హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office Franchise: కేవలం రూ.5,000 చెల్లిస్తే పోస్ట్ ఆఫీస్ ఫ్లాంఛైజ్... కమిషన్ ఎంత వస్తుందంటే

Post Office Franchise: కేవలం రూ.5,000 చెల్లిస్తే పోస్ట్ ఆఫీస్ ఫ్లాంఛైజ్... కమిషన్ ఎంత వస్తుందంటే

Post Office Franchise: కేవలం రూ.5,000 చెల్లిస్తే పోస్ట్ ఆఫీస్ ఫ్లాంఛైజ్... కమిషన్ ఎంత వస్తుందంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Franchise: కేవలం రూ.5,000 చెల్లిస్తే పోస్ట్ ఆఫీస్ ఫ్లాంఛైజ్... కమిషన్ ఎంత వస్తుందంటే (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Franchise | వ్యాపారం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకొని చిన్న వ్యాపారం ప్రారంభించొచ్చు. పోస్ట్ ఆఫీస్ (Post Office) అందించే సేవల్ని ఫ్రాంఛైజ్ ద్వారా అందించి కమిషన్ పొందొచ్చు.

  మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఇండియా పోస్ట్ (India Post) మీకు అద్బుతమైన అవకాశం అందిస్తోంది. కేవలం రూ.5,000 చెల్లిస్తే చాలు... పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ (Post Office Franchise) తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. రెండు రకాల ఫ్రాంఛైజ్‌లను ఇస్తోంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్. ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ లేని ప్రాంతంలో పోస్టల్ సేవలకు డిమాండ్ ఉంటే అక్కడ ఫ్రాంఛైజ్ తెరిచి కౌంటర్ సర్వీసుల్ని అందించొచ్చు. ఇది కాకుండా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పోస్టల్ ఏజెంట్లు పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ అమ్మొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ద్వారా స్టాంప్స్, స్టేషనరీ అమ్మడం మాత్రమే కాదు రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్ లాంటి సేవల్ని అందించొచ్చు.

  Business Ideas: జాబ్ చేయకుండా డబ్బు సంపాదించాలా? ఈ 8 ఐడియాలు మీకోసమే

  ఎవరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చంటే...


  వ్యక్తిగతంగా ఎవరైనా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూషన్స్, ఇతర సంస్థలు, పాన్ షాప్స్, కిరాణా షాప్స్, స్టేషనరీ దుకాణాలు నిర్వహించేవారు ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో, కొత్తగా ఏర్పాటయ్యే టౌన్‌షిప్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, భారీ హైవే ప్రాజెక్ట్స్, కళాశాలలు, విద్యా సంస్థలు ఉన్నచోట పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ప్రారంభించొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఫ్రాంఛైజ్ తీసుకోవడానికి అర్హులు కాదు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవాలంటే కనీసం 18 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు. కంప్యూటర్ సదుపాయాలు ఉండాలి.

  Business Idea: లక్షల్లో ఆదాయం కావాలా? ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా

  పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ తీసుకోవడానికి కేవలం రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకుంటే డివిజనల్ హెడ్ దరఖాస్తును పరిశీలించి ఫ్రాంఛైజ్‌ను మంజూరు చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం 14 రోజుల్లో పూర్తవుతుంది. ఇక ఇప్పటికే పంచాయత్ సంచార్ సేవా కేంద్రాలు (PSSKs) ఉన్న గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ప్రారంభించడానికి అనుమతి ఇవ్వరు.

  కమిషన్ వివరాలు ఇవే...


  పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ద్వారా అందించే సేవలకు కమిషన్ లభిస్తుంది. ఒక్కో సర్వీస్‌కు కమిషన్ ఒక్కోలా ఉంటుంది. రిజిస్టర్డ్ ఆర్టికల్స్‌కి రూ.3, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్‌ రూ.5 చొప్పున కమిషన్ వస్తుంది. ఒక నెలలో 1000 కన్నా ఎక్కువ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ బుక్ చేస్తే అదనంగా 20 శాతం కమిషన్ లభిస్తుంది. రూ.100 నుంచి రూ.200 మధ్య మనీ ఆర్డర్‌కు రూ.3.50 కమిషన్ వస్తుంది. రూ.200 కన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌కు రూ.5 కమిషన్ ఉంటుంది. పోస్టల్ స్టాంపులు, మనీ ఆర్డర్ ఫామ్స్, ఇతర స్టేషనరీ అమ్మితే 5 శాతం కమిషన్ లభిస్తుంది. రెవెన్యూ స్టాంప్స్, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ స్టాంప్స్ అమ్మితే 40 శాతం కమిషన్ పొందొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Business plan, India post, Post office, Post office scheme, Postal department, Small business

  ఉత్తమ కథలు