అమెరికాకు భారత్ ఝలక్.. ఈ 28 వస్తువులపై ఇంపోర్ట్ డ్యూటీ పెంపు..

అమెరికాలో ఉత్పత్తి చేసినవి లేదా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఈ దిగుమతి సుంకం వర్తిస్తుంది.

news18-telugu
Updated: July 3, 2019, 7:33 PM IST
అమెరికాకు భారత్ ఝలక్.. ఈ 28 వస్తువులపై ఇంపోర్ట్ డ్యూటీ పెంపు..
నరేంద్ర మోదీని అభినందిస్తున్న ట్రంప్..
  • Share this:
అమెరికాకు భారత్ ఝలక్ ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే అల్యూమినియం వస్తువుల మీద గత మార్చిలో సుంకాన్ని పెంచింది. దీంతో భారత్ కూడా అమెరికాకు షాక్ ఇస్తూ యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీని పెంచింది. అమెరికాలో ఉత్పత్తి చేసినవి లేదా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఈ దిగుమతి సుంకం వర్తిస్తుంది. పెరిగిన ఇంపోర్ట్ డ్యూటీ జూన్ 16 నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద దిగుమతి సుంకం తగ్గించాల్సిందిగా అమెరికాను పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల సందర్భంగా కూడా ఈ చర్చ జరిగింది. కానీ, అగ్రరాజ్యం నుంచి ఎలాంటి సానకూల స్పందన రాలేదు.

దిగుమతి సుంకం పెంచిన 28 వస్తువులు

దిగుమతి సుంకం పెంచిన వస్తువుల జాబితా


దిగుమతి సుంకం పెంచిన వస్తువుల జాబితా
దిగుమతి సుంకం పెంచిన వస్తువుల జాబితా


దిగుమతి సుంకం పెంచిన వస్తువుల జాబితా


 
First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>