Ease of Doing Business 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ జోరు..

Ease of Doing Business 2020 : సరళతర వ్యాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ 2020)లో భారత్ మరింత వృద్ధి చెందుతోంది. 190 దేశాల్లో వాణిజ్యంపై ప్రపంచ బ్యాంకు సర్వే నిర్వహించి విడుదల చేసిన ర్యాంకుల్లో భారత్ 63వ స్థానాన్ని సంపాదించింది.

news18-telugu
Updated: October 24, 2019, 8:20 AM IST
Ease of Doing Business 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ జోరు..
ప్రధాని మోదీ (ఫైల్)
  • Share this:
సరళతర వ్యాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ 2020)లో భారత్ దూసుకుపోతోంది. 190 దేశాల్లో వాణిజ్యంపై ప్రపంచ బ్యాంకు సర్వే నిర్వహించి విడుదల చేసిన ర్యాంకుల్లో భారత్ 63వ స్థానాన్ని సంపాదించింది. గత ఏడాది 77వ స్థానంలో నిలిచిన భారత్ ఈ సారి ఏకంగా 14 స్థానాలు ఎగబాకింది. వాణిజ్య అనుకూల విధానాలు, నిర్మాణ అనుమతులు, రుణం పొందడంలో సరళత, చిన్న సంఖ్యలోని పెట్టబడిదారులకు రక్షణ తదితర పది అంశాలను ప్రామాణికలుగా ఈ నివేదికను ప్రకటించారు. వాస్తవానికి గత ఏడాది 77వ స్థానంలో ఉన్న భారత్‌ను టాప్ 50లోకి తేవాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంచి ర్యాంకు సాధించడం భారత్‌కు కలిసిరానుంది. ఎన్డీయే సర్కారు తీసుకున్న నిర్ణయాలు, వాణిజ్య వాతావరణం పెరుగుదలకు తీసుకున్న చర్యలతో భారత్ ర్యాంకులో పైకి దూసుకెళ్లింది.

మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014లో మొత్తం 190 దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉంది. 2016లో 131కి ఎగబాకిన భారత్...2017లో 100కి, 2018లో 77కి, ఈ ఏడాది 63వ స్థానానికి చేరింది. గత ఏడాది దక్షిణాసియా దేశాల్లోనే సరళతర వాణిజ్యంలో భారత్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ సారి కూడా ఆ స్థానాన్ని కొనసాగించింది.

ఇదిలా ఉండగా, మొత్తంగా నంబర్ వన్ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఆ తర్వాత సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్ ఉన్నాయి. అమెరికా 6వ స్థానంలో, యూకే 8వ స్థానంలో చైనా 31వ స్థానంలో, పాకిస్తాన్ 108వ స్థానంలో ఉన్నాయి.



First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు