మలేసియాకు షాక్... ప్రధాని మోదీని విమర్శించినందుకు కేంద్రం కీలక నిర్ణయం

Mumbai : ఎప్పుడైనా సరే... యజమాని దగ్గర పనిచేస్తూ... అదే యజమానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మలేసియా అదే చేసింది. ఫలితం అనుభవిస్తోంది.

news18-telugu
Updated: January 9, 2020, 1:33 PM IST
మలేసియాకు షాక్... ప్రధాని మోదీని విమర్శించినందుకు కేంద్రం కీలక నిర్ణయం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Mumbai : ఒకప్పుడు ఇండియాని ఏ దేశం ఎలాంటి విమర్శలు చేసినా... భారతీయులు భరించేవారు. ఎందుకంటే అప్పట్లో మన దేశం ఓ సాదా, సీదా దేశం. ఇప్పుడలా కాదు. ప్రపంచంలోనే చాలా అంశాల్లో టాప్ ఫైవ్‌లో నిలుస్తున్న దేశం. అందువల్ల ఇప్పుడు మన దేశాన్నీ, పాలకులనూ ఎవరైనా విదేశీయులూ, విదేశాలూ విమర్శిస్తే... భారత్ చూస్తూ ఊరుకోదు. తగిన బుద్ధి చెబుతుంది. తాజాగా మలేసియా విషయంలో అదే జరిగింది. కాశ్మీర్, పౌరసత్వ చట్టం విషయంలో మలేసియా పాలకులు ప్రధాని మోదీని విమర్శించడంతో... దానికి ప్రతిచర్యగా కేంద్ర ప్రభుత్వం మలేసియా నుంచీ పామ్ ఆయిల్, పామోలిన్‌ దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఇదివరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే దిగుమతి చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఆంక్షల కారణంగా... ఇప్పుడు శుద్ధి చేసిన పామాయిల్‌ను మలేసియా నుంచీ దిగుమతి చేసుకోలేం. కేవలం క్రూడ్ పామాయిల్ మాత్రమే దిగుమతి చేసుకోగలం. భారత్ ఎక్కువగా పామాయిల్, పామోలిన్‌ను మలేసియా నుంచే దిగుమతి చేసుకుంటోంది. తాజా ఆంక్షల వల్ల... మలేసియాకి పెద్ద షాకే తగిలినట్లవుతుంది.

మలేసియాలో ముస్లిం వర్గ ప్రజలు ఎక్కువ. వాళ్లను ఆకట్టుకునేందుకూ, వారి ఓటు బ్యాంకును రాబట్టుకునేందుకూ... మలేసియా ప్రధాని మహతిర్ మహమద్... భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. భారత ప్రభుత్వం కాశ్మీర్‌పై దండయాత్ర చేసి, ఆక్రమించుకుందని అక్టోబర్‌లో విమర్శించారు. ఇక భారత్ తెచ్చిన పౌరసత్వ చట్టం వల్ల ఆ దేశంలో అశాంతి రగులుతోందని డిసెంబర్‌లో అన్నారు. భారత్ గురించి ఇలాంటి విమర్శలు చేస్తుంటే... కేంద్రం చూస్తూ ఎలా ఊరుకుంటుంది? కేంద్ర నిర్ణయాలపై ఇండియాలోనూ ఎన్నో విమర్శలున్నాయి. వాటిని మనం తప్పని అనలేం. మన దేశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లు స్వతంత్రంగా వ్యక్తం చేయ్యడంలో తప్పు లేదు. కానీ... మన దేశ అంతర్గత వ్యవహారాలపై మరో దేశ అధినేతలు తప్పుగా మాట్లాడుతుంటే మాత్రం ఆ వ్యాఖ్యల్ని, చర్యల్నీ ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే. ఈ కారణంగానే కేంద్రం... మలేసియాపై ఈ చర్యలు తీసుకుంది.

ఇండియాలో వాడుతున్న వంట నూనెలో... 66 శాతం పామాయిలే ఉంటోంది. ఇండియా ఏటా 90 లక్షల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలో ఎక్కువగా పామాయిల్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండొనేసియా. ఆ తర్వాతి స్థానం మలేసియాదే.
Published by: Krishna Kumar N
First published: January 9, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading