Home /News /business /

INDIA MADE SUZUKI SWIFT HATCHBACK RECEIVES ZERO STARS IN LATEST LATIN NCAP CRASH TEST HERE FULL DETAILS NS GH

Swift Hatchback: సుజుకీ స్విఫ్ట్ కారు అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఆ టెస్టులో జీరో రేటింగ్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్విఫ్ట్(Suzuki Swift) మోడల్ గత కొన్నేళ్లుగా అత్యుత్తమ విక్రయాలు అందుకుంటూ విజయవంతమైంది. అయితే కార్లకు సేఫ్టీని పరీక్షించే న్యూ కార్ అసెస్మెంట్ ప్రొగ్రాంలో(NCAP) ఈ మోడల్ జీరో స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.

కార్ల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో సుజుకీ ఒకటి. భారత్‌లో మారుతి సంస్థతో కలిసి సుజుకీ కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన స్విఫ్ట్ మోడల్ గత కొన్నేళ్లుగా అత్యుత్తమ విక్రయాలు అందుకుంటూ విజయవంతమైంది. అయితే కార్లకు సేఫ్టీని పరీక్షించే న్యూ కార్ అసెస్మెంట్ ప్రొగ్రాంలో(NCAP) ఈ మోడల్ జీరో స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ల్యాటిన్ NCAP తాజాగా నిర్వహించిన క్రాష్ టెస్టులో సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ మోడల్‌కు అసలు ఒక్క స్టార్ కూడా రాలేదు. ఈ పాపులర్ కాంపాక్ట్ SUV అడల్ట్ ఆక్యుపేషన్ బాక్స్‌లో 15.53 శాతం, చైల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ విభాగంలో సున్నా శాతం, పాదచారుల ప్రొటెక్షన్ టెస్టులో 66.07 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్‌లో 6.98 శాతం రేటింగ్ దక్కించుకుంది. ఈ ఫలితాలు హ్యాచ్ బ్యాక్, సెడాన్ వెర్షన్లకు వర్తిస్తాయి. స్విఫ్ట్ ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, విప్లాష్, పాదచారుల రక్షణకు సంబంధించి ఈ టెస్ట్ నిర్వహించారు.

పరీక్ష సమయంలో పేలవమైన సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఓపెన్ డోర్, యూఎన్32 రియర్ ఇంపాక్టర్ టెస్ట్ లేకపోవడం, స్టాండర్డ్ సైడ్ హెడ్ ప్రొటెక్షన్ ఎయిర్ బ్యాగులు లేకపోవడం, స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC) లేకపోవడం వల్ల స్విఫ్ట్‌ మోడల్‌కు జీరో స్టార్స్ ఇచ్చారు. పిల్లల భద్రతకు సంబంధించి చైల్డ్ రిస్ట్రైన్డ్ సిస్టం(CRS)ను సుజుకీ సిఫార్సు చేయలేదు. పాదచారుల రక్షణ పనితీరు సహేతుకమైన స్థాయిని చూపించింది. కారు డోర్ ఓపెనింగ్‌లో ఈ సంస్థ యూఎన్ 95 నిబంధనలను పాటించలేదు.
Maruti Suzuki: మారుతి నుంచి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వస్తుంది..కంపెనీ ఏం చెబుతోంది అంటే..

స్విఫ్ట్ యూరప్‌లో 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(USC)తో అందుబాటులోకి వచ్చింది. అయితే లాటిన్ అమెరికాలో సైడ్ బాడీ, హెడ్ ఎయిర్ బ్యాగులు, ESC లాంటి ఫీచర్లు ప్రామాణికంగా లేవు. రియర్ సెంటర్ సీటింగ్ పొజిషన్ స్టాండార్డ్ ల్యాప్ బెల్ట్ ఉన్నప్పటికీ అధిక గాయాలయ్యే అవకాశముంది. భారత్‌లో స్విఫ్ట్ మోడల్ డ్యుయల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్‌లతో అందుబాటులోకి వచ్చింది.
Maruti Suzuki: మారుతి కారు కొంటున్నారా..అయితే లోన్ చాలా సులభం...ఎలాగంటే..

ఎక్స్ షోరూంలో సుజుకీ స్విఫ్ట్ 2021 మోడల్ ధర రూ.5.81 లక్షలుగా ఉంది. సరికొత్త డ్యుయల్ స్పోర్టీ డిజైన్ లుక్‌తో ఇది అందుబాటులోకి వచ్చింది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంపులు, బోల్డ్ క్రోమ్ యాక్సెంట్‌తో కూడిన స్పోర్టీ క్రాష్ మెష్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఈ కారు 6000 ఆర్పీఎం వద్ద 66 కిలోవాట్ పవర్, 4400 ఆర్పీఎ వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 మ్యానువల్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Maruthi, MARUTI SUZUKI

తదుపరి వార్తలు