Joe Biden అమెరికా అధ్యక్షుడైతే భారత్‌కు లాభమా... నష్టమా...తెలుసుకోండి..

ట్రంప్ ప్రభుత్వంతో చాలా నెలలు చర్చల తరువాత, ఇరు దేశాలు ఏటా 13 బిలియన్ డాలర్ల పరిమిత వాణిజ్య ఒప్పందంపై అంగీకరించాయి, కాని బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

news18-telugu
Updated: November 7, 2020, 1:31 PM IST
Joe Biden అమెరికా అధ్యక్షుడైతే భారత్‌కు లాభమా... నష్టమా...తెలుసుకోండి..
జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)
  • Share this:
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధిస్తే ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందంలో అడ్డంకిగా మారుతుందని పలు అంచనాలు వెలువడుతున్నాయి. పలు దఫాలుగా ట్రంప్ ప్రభుత్వంతో చాలా నెలలు చర్చల తరువాత, ఇరు దేశాలు ఏటా 13 బిలియన్ డాలర్ల పరిమిత వాణిజ్య ఒప్పందంపై అంగీకరించాయి, కాని బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను విస్తృతంగా సమీక్షించిన తర్వాతే భవిష్యత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఒక మీడియా నివేదిక పేర్కొంది. ముఖ్యమైన బైడెన్ పరిపాలన మరింత ఆచరణాత్మకంగా ఉంటుందని, అయితే అమెరికన్ వాణిజ్య లోటు కోణం నుండి దేశాలతో వాణిజ్య సంబంధాలను చూడదని పేర్కొంటున్నారు.

ఈ ఏడాది సెప్టెంబరులో, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌జైజర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇది పరిమిత వాణిజ్య ఒప్పందం అని ఆయన తెలిపారు. ఈ పరిమిత వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ప్రధాన స్వేచ్ఛా వాణిజ్య స్నేహానికి ప్రారంభ దశగా పరిగణిస్తున్నారు.

ఇదిలా ఉంటే బరాక్ ఒబామా పదవీకాలంలో, బైడెన్ ఒబామా విధానాలను ముందుకు తీసుకురావడానికి ఆయన ప్రధానంగా కృషి చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు డొనాల్డ్ ట్రంప్ మాత్రం 'అమెరికా ఫస్ట్' విధానం ప్రకారం రక్షణాత్మక వ్యాపార ధోరణిని ముందుకు తెచ్చారని వాణిజ్య విశ్లేషకులు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో బైడెన్‌ ప్రభుత్వం ట్రంప్ విధానాలను సమీక్ష పేరుతో అడ్డుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Visa Policyలో మార్పులు...భారత ఐటీ కంపెనీలకు పండగే...
మరోవైపు బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత, అమెరికా విధానాలలో పెద్దగా మార్పులు ఆశించలేమని కొందరు ఎన్ఆర్ఐ వాణిజ్య వేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ ఏదేమైనా, బిడెన్ యొక్క వీసా విధానం ట్రంప్ కంటే చాలా ఉదారంగా ఉండే వీలుంది. ఇది భారతదేశ ఐటి పరిశ్రమకు సహాయపడుతుంది. జూన్‌లోనే ట్రంప్ పరిపాలన వలసేతర వీసాల జారీని (Ban on Non-immigrant Visa) నిషేధించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం అమలులో ఉంది. కానీ బైడెన్ ప్రభుత్వం దీన్ని సమీక్షించే అవకాశం ఉంది.

ఇరాన్‌తో అమెరికా సంబంధాన్ని పర్యవేక్షిస్తారు:
అదే సమయంలో బైడాన్ ఇరాన్‌తో ఒబామా కాలం నాటి అణు ఒప్పందాన్ని కూడా పునరుద్ధరించవచ్చు. ఇరాన్‌పై ట్రంప్ సర్కారు విధించిన నిషేధాన్నిఅమెరికా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే ఇది మనకు కలిసి వచ్చే అవకాశం అని తద్వారా ఇరాన్ నుండి చౌకగా చమురు దిగుమతులతో పాటు బియ్యం, ఇతర ఆహార ఉత్పత్తులు ఎగుమతులకు మార్గం సుగమం చేస్తుంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే విషయంలో భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించే ముప్పు ఉండదు.

దిగుమతి-ఎగుమతి వ్యాపారంలో అనేక నిర్ణయాలు సాధ్యమే
పరిమిత వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుకుంటే , GSP - General Systeme of Preferences కింద దిగుమతి సుంకం నుండి భారతదేశం లాభం పొందుతుందని ట్రంప్ ప్రభుత్వం భావించి ట్రంప్ దీనిని 2018 లో ముగించారు. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం హార్లే డేవిడ్సన్ వంటి హై-ఎండ్ బైక్‌లపై సుంకాలను భారత్ తగ్గించాల్సి వచ్చింది. అయితే బైడెన్ ప్రభుత్వం కాస్త వాణిజ్య విషయాల్లో దూకుడు తగ్గించే అవకాశం ఉంది. తద్వారా మన ఎగుమతులపై సుంకాల విషయంలో ఉపశమనం కల్పించే వీలుంది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం అదనపు సుంకాన్ని అమెరికా ఉపసంహరించుకునే వీలుంది, బాదం, ఆపిల్, వాల్‌నట్స్‌తో సహా 29 అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాన్ని భారత్ తగ్గించే వీలుంది.

వాణిజ్య మిగులు తగ్గింది
గత కొన్నేళ్లుగా అమెరికాతో భారత్ వాణిజ్య మిగులు కుంచించుకుపోతోంది. దీనికి ఒక కారణం ఏమిటంటే, భారతదేశం అమెరికా నుండి చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. యుఎస్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వాణిజ్య మిగులు 2016 లో 24.3 బిలియన్ డాలర్ల నుండి 2019 లో 23.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

భారత ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, 2020 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం 35.7 బిలియన్ డాలర్లు యుఎస్ నుండి దిగుమతి అయ్యాయి. అయితే, మొత్తం వస్తువుల దిగుమతులు కూడా 7.8 శాతం తగ్గాయి. భారతదేశం 8.3 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజ ఇంధనం, సంబంధిత వస్తువులను, 6.2 బిలియన్ డాలర్ల రత్నాలు మరియు ఆభరణాలను మరియు 4.7 బిలియన్ డాలర్ల వస్తువులను యుఎస్ నుండి దిగుమతి చేసుకుంది. భారతదేశం నుండి అమెరికాకు మొత్తం ఎగుమతులు 53 బిలియన్ డాలర్లు విలువ తేలాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 1.3 శాతం పెరిగింది. 39.3 బిలియన్ల విలువైన రత్నాలు, ఆభరణాలు, 36.3 బిలియన్ల విలువైన ఔషధాలు 4.2 బిలియన్ డాలర్ల విలువైన గార్మెంట్స్ ఎగుమతి చేయబడ్డాయి.
Published by: Krishna Adithya
First published: November 7, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading