ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. డిసెంబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ (AePS) సర్వీస్ ఛార్జీలు పెంచుతున్నట్టు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. నాన్ ఐపీపీబీ నెట్వర్క్‌లో నెలకు ఒక లావాదేవీ ఉచితం. కస్టమర్లు AePS క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్, మినీస్టేట్‌మెంట్ లాంటి లావాదేవీలు చేయొచ్చు. అయితే ఫ్రీ లిమిట్ దాటితే కస్టమర్ సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. AePS క్యాష్ విత్‌డ్రాయల్, AePS క్యాష్ డిపాజిట్, AePS మినీ స్టేట్‌మెంట్‌కు ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
ఐపీపీబీ కస్టమర్లు ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత AePS క్యాష్ విత్‌డ్రాయల్ కోసం ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్‌టీ , AePS క్యాష్ డిపాజిట్ కోసం ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్‌టీ, AePS మినీ స్టేట్‌మెంట్ కోసం ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.5+ జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఛార్జీలు 2022 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
Aadhaar Card: ఆధార్ కార్డుపై లేటెస్ట్ ఫోటో కావాలా? ఇలా చేయండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా AePS వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల్ని అందించడమే ఈ వ్యవస్థ లక్ష్యం. ఆర్‌బీఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, కొన్ని బ్యాంకులు, రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ వ్యవస్థను రూపొందించాయి.
Dream Job: నెలకు రూ.3,50,000 జీతం... ఉచితంగా హెలికాప్టర్ రైడ్... అదిరిపోయే ఆఫర్
AePS అనేది బ్యాంక్ నేతృత్వంలోని మోడల్. ఆధార్ వివరాలను ఉపయోగించి ఏదైనా బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా PoS అంటే మైక్రో ఏటీఎం ద్వారా లావాదేవీలు చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కస్టమర్లు బ్యాంక్ పేరు, ఆధార్ నెంబర్ , ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్‌తో లావాదేవీలు చేయొచ్చు. AePS ద్వారా క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఆధార్ నుంచి ఆధార్‌కు ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఆథెంటికేషన్, BHIM ఆధార్ పే, ఇకేవైసీ లాంటి సేవల్ని పొందొచ్చు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు పలు రకాల సేవింగ్స్ అకౌంట్స్‌ని ఆఫర్ చేస్తోంది. ఖాతాదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా సేవింగ్స్ అకౌంట్ ఎంచుకోవచ్చు. ప్రీమియం సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్, రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ పేరుతో పలు బ్యాంక్ అకౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank charges, India post, India post payments bank, Personal Finance, Service charges