హోమ్ /వార్తలు /బిజినెస్ /

Narendra Modi: కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని ప్రశంసలు.. దేశ GDP రూ. 2.3 లక్షల కోట్లకు పెరిగిందన్న మోదీ..

Narendra Modi: కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని ప్రశంసలు.. దేశ GDP రూ. 2.3 లక్షల కోట్లకు పెరిగిందన్న మోదీ..

కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ప్రగతిశీల బడ్జెట్ భారత భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుందని బుధవారం పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ప్రగతిశీల బడ్జెట్ భారత భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుందని బుధవారం పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ప్రగతిశీల బడ్జెట్ భారత భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుందని బుధవారం పేర్కొన్నారు.

    కేంద్ర బడ్జెట్‌పై(Budget) ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi). ఈ ప్రగతిశీల బడ్జెట్ భారత భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తుందని బుధవారం పేర్కొన్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) ఏడెనిమిదేళ్లలో రూ. 1 లక్ష కోట్లకు పైగా పెరిగిందని చెప్పారు. బుధవారం భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా 2022 బడ్జెట్‌లోని హైలెట్స్‌ను ప్రస్తావించారు. నిరుపేదలు, మధ్యతరగతి, యువతకు నిత్యావసర వస్తువులను అందించడంపై బడ్జెట్‌ దృష్టి సారిస్తోందన్నారు. ‘ఏడు-ఎనిమిదేళ్ల క్రితం భారతదేశ జీడీపీ రూ. 1 లక్షా 10,000 కోట్లు. కానీ నేడు అది దాదాపు రూ. 2 లక్షల 30,000 కోట్లు. దేశ ఫారెక్స్ నిల్వలు కూడా 200 బిలియన్ డాలర్ల నుంచి 630 బిలియన్ డాలర్లకు(Dollars) పెరిగాయి. 2013-14లో భారతదేశ ఎగుమతులు(Exports) దాదాపు రూ. 2 లక్షల 50,000 కోట్లు. కానీ నేడు ఎగుమతులు దాదాపు రూ.4 లక్షల 70,000 కోట్లకు చేరుకున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వ సమర్థవంతమైన విధానాలే కారణం’ అని ప్రధాని చెప్పారు. మోదీ ప్రసంగంలోని కీలక అంశాలు..

    You Retire: ప్రతిపక్ష బెంచీల వద్దకు PM Modi..ఎంపీలకు విషెస్.. ఆ ఒక్కమాటతో అంతా షాక్!


    గ్రామీణాభివృద్ధి

    జల్ జీవన్ మిషన్ పథకం కింద 2 సంవత్సరాల్లో దాదాపు 9 కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి నీటిని అందించామని మోదీ చెప్పారు. 5 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు నీటి కనెక్షన్‌ను అందించామని తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు 4 కోట్ల గ్రామీణ గృహాలకు పైప్ వాటర్ కనెక్షన్ అందుబాటులో ఉంటుందని, ఇది రైతులకు మేలు చేసే విషయమని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నిరుపేదలకు 80 లక్షల పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.48,000 కోట్లు వెచ్చించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది మహిళలను ఇంటి యజమానులుగా చేసిందని మోదీ పేర్కొన్నారు.

    సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి

    సరిహద్దు గ్రామాలు దేశానికి కోటలుగా పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే "వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్" గురించి ఆయన ప్రస్తావించారు. ‘బడ్జెట్‌లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి ప్రస్తావన ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా సరిహద్దు గ్రామాలు పర్యాటక ప్రదేశాలుగా మారవచ్చు. ఇలాంటి ప్రాంతాలైన ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లలో హోమ్‌స్టే నెట్‌వర్క్‌లను ప్రవేశపెట్టవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇలాంటి గ్రామాలు లబ్ధి పొందుతాయి’ అని మోదీ చెప్పారు.

    OMG: వామ్మో, ఇదేందయ్యా! అతనికి 8మంది భార్యలు.. ఒకే ఇంట్లో కాపురం.. వంతులవారీగా ఆ పని..


    రైతుల సంక్షేమం

    రైతులు సేంద్రియ వ్యవసాయంతో పాటు సాగులో టెక్నాలజీ వాడకాన్ని అలవర్చుకోవాలని ప్రధాని మోదీ కోరారు. కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు డ్రోన్ టెక్నాలజీ, ఇతర పరికరాలను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)ల ద్వారా అందజేస్తామని చెప్పారు. గంగా నది ఒడ్డున "నేచురల్ ఫార్మింగ్ కారిడార్" నిర్మాణం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇది రైతులకు నీటిపారుదల ప్రక్రియలో సహాయం చేస్తుందన్నారు. దీంతో పాటు గంగా స్వచ్చత అభియాన్‌కు కూడా తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. కారిడార్ 2500 కి.మీ పొడవు, 10 కి.మీ వెడల్పు ఉంటుందని, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల గుండా వెళుతుందని చెప్పారు. అదనంగా MSP కోసం, 68,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. దీని ద్వారా మొత్తం 11 కోట్ల కంటే ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

    స్పోర్ట్స్

    బడ్జెట్‌లో క్రీడలకు ప్రాధాన్యత లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. దీని కోసం బడ్జెట్‌ను కొన్నేళ్ల నుంచి మూడు రెట్లు పెంచామని, స్పోర్ట్స్‌పై ఆసక్తి చూపే యువతకు ఇది మేలు చేస్తుందని తెలిపారు. ఖేలో అభియాన్ గురించి కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

    పోస్టాఫీసులు

    దేశంలో 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. వీటి ద్వారా ప్రజలు ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ATM, ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ప్రయోజనాలను పొందే ఏర్పాట్లు చేశామన్నారు. డబ్బు డిపాజిట్ చేయడానికి పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాలను ఇంటర్నెట్ ద్వారా కల్పిస్తున్నామని వివరించారు.

    5G టెక్నాలజీ

    అతి త్వరలో ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ కల్పిస్తామని మోదీ చెప్పారు. 5G టెక్నాలజీ కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు. 5G టెక్నాలజీ సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని మోదీ తెలిపారు.

    డిజిటల్ రూపీ

    డిజిటల్ రూపీ ఫిన్‌టెక్ రంగానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెడుతుందని, దీన్ని పర్యవేక్షణ బాధ్యతలు ఆర్బీఐ చూసుకుంటుందని చెప్పారు. ఫిజికల్ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోగల ఈ డిజిటల్ రూపాయితో డిజిటల్ పేమెంట్స్ సెక్యూరిటీ మరింత పెరుగుతుందన్నారు.

    Statue of Equality: ఫిబ్రవరి 5న ‘స్టాట్యూ ఆఫ్​ ఈక్వాలిటీ’ ఆవిష్కరణ.. ఈ విగ్రహం గురించి 10 విషయాలు మీ కోసం..


    స్టార్టప్‌లు, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ పన్ను ప్రయోజనాలు

    బడ్జెట్‌లో స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు కల్పించినట్లు మోదీ చెప్పారు. యువత ఆవిష్కరణలకు మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వ పెట్టుబడులను రూ.7,50,000 కోట్లకు పరిమితం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇది అపారమైన అవకాశాలను కల్పిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

    IT రిటర్న్ ఫైలింగ్

    ఐటీ రిటర్న్ ఫైలింగ్‌లో కంప్యూటర్ లోపం లేదా ప్రింట్ లోపం ఉంటే, ఆ వ్యక్తి రెండేళ్లలో తప్పును సరిదిద్దుకోవచ్చని ప్రధాని మోదీ చెప్పారు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను సులభతరం చేసినట్లు తెలిపారు. ఈ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లు ప్రధాని గుర్తుచేశారు.

    First published:

    Tags: Budget, Budget 2022-23, Union Budget 2022

    ఉత్తమ కథలు