హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mahindra Finance: బైక్, స్కూటర్, ఆటో, కారు, ట్రాక్టర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇక పోస్టాఫీసుల్లో రుణాలు!

Mahindra Finance: బైక్, స్కూటర్, ఆటో, కారు, ట్రాక్టర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇక పోస్టాఫీసుల్లో రుణాలు!

Mahindra Finance: బైక్, స్కూటర్, ఆటో, కారు, ట్రాక్టర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇక పోస్టాఫీసుల్లో రుణాలు!

Mahindra Finance: బైక్, స్కూటర్, ఆటో, కారు, ట్రాక్టర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇక పోస్టాఫీసుల్లో రుణాలు!

IPPB | ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ మహీంద్రా ఫైనాన్స్ తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో పోస్టల్ కస్టమర్లకు కూడా మహీంద్రా రుణాలు అందుబాటులో ఉండనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Post Office | ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ (Mahindra Finance) సర్వీస్ తాజాగా గుడ్ న్యూస్ అందించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో (IPPB) భాగస్వామ్యం కుదుర్చుకుంది. మహీంద్రా ఫైనాన్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యం వల్ల కస్టమర్లకు రుణాలు సులభంగా అందుబాటులో ఉండనున్నాయి.

ఇరు కంపెనీల భాగస్వామ్యం కారణంగా.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీఐ) మహీంద్రా ఫైనాన్స్‌కు రెఫరల్ సర్వీసులు అందించనుంది. ప్యాసింజర్ వెహికల్స్, త్రివీలర్లు, ట్రాక్టర్, కమర్షియల్ వాహనాల కొనుగోలుకు రుణాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఇంకా పోస్టాఫీసుల్లో ప్రస్తుత మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్లకు క్యాష్ ఈఎంఐ డిపాజిట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉండనుంది.

క్రెడిట్ కార్డు వద్దనుకుంటున్నారా? ఇలా క్లోజ్ చేసుకోండి! ఎంత టైమ్ పడుతుందంటే?

మహీంద్రా ఫైనాన్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. తమ లక్ష్యం ఒక్కటేనని, కస్టమర్లకు సులభంగా రుణాలు అందించాలని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఐపీపీబీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఐపీపీఐ నెట్‌వర్క్‌ కింద ఉన్న అందరికీ మహీంద్రా ఫైనాన్స్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, సాధికారత, సులభతర రీపేమెంట్ వంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు.

బాబోయ్ బంగారం.. వచ్చే దీపావళి కల్లా కొండెక్కనున్న ధర.. ఎంత పెరగొచ్చంటే?

సమ్మిళిత వృద్ధి సాధించాలంటే త్వరితగతి రుణాలు, ఈజీ క్రెడిట్ వంటి అంశాలు అవసరమని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో జే వెంకట్రామ్ వివరించారు. ఐపీపీబీ ప్రారంభం దగ్గరి నుంచి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. తక్కువ ఆదాయం కలిగిన వారు, బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి పోస్టాఫీసుల ద్వారా కూడా సర్వీసులు అందుబాటులో ఉంచామని వివరించారు.

తొలిగా ఈ సర్వీసులు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని ఐపీపీబీ బ్రాంచుల్లో అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 4 నుంచి 6 నెలల కాలంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఐపీపీబీ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది. కాగా మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యం నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ షేరు కూడా అక్టోబర్ 18న ధర 3 శాతం మేర పైకి కదిలింది. రూ. 218కు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకే చూస్తే ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ షేరు 44 శాతం రాబడిని ఇచ్చింది. కాగా ఎనలిస్ట్‌లు కూడా ఈ షేరుపై సానుకూలముగా ఉన్నారు. 28 మంది షేరును కొనసాగించొచ్చని రేటింగ్ ఇచ్చారు.

First published:

Tags: Car loans, India post payments bank, Mahindra, Post office

ఉత్తమ కథలు