INDIA POST PAYMENTS BANK SERVICES AT HOME BOOK ONLINE STEP FOLLOW THIS GH VB
IPPB: ఇంటి వద్దకే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు.. ఆన్లైన్లో బుక్ చేసుకోండిలా..!
ప్రతీకాత్మక చిత్రం
ఇండియా పోస్ట్ పరిధిలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB- India Post Payments Bank).. వినియోగదారుల ఇంటి వద్దకే సేవలు అందించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నామమాత్రపు ఛార్జీలతో (Nominal Charges) వినియోగదారుల ఇంటి వద్దకు సేవలను తీసుకొస్తోంది.
ఇండియా పోస్ట్ పరిధిలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB- India Post Payments Bank).. వినియోగదారుల ఇంటి వద్దకే సేవలు అందించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నామమాత్రపు ఛార్జీలతో (Nominal Charges) వినియోగదారుల ఇంటి వద్దకు సేవలను తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ఆన్లైన్(Online)లో బుక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, మనీ ట్రాన్స్పర్, క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా చేసుకోవడం, రీఛార్జ్ చేయడం, బిల్లులు చెల్లించడం, సాధారణ బీమాను కొనుగోలు చేయడం వంటి మరిన్ని ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలు, సేవలను ఇంటి వద్దే పొందవచ్చు.
ఆన్లైన్లో బుక్ చేసుకోండి..
IPPB కస్టమర్లు https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx లింక్‌పై క్లిక్ చేసి, పేరు, చిరునామా, పిన్ కోడ్, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. డ్రాప్-డౌన్ బాక్స్/మెనూలో ఇంటి వద్దకు బుక్ చేయాలనుకొంటున్న సేవను ఎంచుకోండి. అనంతరం రెండో డ్రాప్ డౌన్ బాక్స్/మెనూలో ఎంచుకున్న సేవకు సంబంధించి అదనపు సమాచారం ఎంటర్ చేయాలి. తర్వాత OTP రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి.
ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. ఒన్ టైమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ధృవీకరణ పూర్తయి.. ఎంచుకొన్న సేవలు బుక్ అవుతాయి. సంబంధిత మొబైల్ నంబర్‌కు సేవలు బుక్ అయినట్లు మెసేజ్ కూడా వస్తుంది.
సర్వీస్ అవర్స్, ఛార్జీలు
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB) వెబ్సైట్ ప్రకారం.. సేవలను కనీసం T+2 (ట్రేడ్ ప్లస్ 2 రోజులు) నుంచి గరిష్ఠంగా T+10 రోజులకు బుక్ చేసుకొనే అవకాశం ఉంది. వినియోగదారులు తమ సౌకర్యం ప్రకారం షెడ్యూల్ చేసిన తేదీలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సర్వీస్ డెలివరీ కోసం టైమ్ స్లాట్‌ను ఎంచుకోవచ్చు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.. ఇంటి వద్దకు సేవలు అందించినందుకుగాను.. స్థానిక పోస్టాఫీసు నుంచి 1 కి.మీ దాటి సేవలు అందిస్తే వినియోగదారుల నుంచి రూ.20, GSTని వసూలు చేస్తారు. ఇంటి వద్ద ఎన్ని ట్రాన్సాక్షన్లు చేసినా ఎటువంటి పరిమితి లేదు. సేవలు, విధించే ఛార్జీల వివరాలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
ఇంటి వద్దకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న సేవలు
అకౌంట్స్ ఓపెనింగ్
నగదు డిపాజిట్/విత్‌డ్రా
మనీ ట్రాన్సాక్షన్స్
రీఛార్జ్, బిల్లు చెల్లింపులు
అకౌంట్ సంబంధిత సేవలు: IPPB & పోస్ట్ ఆఫీస్ ఖాతా అనుసంధానం, PAN/నామినేషన్ వివరాలను అప్డేట్ చేయడం, ఖాతా స్టేట్మెంట్ను రిక్వెస్ట్ చేయడం
AePS సేవలు
ఇతర బ్యాంకులతో ఉన్న ఆధార్ లింక్డ్ ఖాతాలకు యాక్సెస్
నగదు ఉపసంహరణ
బ్యాలెన్స్ విచారణ
మినీ స్టేట్మెంట్
థర్డ్ పార్టీ సర్వీసెస్
జీవిత భీమా
సాధారణ బీమా
మ్యూచువల్ ఫండ్స్
ఫైనాన్షియల్ సర్వీసెస్
ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్డేట్
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జెనరేషన్, జీవన్ ప్రమాణ్
భారతీయ పోస్ట్ ఆఫీస్ పథకాల చెల్లింపు: PPF, RD, PLI, RPLI, సుకన్య సమృద్ధి, LARD.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.