హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vedanta: లక్ష రూపాయల ల్యాప్‌టాప్ రూ.40 వేలకే! ధరల భారీ తగ్గింపు!

Vedanta: లక్ష రూపాయల ల్యాప్‌టాప్ రూ.40 వేలకే! ధరల భారీ తగ్గింపు!

లక్ష రూపాయల ల్యాప్‌టాప్ రూ.40 వేలకే!

లక్ష రూపాయల ల్యాప్‌టాప్ రూ.40 వేలకే!

Semiconductor Chip | సెమీ కండక్టర్ల తయారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. అందుకే ఇప్పుడు వేదాంత భారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని విలువ రూ. .54 లక్షల కోట్లు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Anil Agarwal | రానున్న రోజుల్లో రూ.లక్ష విలువైన ల్యాప్ టాప్ రూ. 40 వేలకే లభించనుంది. లేదంటే ఇంకా తక్కువ ధరకే ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉండొచ్చు. వేదాంత (Vedanta) చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ విషయాన్ని తెలిపారు. దేశంలోనే సెమీకండక్టర్ చిప్స్ (Semiconductor Chip) అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అనిల్ అగ్వాల్ ఇటీవలనే ఫాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వేదాంత కంపెనీ కొత్తగా సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. గుజరాత్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 1.54 లక్షల కోట్లు.

  సీఎన్‌బీసీ టీవీ 18కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ మేడిన్ ఇండియా సెమీకండక్టర్ల వల్ల దేశంలో ఫినిష్డ్ ప్రొడక్టులపై చాలా ప్రభావం ఉండబోతోందని తెలిపారు. అగర్వాల్ ప్రకారం చూస్తే.. చిప్స్ అనేవి ప్రస్తుతం కొరియా, తైవాన్‌లో తయారు అవుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో కూడా వీటిని తయారు చేయగలమని పేర్కొన్నారు. డిజిటల్ కన్సూమర్ ప్రొడక్టుల్లో సెమీకండక్టర్లు లేదా మైక్రో చిప్స్‌ను ఉపయోగిస్తారు. కార్ల నుంచి మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు వరకు చాలా చోట్ల వీటిని వినియోగిస్తారు.

  బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. 4 నెలల కనిష్టానికి ధరలు

  దేశంలో 2021లో సెమీకండక్టర్ల మార్కెట్ విలువ 27 బిలియన్ డాలర్లుగా ఉంది. 2026 కల్లా ఈ రంగం 64 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే మన దేశంలో చిప్స్ తయారీ లేదు. ఇప్పటి వరకు ఎలాంటి చిప్స్‌ను తయారు చేయడం లేదు. అంటే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. దేశంలోనే చిప్స్ తయారీ జరగబోతోంది.

  రూ.9,999 ఫోన్ రూ.539కే అందుబాటులో! ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్!

  కాగా ఇటీవల కాలంలో మన దేశంలో సెమీకండక్టర్ల కొరత తీవ్రంగా ఉండేది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఫోకస్ చేసింది. సెమీకండక్టర్లను తయారు చేసే వారికి ప్రోత్సాహకాలు కల్పిస్తామని వెల్లడించింది. ఈ క్రమంలోనే వేదాంత బాస్ కొత్త ప్లాంటు స్థాపన తెర మీదకు వచ్చింది. దిగుమతులపై ఆధారపడట్టాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు కానున్న కంపెనీలో వేదాంతకు 60 శాతం వాటా ఉండనుంది. అలాగే ఫాక్స్‌కాన్‌కు 40 శాతం వాటా లభిస్తుంది. ప్లాంటు ఏర్పాటు అంశాన్ని అగర్వాల్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటు ఉంటుందని వెల్లడించారు. అలాగే టాటా గ్రూప్ తర్వాత వేదాంత కూడా మన దేశంలో యాపిల్ ఐఫోన్లను తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  రానున్న కాలంలో అన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Automobiles, Laptop, Smartphone

  ఉత్తమ కథలు