హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bajaj Allianz Life Insuranceతో ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ ఒప్పందం

Bajaj Allianz Life Insuranceతో ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ ఒప్పందం

ఒప్పందం చేసుకుంటున్న ప్రతినిధులు

ఒప్పందం చేసుకుంటున్న ప్రతినిధులు

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (IPPB), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ మరియు బజాజ్‌ అలయన్జ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌(Bajaj Allianz Life Insurance) కంపెనీ (బీఏఎల్‌ఐసీ) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (IPPB), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ మరియు బజాజ్‌ అలయన్జ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (BALIC) నేడు తాము వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుని బ్యాంక్‌ యొక్క విస్తృతశ్రేణిలోని 650 శాఖలు, 1,36,000కు పైగా బ్యాంకింగ్‌ యాక్సెస్‌ పాయింట్ల ద్వారా  వినియోగదారులకు టర్మ్‌, యాన్యువిటీ ఉత్పత్తులను అందించనున్నట్లు వెల్లడించాయి. ఈ భాగస్వామ్యంతో బీద వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా  బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రాంతాలలో  వినియోగదారులకు తగిన  సేవలను అందించడం వీలవుతుంది. నేడు జరిగిన ఓ సమావేశంలో  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌(డీఓపీ) –డీడీజీ, ఎఫ్‌ఎస్‌ అండ్‌ పీబీఐ శ్రీ పవన్‌ కుమార్‌ సింగ్‌ ; ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈవో శ్రీ జె వెంకటరాము మరియు బజాజ్‌ అలయన్జ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ  ఎండీ అండ్‌ సీఈవో శ్రీ తరుణ్‌ చుగ్‌, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

  ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా బజాజ్‌ అలయన్స్‌ టర్మ్‌ , యాన్యువిటీ ఉత్పత్తులైనటువంటి  బజాజ్‌ అలయన్జ్‌ లైఫ్‌ స్మార్ట్‌ ప్రొటెక్ట్‌ గోల్‌ మరియు బజాజ్‌ అలయన్జ్‌ లైఫ్‌ గ్యారెంటీడ్‌ పెన్షన్‌ గోల్‌ ను వినియోగదారులకు అందించనున్నారు. ఈ భాగస్వామ్యం గురించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ సెక్రటరీ శ్రీ  వినీత్‌ పాండే మాట్లాడుతూ ‘‘ భీమా, ఇతర ఆర్ధిక సేవలు  అందుబాటులో లేని  లక్షలాది మంది ప్రజల జీవితాలను సమృద్ధి చేయాలని  ఇండియా పోస్ట్‌ వద్ద మేము ప్రయత్నిస్తుంటాము. ఈ భాగస్వామ్యంతో వారు పూర్తిగా తమ ఆర్థిక లక్ష్యాలను నిర్వహించుకోగలరు. పోస్టల్‌ శాఖకు చెందిన  పొదుపు పథకాలు వినియోగించుకుంటూనే  ఈ టర్మ్‌, యాన్యువిటీ భీమా ఉత్పత్తుల ద్వారా వారి దీర్ఘకాల ఆర్ధిక అవసరాలను తీర్చుకోగలరు’’అని అన్నారు.

  Investment Ideas: మీ డబ్బుకు రిస్క్ లేని రాబడి కావాలా..అయితే ఈ పథకాలు మీకోసం..

  ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈవో శ్రీ జె వెంకట రాము మాట్లాడుతూ..  ‘‘ఈ టర్మ్‌, యాన్యువిటీ ఉత్పత్తులతో బజాజ్‌ అలయన్జ్‌తో మా బంధం మరింతగా విస్తరించింది. మా గ్రామీణ్‌ డాక్‌ సేవక్స్‌,  బ్యాంకింగ్‌ యాక్సస్‌ పాయింట్ల ద్వారా సమగ్రమైన ఆర్ధిక పరిష్కారాలను వినియోగదారులకు అందించనున్నాం’’అని అన్నారు.

  Home Loans: పోస్టాఫీస్ కస్టమర్లకు HDFC Bank శుభవార్త.. అందుబాటులోకి Home Loans.. వివరాలివే

  ‘‘ప్రజలు తమ జీవిత లక్ష్యాలను చేరుకునేందుకు మేము తోడ్పాటునందిస్తున్నాము.  ఐపీపీబీ, డీఓపీల తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాం. ఈ భాగస్వామ్యంతో పలు  వినియోగదారుల విభాగాలలో  జీవిత భీమా స్వీకరణను మరింతగా వృద్ధి చేయడం సాధ్యమవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని శ్రీ తరుణ్‌ చుగ్‌, ఎండీ అండ్‌ సీఈవో, బజాజ్‌ అలయన్జ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అన్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bajaj finance, India post payments bank, Postal department

  ఉత్తమ కథలు