హోమ్ /వార్తలు /బిజినెస్ /

Crude Oil: రష్యా నుండి చమురు కొనుగోలు.. మరోసారి తేల్చిచెప్పిన భారత్..

Crude Oil: రష్యా నుండి చమురు కొనుగోలు.. మరోసారి తేల్చిచెప్పిన భారత్..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Crude Oil: వినియోగదారుల పట్ల మాకు కొంత నైతిక బాధ్యత ఉందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. దేశంలోని 1.30 బిలియన్ల జనాభాకు తగినంత శక్తిని సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా న్యూస్ ఛానెల్‌తో జరిగిన సంభాషణలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడానికి భారతదేశం ఎటువంటి నైతిక ఒత్తిడికి గురికాదని సూటిగా చెప్పారు. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తామని తెలిపారు. రష్యా(Russia) నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును(Crude Oil) కొనుగోలు చేయడానికి భారతదేశం వెనుకాడుతోందని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ (Hardeep Singh Puri) పూరీ.. అలాంటిదేమీ లేదని అన్నారు. తమకు కావలసిన చోట నుంచి చమురు కొంటామని.. ఎక్కడ ముడిచమురు దొరుకుతుందో, చౌకగా లభిస్తే అక్కడి నుంచే కొనుగోలు చేస్తామని తెలిపారు. పూరీ భారతదేశం చమురు కొనుగోలును సమర్థించారు. అంతకుముందు భారతదేశం తన చమురులో 0.2 శాతం మాత్రమే రష్యా నుండి కొనుగోలు చేసేది. ఇది ఐరోపాలో కొన్ని గంటలపాటు చమురును కొనుగోలు చేయడంతో సమానం కాదు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల లాభం వచ్చిందా అనే ప్రశ్నకు బదులిచ్చారు. ముందుగా మన టార్గెట్ చూడాలి అని పూరి అన్నారు. తాము 2021-22 ఆర్థిక సంవత్సరంలో రష్యా నుండి 0.2 శాతం చమురును మాత్రమే కొనుగోలు చేశామని... ఇది ఐరోపాతో పోలిస్తే ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు తాము చమురు కొనుగోళ్లను పెంచాలనుకుంటున్నామని.. రష్యా దాని చమురును తమకు ఇస్తే ముందుకు వెళ్తామని అన్నారు.

రష్యా నుండి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు తమ ఆంక్షలను పొడిగిస్తే భారత్‌కు బ్యాకప్ ప్లాన్ ఉందా ? అనే అంశంపై కూడా భారత్ స్పందించింది. తమ దగ్గర చాలా బ్యాకప్ ప్లాన్‌లు ఉన్నాయని అన్నారు. దీనిపై అమెరికా, యూరప్‌లతో కూడా చర్చలు జరిపామని, మోదీ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదని అన్నారు. తాము ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని.. తమ భారీ మార్కెట్ ఏదైనా మార్పును కలిగిస్తుందని చెప్పారు.

కేవలం చమురు ధరల పెరుగుదల కారణంగా, ద్రవ్యోల్బణంతో సహా అన్ని సమస్యలు పెరుగుతాయని అన్నారు. దీనికి ప్రత్యామ్నాయం కోసం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నామని.. అయితే తక్షణ అవసరాలకు సరిపడా తక్కువ ధరలో చమురు ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కుంటామని స్పష్టం చేశారు. భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుల్లో రష్యా చేరిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాక్ మాత్రం మొదటి స్థానంలోనే ఉంది.

Digital Rupee: డిజిటల్ రుపీతో లావాదేవీలు షురూ... డిజిటల్ కరెన్సీ విశేషాలివే

EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... ఈవారంలోనే అకౌంట్‌లోకి డబ్బులు

వినియోగదారుల పట్ల మాకు కొంత నైతిక బాధ్యత ఉందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. దేశంలోని 1.30 బిలియన్ల జనాభాకు తగినంత శక్తిని సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ను చౌకగా ఉంచేందుకు ప్రభుత్వం తన ఆదాయాన్ని, పన్నును కూడా తగ్గించుకుందని అన్నారు. దేశంలో ఇంధన వినియోగం పెరుగుతోందని, ఈ డిమాండ్‌ను తీర్చడానికి తమకు ఎక్కడ తక్కువ చమురు లభిస్తుందో, దానిని కొనుగోలు చేస్తామని పూరీ చెప్పారు. OPEC తమ అతిపెద్ద సరఫరాదారు అని అన్నారు.

First published:

Tags: Crude Oil

ఉత్తమ కథలు