Industrial output: పడకేసిన పారిశ్రామికం....డిసెంబరు ఐఐపీ డేటా 0.3 శాతానికి పతనం

Industrial output: డిసెంబరు నెలకు సంబంధింన పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఐఐపీ డేటా 0.3 శాతంకు పడిపోయింది. దీంతో దేశ ఆర్థిక వృద్దిపై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Krishna Adithya | news18-telugu
Updated: February 12, 2020, 11:25 PM IST
Industrial output: పడకేసిన పారిశ్రామికం....డిసెంబరు ఐఐపీ డేటా 0.3 శాతానికి పతనం
స్టీల్ ప్లాంట్ (ఫైల్ ఫొటో)
  • Share this:
డిసెంబరు నెలకు సంబంధింన పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఐఐపీ డేటా 0.3 శాతంకు పడిపోయింది. దీంతో దేశ ఆర్థిక వృద్దిపై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజా ఐఐపీ గణాంకాలు ప్రకారం చూస్తే డిసెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) 0.3 శాతానికి పడిపోయింది. 2018 డిసెంబర్‌లో ఇది 2.5 శాతం ఉండటం గమనార్హం. యంత్ర పరికరాలు, మన్నికైన వినిమయ వస్తువులు, మౌలిక, నిర్మాణ రంగాల వృద్ధి మందగించడమే ఇందుకు ప్రధాన కారణంగా అనలిస్టులు చెబుతున్నారు. అలాగే చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ కూడా బాగా ప్రభావం చూసినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు.

బుధవారం విడుదల చేసిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం, ఉత్పత్తి రంగం 1.2 శాతం క్షీణించినట్లు నమోదైంది. గత నెల ఇది 2.7 శాతంగా ఉంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా 0.1 శాతం తగ్గింది. అయితే ఇది గత నెల 5 శాతం పతనమైంది.అయితే మైనింగ్ రంగ ఉత్పత్తి 5.4 శాతం పెరిగింది. అలాగే ప్రైమరీ ప్రాడెక్ట్స్ లో మాత్రం 2.2 శాతం వృద్ధి నమోదు కాగా. కాపిటల్ గూడ్స్ లో మాత్రం డిసెంబర్ లో 18.2 శాతానికి పడిపోయింది. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ డిసెంబర్‌లో 6.7 శాతానికి పతనమైంది.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు