• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • INDIA QUARTERLY GDP HAS COME DOWN TO 5 PERCENT AS COMPARED TO PERCENT IN THE LAST QUARTER MK

ఏడేళ్ల కనిష్టానికి పతనమైన జీడీపీ...5 శాతానికి ఢమాల్...

ఏడేళ్ల కనిష్టానికి పతనమైన జీడీపీ...5 శాతానికి ఢమాల్...

ప్రతీకాత్మక చిత్రం

ఈ క్షీణతతో ఏడేళ్ల కనిష్ట స్థాయికి జీడీపీ పతనం అయ్యింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళుతున్న వేళ, వృద్ధి రేటు ఇలా భారీగా క్షీణించడంతో ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    దేశ ఆర్థిక స్థితిని సూచించే జీడీపీ వృద్ధి రేటు భారీగా క్షీణించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన తొలి క్వార్టర్లో దేశ స్థూల జాతీయ ఆదాయం వృద్ధిరేటు (జీడీపీ) 0.8 శాతం క్షీణించి 5 శాతంగా నమోదైంది. ఈ క్షీణతతో ఏడేళ్ల కనిష్ట స్థాయికి జీడీపీ పతనం అయ్యింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళుతున్న వేళ, వృద్ధి రేటు ఇలా భారీగా క్షీణించడంతో ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని క్వార్టర్లుగా ఆటో, తయారీరంగం, రియల్ ఎస్టేట్ లాంటి పలు రంగాల్లో మాంద్యం జీడీపీ క్షీణతకు సూచికగా నిలిచింది. ముఖ్యంగా తయారీ రంగం కుదేలవడంతో పాటు చైనా, అమెరికా ట్రేడ్ వార్, బ్రెగ్జిట్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ లేకపోవడం, కొనుగోలు శక్తి తగ్గడం వంటి అంశాలు జీడీపీ తగ్గుదలకు సూచికగా నిలిచాయి. ఆర్బీఐ రెపో రేట్లు తగ్గిస్తున్నా బ్యాంకులు మాత్రం పారిశ్రామిక రుణాలను అందించడంలో ఆచితూచి వ్యవహరించడం ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతోంది.
    Published by:Krishna Adithya
    First published: