హోమ్ /వార్తలు /బిజినెస్ /

Chinese Investments: భారత్‌లో మళ్లీ చైనా పెట్టుబడులు.. క్యూలో 45 ప్రపోజల్స్?

Chinese Investments: భారత్‌లో మళ్లీ చైనా పెట్టుబడులు.. క్యూలో 45 ప్రపోజల్స్?

ఇండియా, చైనా ప్లాగ్స్ (Image; Getty Images)

ఇండియా, చైనా ప్లాగ్స్ (Image; Getty Images)

ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, టెక్స్‌టైల్స్ లాంటివి పెద్దగా ప్రమాదం లేని, భారత డేటా చౌర్యానికి వీలులేని, భారత భద్రతకు ముప్పులేని రంగాలని, వీటికి త్వరగా అనుమతులు రావొచ్చని కొందరు న్యాయవాదులు చెప్పారు.

భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ ఇచ్చిన ఇండియా మళ్లీ ఆ దేశ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పినట్టు ఎన్డీటీవీ తెలిపింది. చైనాకు చెందిన 45 పెట్టుబడులకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు పేర్కొంది. ఆ 45 పెట్టుబడుల్లో గ్రేట్ వాల్ మోటార్స్, ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్, చైనా ప్రభుత్వం, కొన్ని ఇండస్ట్రీ పెట్టుబడులు ఉన్నట్టు పేర్కొంది. ఇటీవల చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదం కొంత సద్దుమణిగింది. డ్రాగన్ కంట్రీ కూడా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో భారత్ మళ్లీ చైనా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలిపింది. వాస్తవంగా ఈ పెట్టుబడులు ఏడాది నుంచి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే, గాల్వాన్ వ్యాలీలో చైనా దుందుడుకు చర్యల తర్వాత భారత్ ఆదేశ పెట్టుబడులు, కొన్ని యాప్స్ మీద కఠిన చర్యలు తీసుకుంది. చైనా నుంచి సుమారు 150 ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్స్ పైప్ లైన్‌లో ఉన్నాయని, వాటి విలువ 2 బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొంది.

ఇక జపాన్, అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలు కూడా చైనా ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ నిర్ణయంతో ఆ పెట్టుబడులకు కూడా బ్రేక్ పడింది. అయితే, చైనా నుంచి వచ్చే 45 ప్రపోజల్స్ వల్ల భారత జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదనే కారణంతో వాటికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని తెలిసింది. దీనిపై ఇద్దరు ప్రభుత్వ అధికారులు, ఇద్దరు ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతూ గ్రేట్ వాల్ మోటార్స్, ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్‌ కూడా ఆ 45 జాబితాలో ఉన్నాయి.

గ్రేట్ వాల్ మోటార్స్ , జనరల్ మోటార్స్ గతంలో ఓ ఒప్పందం చేసుకున్నాయి. జనరల్ మోటార్స్ సంస్థకు చెందిన ప్లాంట్ ఇండియాలో ఉంది. దీన్ని కొనేందుకు చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని విలువ 250 మిలియన్ డాలర్ల నుంచి 300 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ వచ్చే ఐదేళ్లలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌లో పెట్టేందుకు ప్రణాళికలు వేసింది. ఇండియాలో కార్లు విక్రయించాలని ఆ కంపెనీ భావిస్తోంది. అలాగే, ఎలక్ట్రిక్ కార్లు తీసుకురావాలనుకుంటోంది. దీనిపై ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని గ్రేట్ వాల్ తెలిపింది. అలాగే, ఈ ట్రాన్సాక్షన్ సులభంగా జరగడానికి అన్ని అనుమతులు కోరుతున్నామని జనరల్ మోటార్స్ కూడా పేర్కొంది.

ఇక బ్రిటిష్ కంపెనీ ఎంజీ మోటార్స్ కింద SAIC సంస్థ కూడా 2019 నుంచి కార్లను విక్రయిస్తోంది. 650 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామన్న ఆ కంపెనీ ఇప్పటికి 450మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇంకా ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు కోరుతోంది. అయితే, దీనిపై ఈమెయిల్ ద్వారా వివరణ కోరగా SAIC ఇండియా విభాగం స్పందించలేదని రాయిటర్స్ తెలిపింది.

ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, టెక్స్‌టైల్స్ లాంటివి పెద్దగా ప్రమాదం లేని, భారత డేటా చౌర్యానికి వీలులేని, భారత భద్రతకు ముప్పులేని రంగాలని, వీటికి త్వరగా అనుమతులు రావొచ్చని కొందరు న్యాయవాదులు చెప్పారు.

First published:

Tags: China, China App Ban, China Products, India-China, Indo China Tension

ఉత్తమ కథలు