INDIA POST PAYMENTS BANK LAUNCHES DAKPAY APPLICATION KNOW ABOUT THIS DIGITAL PAYMENT AND BANKING SERVICES APP SS
India Post Payments Bank: 'డాక్ పే' యాప్ రిలీజ్ చేసిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
India Post Payments Bank: 'డాక్ పే' యాప్ రిలీజ్ చేసిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
(DakPay Logo)
India Post Payments Bank DakPay app | బ్యాంకులకు పోటీగా ఇండియా పోస్ట్ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. అంతేకాదు... టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తోంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB కస్టమర్ల కోసం సరికొత్త యాప్ రూపొందించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్-DoP సహకారంతో డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ 'డాక్‌పే'ని పరిచయం చేసింది. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 'డాక్‌పే' యాప్‌ని లాంఛ్ చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న సమయంలో ప్రత్యక్షంగా, డిజిటల్ పద్ధతుల్లో అనేక పోస్టల్ సేవల్ని అందించడంలో ఇండియా పోస్ట్ ముందుందని, ఈ యాప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని, పోస్టల్ ప్రొడక్ట్స్‌ని ఆన్లైన్లో పొందడం మాత్రమే కాదు, పోస్టల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని ఇంటి దగ్గరే పొందొచ్చని ఆయన అన్నారు. కోవిడ్ 19 పై పోరాటంలో భాగంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చేసిన కృషిని ఆయన కొనియాడారు.
డిజిటల్ లావాదేవీలు, బ్యాంకింగ్ సేవల కోసం ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. ఆర్థిక లావాదేవీల కోసం దేశప్రజల్ని డిజిటల్ వైపు నడిపించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ యాప్ తయారు చేసింది. 'డాక్‌పే' యాప్‌ను కస్టమర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. వర్చువల్ డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బయోమెట్రిక్స్ ద్వారా క్యాష్‌లెస్ లావాదేవీలు జరిపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఏ బ్యాంకు కస్టమర్లు అయినా బ్యాంకింగ్ సేవలతో పాటు బిల్ పేమెంట్ సేవలు పొందొచ్చు. ఇటీవల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB పెన్షనర్ల కోసం డోర్‌స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పెన్షనర్లు నామినల్ ఫీజు చెల్లించి ఇంటిదగ్గరే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేయొచ్చు.
I strongly believe DakPay’s double strength of service offerings in the form of online payments as well as home delivery of financial services, combined with nationwide network of @IndiaPostOffice will help in reaching out to the unbanked and underbanked citizens. pic.twitter.com/pCDqGUD8AW
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB 2018 సెప్టెంబర్ 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇది 100 శాతం భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంకు. దేశవ్యాప్తంగా ఉన్న 1,55,000 పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్, 3,00,000 పోస్టల్ ఉద్యోగుల సహకారంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్-IPPB ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.