Home /News /business /

INDIA POST TO IMPLEMENT NEW RULES FROM 2022 APRIL 1 FOR MONTHLY INCOME SCHEME SENIOR CITIZEN SAVINGS SCHEME AND TIME DEPOSIT SS

Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Account | మీకు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ అకౌంట్ లాంటి స్కీమ్స్‌లో ఉన్నారా? అయితే అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది.

ఇంకా చదవండి ...
    మీకు పోస్ట్ ఆఫీస్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ అకౌంట్లకు ఇండియా పోస్ట్ ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలుచేయనుంది. ఈ స్కీమ్‌ల ద్వారా ప్రతీ నెల, మూడు నెలలకు, ఏడాదికి ఓసారి వచ్చే వడ్డీని నగదు రూపంలో ఇకపై ఇండియా పోస్ట్ ఇవ్వదు. వడ్డీని సేవింగ్స్ అకౌంట్‌లో జమ చేస్తుంది. ఖాతాదారులు సేవింగ్స్ అకౌంట్ నుంచే తమకు వచ్చిన వడ్డీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్ 2022 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీని 2022 ఏప్రిల్ 1 నుంచి ఖాతాదారుల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఇండియా పోస్ట్ సర్క్యులర్ విడుదల చేసింది.

    ఈ సర్క్యులర్ ప్రకారం ఖాతాదారులు తమ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌ను మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్‌లకు 2022 మార్చి 31 లోగా లింక్ చేయాలి. లేకపోతే ఆ వడ్డీ సంబంధిత MIS/SCSS/TD అకౌంట్లలో జమ అవుతుంది. రావాల్సిన వడ్డీని సేవింగ్స్ అకౌంట్‌లోకి జమ చేయించుకోవచ్చు. లేదా చెక్ ద్వారా తీసుకోవచ్చు. 2022 ఏప్రిల్ 1 తర్వాత నగదు రూపంలో వడ్డీ మాత్రం రాదు. ఈ పద్ధతి ద్వారా ఖాతాదారులు పోస్ట్ ఆఫీసుకి రావాల్సిన అవసరం లేకుండానే వడ్డీ పొందొచ్చు. వడ్డీ తీసుకోవడానికి వేర్వేరు ఫామ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతీ నెల, మూడు నెలలకు, ఏడాదికి ఓసారి వడ్డీ నేరుగా అకౌంట్‌లో జమ అవుతుంది.

    Paytm: వ్యాపారం కోసం పేటీఎం యాప్‌లో రూ.5 లక్షల లోన్... అప్లై చేయండిలా

    పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్


    పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న అనేక పొదుపు పథకాల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బాగా పాపులర్ అయింది. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నవారు ప్రతీ నెలా ఆదాయం పొందడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. దీన్నే పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ అని కూడా అంటారు. ఈ స్కీమ్‌లో ఫిక్స్‌డ్ రిటర్న్స్ గ్యారెంటీగా వస్తాయి.

    పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. కనీసం రూ.1,000 పొదుపుతో ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.4,50,000, జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.9,00,000 జమ చేయొచ్చు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ కాబట్టి ప్రతీ నెలా వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ వరకు వడ్డీ పొందొచ్చు.

    EPFO: అలర్ట్... మీ పాత పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు మర్చిపోయారా? ఈ వార్త మీకోసమే

    పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్


    పోస్ట్ ఆఫీసులో పాపులర్ పొదుపు పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ వృద్ధుల కోసం రూపొందించింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 55 ఏళ్లు దాటిన రిటైర్డ్ ఉద్యోగులు, 50 ఏళ్లు దాటిన రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో వృద్ధులు కనీసం రూ.1,000 నుంచి రూ.15,00,000 వరకు పొదుపు చేయొచ్చు.

    ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో 7.4 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద బెనిఫిట్ లభిస్తుంది. వడ్డీని ప్రతీ మూడు నెలలకు ఓసారి పొందొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: India post, Personal Finance, Post office, Post office scheme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు