హోమ్ /వార్తలు /బిజినెస్ /

India Post: అలర్ట్... ఇండియా పోస్ట్ పేరుతో ఈ లింక్స్ మీకు కూడా వచ్చాయా?

India Post: అలర్ట్... ఇండియా పోస్ట్ పేరుతో ఈ లింక్స్ మీకు కూడా వచ్చాయా?

India Post: అలర్ట్... ఇండియా పోస్ట్ పేరుతో ఈ లింక్స్ మీకు కూడా వచ్చాయా?
(ప్రతీకాత్మక చిత్రం)

India Post: అలర్ట్... ఇండియా పోస్ట్ పేరుతో ఈ లింక్స్ మీకు కూడా వచ్చాయా? (ప్రతీకాత్మక చిత్రం)

India Post | ఇండియా పోస్ట్ పేరుతో మీకు వాట్సప్, ఇమెయిల్, సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఏవైనా లింక్స్ వచ్చాయా? అయితే అలర్ట్. ఇండియా పోస్ట్ పేరుతో మోసగాళ్లు వల వేస్తున్నారు.

ఇండియా పోస్ట్... భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద తపాలా వ్యవస్థల్లో ఒకటి. ఇండియా పోస్ట్ (India Post) నెట్వర్క్ గ్రామగ్రామానికి విస్తరించింది. పోస్ట్ ఆఫీస్ (Post Office) అందించే సేవల గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉన్నవారు, స్కీమ్స్‌లో చేరినవారు దాదాపు ప్రతీ మధ్యతరగతి కుటుంబంలో ఉంటారు. ప్రజలకు పలురకాల సేవలు అందిస్తూ ఇంటింటికీ దగ్గరవుతున్న ఇండియా పోస్ట్‌ను అడ్డం పెట్టుకొని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇండియా పోస్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాట్సప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులతో పాటు ఎస్ఎంఎస్ ద్వారా లింక్స్ పంపిస్తున్నారు.

ఈ లింక్స్ క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేస్తే ప్రభుత్వ సబ్సిడీలు పొందొచ్చని, సర్వేలు, క్విజ్ కాంపిటీషన్‌లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని వల వేస్తున్నారు. ఇలా ఇండియా పోస్ట్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న నకిలీ వెబ్‌సైట్స్ గురించి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. దీంతో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే నకిలీ ఎస్ఎంఎస్ లింక్స్, వెబ్‌సైట్ లింక్స్ నమ్మకూడదని హెచ్చరిస్తోంది.

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

సర్వేల ద్వారా సబ్సిడీలు, బోనస్‌లు, బహుమతులు ప్రకటించడం లాంటి కార్యకలాపాలలో ఇండియా పోస్ట్ పాల్గొనదని, అలాంటి నోటిఫికేషన్‌లు, సందేశాలు, ఇమెయిల్‌లను స్వీకరించేవారు, తప్పుదారి పట్టించే సందేశాలను నమ్మవద్దని, వాటికి రిప్లై ఇవ్వకూడదని, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, అకౌంట్ నెంబర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు, ఓటీపీ లాంటి వివరాలు షేర్ చేయకూడదని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖతో పాటు ఇండియా పోస్ట్ కోరుతోంది.

ఖాతాదారులు పోస్ట్ ఆఫీస్ సేవలు పొందేందుకు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ మాత్రమే ఫాలో కావాలి. ఈ వెబ్‌సైట్ తప్ప ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే ఇతర వెబ్‌సైట్ లింక్స్ క్లిక్ చేయకూడదు. ఎవరైనా ఇండియా పోస్ట్ నుంచి మాట్లాడుతున్నామని కాల్ చేసినా స్పందించకూడదు. ఏవైనా సందేహాలు ఉంటే దగ్గర్లోని పోస్ట్ ఆఫీసుకి వెళ్లి వివరాలు తెలుసుకోవాలి.

SBI: ఎస్‌బీఐ నుంచి అద్భుతమైన ఛాన్స్... రూ.9,00,000 ప్రైజ్ మనీ

పోస్ట్ ఆఫీసుల్లో నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర లాంటి పథకాలు ప్రజల్లో బాగా పాపులర్ అయ్యాయి.

First published:

Tags: India post, Post office, Post office scheme

ఉత్తమ కథలు