల్లీ - శ్రీనగర్ ఎకానమీ క్లాస్‌కు రూ.3,089... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.4,169... బిజినెస్ క్లాస్‌కు రూ.14,429
ముంబై - వారణాసి ఎకానమీ క్లాస్‌కు రూ.3,939... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.4,799... బిజినెస్ క్లాస్‌కు రూ.23,419
ఢిల్లీ - వారణాసి ఎకానమీ క్లాస్‌కు రూ.3,529... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.4,609... బిజినెస్ క్లాస్‌కు రూ.12,369
ముంబై - గోవా ఎకానమీ క్లాస్‌కు రూ.2,929... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.3,929... బిజినెస్ క్లాస్‌కు రూ.15,669
ఢిల్లీ - కొచ్చి ఎకానమీ క్లాస్‌కు రూ.5,059... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు 6,029... బిజినెస్ క్లాస్‌కు 27,249
ఢిల్లీ - గోవా ఎకానమీ క్లాస్‌కు రూ.4,609... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.5,559... బిజినెస్ క్లాస్‌కు రూ.25,819
ముంబై - బెంగళూరు ఎకానమీ క్లాస్‌కు రూ.3,519... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.4,879... బిజినెస్ క్లాస్‌కు రూ.16,659
ఢిల్లీ - కోల్‌కతా ఎకానమీ క్లాస్‌కు రూ.4,159... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.5,079... బిజినెస్ క్లాస్‌కు రూ.25,239.
* అంతర్జాతీయ విమానాల ధరలు
ఇవి ఆల్-ఇన్ రిటర్న్ ప్రమోషనల్ ఛార్జీలు.
ఢిల్లీ - ఖాట్మండు ఎకానమీ క్లాస్‌కు రూ.12,999... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.17,249... బిజినెస్ క్లాస్‌కు రూ.43,099
ముంబై - కొలంబో ఎకానమీ క్లాస్‌కు రూ.22,649... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.30,099... బిజినెస్ క్లాస్‌కు రూ.35,549
ఢిల్లీ - ఢాకా ఎకానమీ క్లాస్‌కు రూ.14,399... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.24,299... బిజినెస్ క్లాస్‌కు రూ.68,799
ఢిల్లీ - సింగపూర్ ఎకానమీ క్లాస్‌కు రూ.18,449... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.27,599... బిజినెస్ క్లాస్‌కు రూ.70,349.
ముంబై - దుబాయ్ ఎకానమీ క్లాస్‌కు రూ.20,849... ప్రీమియం ఎకానమీ క్లాస్‌కు రూ.28,549... బిజినెస్ క్లాస్‌కు రూ.60,149
విస్తారా ప్రకారం, టికెట్లు బుక్ చేసుకున్నవారు జూన్ 20 - సెప్టెంబర్ 30, 2022 మధ్య ప్రయాణించవచ్చు. ఇదే సమయంలో ప్రయాణాలకు అన్ని ఛార్జీలు పన్నులతో సహా వర్తిస్తాయి. ఇవి బ్లాక్అవుట్ తేదీలకూ వర్తిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight Offers, Flight tickets, Summer special, Vistara Airlines