హోమ్ /వార్తలు /బిజినెస్ /

IMF: ఆర్థిక మందగమనంలో భారతదేశం... హెచ్చరించిన ఐఎంఎఫ్

IMF: ఆర్థిక మందగమనంలో భారతదేశం... హెచ్చరించిన ఐఎంఎఫ్

imf, International Monetary Fund, indian economy, Reserve Bank of India, Ranil Salgado, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మందగమనం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రనీల్ సల్గాడో
(ప్రతీకాత్మక చిత్రం)

imf, International Monetary Fund, indian economy, Reserve Bank of India, Ranil Salgado, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మందగమనం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రనీల్ సల్గాడో (ప్రతీకాత్మక చిత్రం)

IMF on Economic Slowdown | 2019లో భారతదేశం వృద్ధి రేటు 6.1 శాతం ఉంటుందని అక్టోబర్‌లో అంచనా వేసింది ఐఎంఎఫ్. 2020 నాటికి 7.0 ఉంటుందని అంచనా వేసింది.

భారతదేశంలో ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఉందని ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్-IMF హెచ్చరించింది. అంతర్జాతీయ వృద్ధిలో కీలకపాత్ర పోషించే భారతదేశంలోని ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కునే చర్యలను వెంటనే చేపట్టాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సూచిస్తోంది. వినియోగం, పెట్టుబడి, పన్ను ఆదాయం తగ్గడం ఇతర అంశాలతో కలిపి ప్రభావం చూపించడం వల్ల ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారతదేశానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని వార్షిక సమీక్షలో ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

లక్షలాది మందిని పేదరికం నుంచి దూరం చేసిన భారతదేశం ప్రస్తుతం ఆర్థిక మందగమనంలో ఉంది. ప్రస్తుత తిరోగమన పరిస్థితుల్ని ఎదుర్కొని అధిక వృద్ధి మార్గంలో ప్రయాణించేందుకు అత్యవసరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి.

రనీల్ సల్గాడో, ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ డిపార్ట్‌మెంట్‌

2019లో భారతదేశం వృద్ధి రేటు 6.1 శాతం ఉంటుందని అక్టోబర్‌లో అంచనా వేసింది ఐఎంఎఫ్. 2020 నాటికి 7.0 ఉంటుందని అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేటును మరింత తగ్గించొచ్చని, ఒకవేళ ఆర్థిక మందగమన పరిస్థితులు కొనసాగితే ఈ చర్యలు తీసుకోవాలని రనీల్ సల్గాడో అన్నారు. ఇప్పటికే ఆర్బీఐ వడ్డీ రేట్లను ఐదు సార్లు తగ్గించి 9 ఏళ్ల కనిష్టానికి తీసుకెళ్లింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించింది. వార్షిక వృద్ధి రేటును 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా

Sukanya Samriddhi Rules 2019: సుకన్య సమృద్ధి యోజన రూల్స్ ప్రకటించిన ప్రభుత్వం

IRCTC: సంక్రాంతికి రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు

First published:

Tags: Imf, Indian Economy, Indian economy crisis

ఉత్తమ కథలు