కరోనా దెబ్బతో...డిమాండ్ పడిపోయి...బంకుల్లో దాచుకోలేనంత స్థాయికి పెట్రోల్

దేశవ్యాప్తంగా 66,000 పంప్ స్టేషన్లతో సహా, ప్రతి కంటైనర్లో ఇంధనం నిల్వ చేసుకునేందుకు ఇక స్థలం లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని రిఫైనరీల్లో 85 మిలియన్ బారెల్స్ ఇంధన నిల్వ సామర్థ్యం ఉండగా, అందులో 95 శాతం నిండిపోయాయని రిఫైనరీ అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: April 23, 2020, 3:21 PM IST
కరోనా దెబ్బతో...డిమాండ్ పడిపోయి...బంకుల్లో దాచుకోలేనంత స్థాయికి పెట్రోల్
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా దెబ్బతో దేశంలో చమురు డిమాండ్ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. లాక్ డౌన్ కారణంగా అటు రైళ్లు, భారీ వాహనాలు, బస్సులు, కార్లు, టూవీలర్స్ నడవడం లేదు. దీంతో పెట్రోల్‌, డీజెల్ కు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. అటు దేశీయంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ సంబంధిత ఉత్పత్తులకు భారీగా తగ్గుదల నమోదవుతోంది. ఫలితంగా చమురు ధరలు రికార్డు స్థాయికి పతనమయ్యాయి. వాహనాలు నడవక పోవడంతో పెట్రోలు డిమాండ్ పడిపోయింది. ఈ దెబ్బతో మనదేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో దాచడానికి వీల్లేనంతగా పెట్రోలు నిల్వలు పేరుకుపోయాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దేశంలోని పెట్రోలు బంకులు దాదాపు నిండిపోయాయనీ, పెట్రోలు నిల్వ చేసుకునే సామర్థ్యం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా 66,000 పంప్ స్టేషన్లతో సహా, ప్రతి కంటైనర్లో ఇంధనం నిల్వ చేసుకునేందుకు ఇక స్థలం లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని రిఫైనరీల్లో 85 మిలియన్ బారెల్స్ ఇంధన నిల్వ సామర్థ్యం ఉండగా, అందులో 95 శాతం నిండిపోయాయని రిఫైనరీ అధికారులు తెలిపారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 10 రిఫైనరీల్లో కార్యకలాపాలను దాదాపు సగానికి తగ్గించగా, మిగిలినవి 35 శాతం పనిచేస్తున్నాయని ఎఫ్‌జీఈ కన్సల్టెంట్ సెంథిల్ కుమారన్ తెలిపారు. దేశం మొత్తం చమురు ఉత్పత్తి డిమాండ్ ఈ త్రైమాసికంలో రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చొప్పున పడిపోతుందని అంచనా వేశారు. కరోనా కారణంగా చమురు ధరలు చరిత్రలో మొదటిసారి కనీవిని ఎరుగని కనిష్టానికి చేరాయని, ముడి, శుద్ధి చేసిన ఇంధనాలను నిల్వ చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని స్థలాలను లీజుకు తీసుకున్నట్లు అతిపెద్ద స్వతంత్ర చమురు నిల్వ సంస్థ, రాయల్ వోపాక్ ఎన్వి తెలిపింది.

లాక్‌డౌన్‌తో విమానాల రాకపోకలు, సహా అన్ని రవాణా సేవలు రద్దు చేయడంతో భారతదేశంలోని వివిధ పెట్రోల్ బంకులలో 50 శాతం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. భారతదేశ చమురు డిమాండ్‌లో సగానికి పైగా, డీజిల్, గ్యాసోలిన్ వినియోగం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో 60శాతం కంటే ఎక్కువ పడిపోయింది.
Published by: Krishna Adithya
First published: April 23, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading