news18-telugu
Updated: October 14, 2019, 6:17 PM IST
ప్రతీకాత్మకచిత్రం
దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్ నెలలో 3.99 శాతానికి ఎగిసింది. ఇది ఆర్బీఐ టార్గెట్ లెవల్ అయిన 4 శాతానికి అత్యంత సమీపంలో వచ్చి చేరింది. తాజాగా సెంట్రల్ స్టాటస్టిక్స్ ఆఫీసు విడుదల చేసిన గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో 3.21 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరల ఆధారంగా చూసినట్లయితే సెప్టెంబర్ నెలలో 5.11 శాతం పెరుగదల నమోదు అయ్యింది. ఆగస్టులో ఇది 2.99 శాతంగా నిలిచింది. ఇక పప్పులు, అలాగే ఇతర ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 1.66 శాతం పెరుగుదల నమోదు చేయగా, ఆగస్టులో 1.3 శాతంగా నమోదైంది. ఇక కాయగూరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 15.4 శాతం పెరుగుదల నమోదు చేయగా, ఆగస్టులో 6.90 శాతం నమోదైంది. ఇదిలా ఉంటే పప్పులు, ఇతర ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సైతం సెప్టెంబర్ నెలలో 8.4 శాతం నమోదైంది.
Published by:
Krishna Adithya
First published:
October 14, 2019, 6:17 PM IST