Home /News /business /

INDIA LOCKDOWN KNOW STATE BANK OF INDIA SBI KEY DECISIONS IN 2020 APRIL DUE TO CORONAVIRUS PANDEMIC SS

SBI: ఏప్రిల్‌లో ఎస్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...

SBI: ఏప్రిల్‌లో ఎస్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...
(ప్రతీకాత్మక చిత్రం)

SBI: ఏప్రిల్‌లో ఎస్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

SBI | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? మీరు ఎస్‌బీఐ కస్టమరా? అయితే లాక్‌డౌన్, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎస్‌బీఐ ఏప్రిల్‌లో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి తెలుసుకోండి.

    కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా పడింది. దీంతో పెద్దపెద్ద బ్యాంకులు కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా ఏప్రిల్ నెలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్నా, పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఉన్నా, లేదా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా బ్యాంకు తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసుకోవాల్సిందే. ఏప్రిల్‌లో ఎస్‌బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.

    1. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్‌బీఐ కస్టమర్లను ఆదుకోవడానికి ఎస్‌బీఐ ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఇస్తోంది. కేవలం 4 క్లిక్స్‌తో లోన్స్ మంజూరు చేస్తోంది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ రుణాలను ఇస్తోంది ఎస్‌బీఐ. లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    2. ఎస్‌బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి బ్యాంక్ షాకిచ్చింది. సేవింగ్స్ అకౌంట్‌పై ఇచ్చే వడ్డీని తగ్గించింది. అంటే సేవింగ్స్ అకౌంట్‌లో మీ డిపాజిట్లకు గతంలో కన్నా తక్కువ వడ్డీ వస్తుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    3. తరచూ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి ఊరట కలిగించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2020 జూన్ 30 వరకు ఏటీఎం సర్వీస్ ఛార్జీలు లేవని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    4. ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసేవారిని హెచ్చరించింది ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఈ వెబ్‌సైట్‌ను నమ్మొద్దని హెచ్చరిస్తోంది బ్యాంకు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    5. ఎస్‌బీఐ డెబిట్ కార్డుల కోసం అప్లై చేసినవారికి కీలక సమాచారాన్ని షేర్ చేసింది బ్యాంకు. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా డెబిట్ కార్డుల డెలివరీలో జాప్యం ఉంటుందని ప్రకటించింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

    6. ఎస్‌బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు ఈఎంఐ భారాన్ని తగ్గించింది బ్యాంకు. ఎస్‌బీఐలో హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లాంటి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    7. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులపై మారటోరియం ఎంచుకున్న కస్టమర్లను హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. మారటోరియం ఎంచుకునే కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్టు బ్యాంకు గుర్తించింది. అందుకే కస్టమర్లను అప్రమత్తం చేసింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

    8. ఎస్‌బీఐలో ఇప్పటికే ఈఎంఐ చెల్లించి వెనక్కి తీసుకోవాలనుకునే కస్టమర్లకు అవకాశం ఇస్తోంది బ్యాంకు. ఎస్‌బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, ఆటో లాంటి రుణాలు తీసుకున్నవారు మారటోరియం ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఈఎంఐ చెల్లిస్తే ఎలా వెనక్కి తీసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    మీ అకౌంట్‌లోకి రూ.1,500 వచ్చాయా? చెక్ చేయండి ఇలా

    Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే

    Paytm: పేటీఎంతో మీరూ డబ్బులు సంపాదించొచ్చు... ఎలాగంటే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Bank account, Bank loans, Banking, Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown, Rbi, Reserve Bank of India, Sbi, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు