Edible Oil | దసరా పండుగ పూట కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. వంట నూనెలు (Oil), బంగారం (Gold), వెండి (Silver) వంటిపై కనీస దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో సామాన్యులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగి రావడంతో భారత ప్రభుత్వం తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, బంగారంపై ఈ దిగుమతి సుంకాలను తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి వంటి వాటిపై కనీస దిగుమతి సుంకాలను సవరిస్తూ వస్తుంది.
బంగారం ధర రూ.1,800 పతనం.. రూ.2,800 పడిపోయిన వెండి!
ఈ సుంకాల ఆధారంగా దిగుమతి దారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ దిగుమతిదారుల్లో భారత్ కూడా ఒకటి. టాప్‌లో ఉంది. వెండి దిగుమతుల్లో కూడా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అలాగే బంగారం దిగుమతుల్లో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో చైనా కొనసాగుతోంది.
అక్టోబర్ 3 నుంచి 9 వరకు ఈ నగరాల్లో బ్యాంకులు పని చేయవు!
రేట్ల సవరణ తర్వాత బంగారం, వెండి, వంట నూనెలపై కనీస దిగుమతి సుంకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుకుందాం. క్రూడ్ పామ్ ఆయిల్‌పై ఇది వరకు సుంకం 996 డాలర్లుగా ఉండేది. ఇప్పుడు ఇది 937 డాలర్లకు తగ్గింది. ఆర్‌బీడీ పామ్ ఆయల్‌పై అయితే సుంకం 1,019 డాలర్ల నుంచి 982 డాలర్లకు దిగి వచ్చింది.
అలాగే ఆర్‌బీడీ పామోలిన్‌పై సుంకాన్ని గమనిస్తే.. ఇది 1,035 డాలర్ల నుంచి 998 డాలర్లకు తగ్గింది. క్రూడ్ సోయా ఆయిల్‌పై సుంకం 1362 డాలర్ల నుంచి 1,257 డాలర్లకు దిగివచ్చింది. ఇక బంగారంపై సుంకం 549 డాలర్ల నుంచి 533 డాలర్లకు తగ్గింది. ఇక సిల్వర్‌పై సుంకం 635 డాలర్ల నుంచి 608 డాలర్లకు క్షీణించింది. ఇక్కడ అన్ని కమొడిటీస్‌కు సుంకాలను టన్ను ప్రకారం ఇచ్చాం. బంగారానికి పది గ్రాములకు, వెండికి మాత్రం కేజీ పరంగా సుంకాలను లెక్కిస్తారు. కాగా దేశంలో ఇటీవల కాలంలో వంట నూనె ధరలు దిగివచ్చాయి. సామాన్యులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. గత ఏడాది, ఈ ఏడాది ఆరంభంలో ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకిన విషయం తెలిసిందే. రష్యా , ఉక్రెయిడ్ యుద్ధం ఇందుకు ప్రధాన కారణం. గ్లోబల్‌గా సరఫరా అడ్డంకుల తలెత్తడంతో ఆయిల్ రేట్లు చుక్కలను తాకాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cooking oil, Edible Oil, Gold, Oil prices, Silver