ఆ విషయంలో ఇండియా నంబర్ వన్... ఆ తర్వాతే అమెరికా, చైనా

ఆ విషయంలో ఇండియా నంబర్ వన్... ఆ తర్వాతే అమెరికా, చైనా (ప్రతీకాత్మక చిత్రం)

ఇండియా ఓ విషయంలో... అమెరికా, చైనాను వెనక్కి నెట్టేసింది. మొదటి స్థానంలో నిలిచింది. ఇది దేశంలోని పారిశ్రామిక వర్గాలను సంతోష పరుస్తోంది. ఆ విషయమేంటి? ఐటీ శాఖ మంత్రి ఏం చెప్పారు?

 • Share this:
  ప్రపంచంలో అమెరికా, చైనా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు. అలాంటి ఆ రెండు దేశాల్నీ వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది ఇండియా. ఏ విషయంలో అంటే... డిజిటల్ ట్రాన్సాక్షన్లు (digital transactions), చెల్లింపుల విషయంలో అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. శుక్రవారం ఆయనో ఆసక్తికర ట్వీట్ చేశారు. 2020లో ఇండియాలో 25.4 బిలియన్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిగితే... అగే సమయంలో చైనాలో 15.7 బిలియన్లు, అమెరికాలో 1.2 బిలియన్ ట్రాన్సాక్షన్లు మాత్రమే జరిగాయన్నారు. చైనాతో పోల్చితే... 1.6 రెట్లు, అమెరికాతో పోల్చితే 21 రెట్లు ఎక్కువగా ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జరిగాయన్నది ఆయన ట్వీట్ సారాంశం.

  పేటీఎం (Paytm) స్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma)... మంత్రి వైష్ణవ్ ట్వీట్‌ను షేర్ చేశారు. దానికో చిన్న క్యాప్షన్ పెట్టారు. ఆ ట్వీట్ ఇదే.


  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).... డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (DPI) ప్రకారం... ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. అవి 2019 మార్చి నాటికి 153.47 కోట్లు ఉండగా... 2020 మార్చి నాటికి అవి 207.84 కోట్లకు చేరాయి. 2021 మార్చి నాటికి అవి 270.59 కోట్లకు పెరిగాయి. 2018ని బేస్ ఇయర్‌గా చేసుకొని... ఈ లెక్కలు వేసింది.

  ఇది కూడా చదవండి: Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. అప్‌డేట్స్

  కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్లను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం మేలో... నీతి ఆయోగ్, మాస్టర్ కార్డ్ కలిసి... ఓ రిపోర్ట్ రిలీజ్ చేశాయి. దాని పేరు కనెక్ట్ కామర్స్... క్రియేటింగ్ ఓ రోడ్ మ్యాప్ ఫర్ ఓ డిజిటల్లీ ఇంక్లూజివ్ భారత్. ఈ రిపోర్టు... డిజిటల్ చెల్లింపులకు కావాల్సిన ఆర్థిక అవసరాల్ని తీర్చడం, దేశం మొత్తానికీ డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చేలా ఏం చెయ్యాలన్న అంశంపై సిఫార్సులు చేసింది. బ్యాంకులకు ఈ దిశగా మరిన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని ప్రతిపాదించింది.
  Published by:Krishna Kumar N
  First published: