హోమ్ /వార్తలు /బిజినెస్ /

Farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకే ఆ వివరాలు!

Farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకే ఆ వివరాలు!

 రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకే ఆ వివరాలు!

రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకే ఆ వివరాలు!

Weather Forecast | మీరు వ్యవసాయం చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రానున్న రోజుల్లో కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఐదు రోజుల్లో వాతావరణం ఎలా ఉండొచ్చనే విషయాన్నిసులభంగానే తెలుసుకోవచ్చు. జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. మీ ఫోన్‌కే వివరాలు అన్నీ వచ్చేస్తాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  IMD | రైతులకు శుభవార్త.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అన్నదాతలకు తీపికబురు అందించింది. ప్రాంతీయ భాషల్లోనే రైతులకు (Farmers) వాతావరణ సూచనలు అందించడానికి రెడీ అవుతోంది. దీని కోసం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. రైతుల మొబైల్ ఫోన్లకే (Phone)నేరుగా ఈ వివరాలు చేరనున్నాయి. ఎస్ఎంఎస్ రూపంలో అన్నదాతలు వారు ఉంటున్న ప్రాంతంలో వాతావరణ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

  రైతులు వాతావరణ వివరాలను పొందాలని భావిస్తే.. ఒక ప్రత్యేకమైన నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. వచ్చే ఐదు రోజుల్లో రైతులు ఉంటున్న ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండొచ్చనే వివరాలను ఐఎండీ నేరుగా అన్నదాతల మొబైళ్లకు ఎస్ఎంఎస్ పంపుతుంది. వర్షం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ ఇలా తదితర వివరాలు అన్నీ లభిస్తాయి. దీని వల్ల అన్నదాతలకు ఊరట కలుగనుంది.

  క్రెడిట్ కార్డు వాడే వారికి షాక్.. ఇకపై..

  వాతావరణ వివరాలను ప్రాంతీయ భాషల్లో అన్నదాతలకు నేరుగా అందించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో ఐఎండీ ఈ సర్వీసులు తీసుకురావడానికి రెడీ అవుతోంది. చాలా మంది రైతుల వద్ద స్మార్ట్‌పోన్స్ ఉండవు. దీని వల్ల వాతావరణ వివరాలు తెలుసుకోలేకపోవచ్చు. అలాగే అన్నదాతలకు స్మార్ట్‌ఫోన్ వాడటం రాకపోవచ్చు కూడా. అందుకే చాలా మంది ఫీచర్లు ఫోన్లు ఉపయోగిస్తూ ఉంటారు. వీరికి ఎస్ఎంఎస్ ద్వారా వాతావరణ సమాచారం వివరాలు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

  పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారికి కేంద్రం తీపికబురు?

  త్వరలోనే ఒక ప్రత్యేకమైన నెంబర్‌ను జారీ చేస్తామని ఐఎండీ పేర్కొంటోంది. రైతులకు ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. ఐఎండీ అధికారులు రైతుల లొకేషన్‌లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని.. వెంటనే ఆ వివరాలను అన్నదాతల ఫోన్లకు ఎస్ఎంఎస్ పంపుతారు. ఈ సర్వీసులు ఉచితంగానే పొందొచ్చు. ఎలాంటి చార్జీలు ఉండవు. కాగా ప్రస్తుతంగా ఐఎండీ మేగదూత్ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐఎండీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఇక్రా) సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. దీని ద్వారా జిల్లా స్థాయిలో ప్రత్యేకమైన వ్యవసాయ సంబంధిత వివరాలు పొందొచ్చు.

  ఐఎండీ జిల్లాల స్థాయిలో దాదాపు 200 అగ్రో ఆటోమేటిక్ వేదర్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇవి వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వివరాలను సేకరిస్తోంది. వీటిని రైతులకు అందిస్తూ వస్తోంది. రైతులు ఐఎండీ అలర్ట్స్ పొందటం వల్ల వర్షం ఎప్పుడు రావొచ్చు, ఎండ ఎలా ఉండొచ్చనే విషయాలను ముందుగానే తెలుసుకోవడం వీలవుతుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Farmer, Farmers, IMD, Imd hyderabad, Weather report

  ఉత్తమ కథలు