India Post: బజాజ్‌ అలయంజ్‌ ఇన్సూరెన్స్‌తో ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు ఒప్పందం..

Post Office (ప్రతీకాత్మక చిత్రం)

దేశవ్యాప్తంగా సేవలందిస్తోన్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) తన పరిధిని విస్తరించుకుంటోంది. తాజాగా ప్రముఖ ప్రైవేట్‌ బీమా కంపెనీ బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు చెందిన జీవిత బీమాయేతర ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఇండియా పోస్ట్ పేమేంట్స్ బ్యాంకు ప్రకటించింది.

  • Share this:
దేశవ్యాప్తంగా సేవలందిస్తోన్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) తన పరిధిని విస్తరించుకుంటోంది. తాజాగా ప్రముఖ ప్రైవేట్‌ బీమా కంపెనీ బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు చెందిన జీవిత బీమాయేతర ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఇండియా పోస్ట్ పేమేంట్స్ బ్యాంకు ప్రకటించింది. ఈ ఒప్పందం పరిధిలో ఆరోగ్య సంరక్షణ, వైద్య ఉత్పత్తులు, వ్యక్తిగత ప్రమాదాలు, వాహన బీమా, వ్యక్తిగత సంరక్షణకు కావాల్సిన అన్ని రకాల సృజనాత్మక ఉత్పత్తులన్నీఉంటాయని బజాజ్‌ అలయంజ్‌ తెలిపింది.

Godrej Properties: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గోద్రేజ్‌ హవా.. ఒక్క రోజులోనే 340 గృహాల విక్రయం


గ్రామీణ డాక్‌ సేవక్ నుంచి ఎవరైనా ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయవచ్చా?
ఈ ఉత్పత్తులు విక్రయించేందుకు వీటికి సంబంధించిన అంశాలపై గ్రామీణ డాక్‌ సేవక్స్‌ లేదా పోస్ట్‌మ్యాన్లకు తగిన శిక్షణ ఇచ్చినట్టు బీమా కంపెనీ తెలియజేసింది. 650 బ్రాంచులు, 136,000 బ్యాంకింగ్‌ యాక్సెస్‌ పాయింట్ల ద్వారా ఈ బీమా ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కృషి చేస్తుంది.

ఎంపిక చేసిన పాలసీలే అమ్ముతారా లేదా అన్ని రకాల పాలసీలను వారు విక్రయిస్తారా?
పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ పర్సన్‌ లేదా పీఓఎస్‌పీ విధానం కింద.. వాహనాల, ఆరోగ్యం, ప్రయాణం, వ్యక్తిగత ప్రమాదాల వంటి చిన్న పరిణామాల్లో ఉండే ఉత్పత్తులు విక్రయించేందుకు మాత్రమే భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఎఐ) అనుమతి ఇస్తుంది.

Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరితే భార్యాభర్తలకు ఏడాదికి రూ.1,20,000 పెన్షన్


దాదాపు 2 లక్షల పోస్టల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు.. అంటే గ్రామీణ డాక్‌ సేవకులు, పోస్ట్‌మ్యాన్‌ల దగ్గర మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్‌ డివైజ్‌లు ఉన్నాయి. బ్యాంకింగ్‌ గురించి తెలియని, లేదా సేవలు పొందని కస్టమర్లకు ఈ బీమా ఉత్పత్తులు పంపిణీ చేయడంలో, ప్రోత్సహించడంలో వీరంతా కీలక పాత్ర పోషించగలరని బజాజ్‌ అలయంజ్‌ వివరించింది. సులభంగా, సౌకర్యవంతంగా, పొదుపైన రీతిలో ఖాతాదారులు ఇంటి ముంగిటే సాయం పొందుతూ బీమా సేవలు డిజిటల్‌ రూపంలో పొందేందుకు తమ సర్వీసు విధానం తోడ్పడుతుందని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జె. వెంకట్రాం తెలిపారు.

ఈ సేవలను ఎవరు పొందలేరు?
ఉత్పత్తులు, సేవల కోసం నేరుగా బీమా కేంద్రాలతో ప్రత్యక్షంగా అనుబంధం లేని ఖాతాదారులను సేవలు పొందలేని ఖాతాదారులుగా చెప్పవచ్చు. రెండు సంస్థల మధ్య కుదిరిన భాగస్వామ్యం కారణంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు బీమా సదుపాయాన్ని పోస్టుమ్యాన్‌లు అందించగలుగుతారని బజాజ్‌ అలయంజ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. బీమా గురించి అవగాహన పెంచేందుకు కావాల్సిన ప్రేరణ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో లభిస్తుందని బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ భావిస్తోంది.
Published by:Krishna Adithya
First published: