హోమ్ /వార్తలు /బిజినెస్ /

స్టార్టప్ ఎకోసిస్టమ్‌ ర్యాంకులు ప్రకటించిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ ర్యాంక్‌లు ఎంతంటే

స్టార్టప్ ఎకోసిస్టమ్‌ ర్యాంకులు ప్రకటించిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ ర్యాంక్‌లు ఎంతంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ఇలా స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకులను ప్రకటించడం రెండోసారి. రాష్ట్రాల్లో స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

భారత ప్రభుత్వం రాష్ట్రాల్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకులను ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ఇలా స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకులను ప్రకటించడం రెండోసారి. రాష్ట్రాల్లో స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. బాగా ప్రోత్సహిస్తున్న వారికి వివిధ కేటగిరీల్లో ర్యాంకులు ప్రకటిస్తోంది. ఓ రకంగా కొత్త వ్యాపారవేత్తలు, నవ కల్పనలు, స్టార్టప్స్‌కు రాష్ట్రాలు తోడ్పాటు అందించేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఈ ర్యాంక్స్‌లో గుజరాత్ బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు కూడా బెస్ట్ పెర్ఫార్మర్లుగా నిలిచాయి. టాప్ పెర్ఫార్మర్లుగా కర్ణాటక, కేరళ స్థానం దక్కించుకున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయాల్ ఈ ర్యాంకులను ప్రకటించారు. స్టార్టప్‌‌లను ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలను అభినందించారు.

ఇప్పుడిప్పుడే స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ది చెందుతున్న రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరాం, సిక్కిం, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్

లీడర్స్‌గా ఎదుగుతున్న రాష్ట్రాలు

తెలంగాణ, హర్యానా, జార్ఖండ్, నాగాలాండ్, పంజాబ్, ఉత్తరాఖండ్

లీడర్స్

బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, చండీగఢ్

టాప్ పెర్ఫార్మర్స్

కర్ణాటక, కేరళ

బెస్ట్ పెర్ఫార్మర్స్

అండమాన్ నికోబార్ దీవులు (కేంద్ర పాలిత ప్రాంతం), గుజరాత్ (రాష్ట్రాల్లో)

First published:

Tags: Andhra Pradesh, Startups, Telangana

ఉత్తమ కథలు