Home /News /business /

INDIA FIRST LIFE INSURANCE LAUNCHES SARAL BACHATH INSURANCE PLAN KNOW BENEFITS SS GH

Life Insurance: ఇండియా ఫస్ట్ సంస్థ నుంచి సరికొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్... ప్రయోజనాలివే

Life Insurance: న్యూ ఇండియా ఫస్ట్ సంస్థ నుంచి సరికొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్... ప్రయోజనాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Life Insurance: న్యూ ఇండియా ఫస్ట్ సంస్థ నుంచి సరికొత్త లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్... ప్రయోజనాలివే (ప్రతీకాత్మక చిత్రం)

India First Life saral bachath insurance plan | మీరు ఏదైనా ఇన్స్యూరెన్స్ పాలసీ (Insurance Policy) తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సరళ్ బచత్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
జీవిత బీమాలో అనేక సంస్థలు రకరకాల పాలసీలు అందిస్తున్నాయి. అయితే ఇండియా ఫస్ట్ ఇన్సూరెన్స్ సంస్థ (India First Life Insurance) ప్రవేశ పెట్టిన నూతన ప్లాన్ ఆకర్షణీయంగా ఉంది. కొత్తగా వచ్చిన సరళ్ బచత్ బీమా ప్లాన్‌లో (saral bachath insurance) 5 నుంచి 7 సంవత్సరాలు బీమా చెల్లించి.. 15 ఏళ్ల వరకు కుటుంబం మొత్తానికి బీమా కవరేజీ పొందవచ్చు. ఇది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్, లిమిటెడ్ ప్రీమియం పాలసీ. ఈ ప్లాన్‌లో కేవలం ఐదు నుంచి ఏడు సంవత్సరాల స్వల్ప కాలానికి బీమా చెల్లించడం ద్వారా కుటుంబం మొత్తానికి 12 నుంచి 15 సంవత్సరాలపాటు బీమా రక్షణ లభిస్తుంది.

IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా

బీమా ప్రయోజనాలివే...

బీమా చేసిన వారిలో ఎవరికైనా అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబానికి అండగా నిలిచేందుకు సరల్‌ బచత్ బీమా పాలసీ తీసుకువచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో మొదటి సంవత్సరం యాక్సిడెంటల్ డెత్ కవరేజీకి అదనంగా ప్రయోజనాలు అందిస్తున్నారు. మెడికల్ టెస్టుల మినహాయింపు, అంత్యక్రియల ఖర్చులు వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. మెచూరిటీ తరువాత హామీ ఇచ్చిన మొత్తాన్ని పొందవచ్చు. ఆదాయపన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

Electricity Bills: కరెంట్ బిల్ కట్టాలా? ఈ యాప్స్‌తో ఈజీగా బిల్ చెల్లించండి ఇలా

వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సరల్‌ బచత్ బీమా ప్లాన్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్యూరెన్స్ కంపెనీ డిప్యూటీ సీఈవో రుషబ్ గాంధీ. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో పొదుపుతోపాటు, బీమా రక్షణ కూడా పొందవచ్చని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్‌లు ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్యూరెన్స్ స్కీమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్టు వివరించారు.

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు తేలిగ్గా అర్థం చేసుకోగలిగే విధంగా ఈ ప్లాన్ ఉంటుందన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా గ్రామీణ, వ్యవసాయ బ్యాంకింగ్ సీజీఎం సంజీవ్ దబోల్. రక్షణ, భద్రత, ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలనుకునే వారు ఓటీసీ ద్వారా చాలా తేలిగ్గా ఈ బీమా పథకంలో చేరవచ్చని తెలిపారు. ఇండియాఫస్ట్ లైఫ్ తీసుకువచ్చిన సరల్‌ బచత్ బీమా ప్లాన్ మంచి ఆదరణ పొంది వేగంగా వృద్ధి చెందుతుందని దబోల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Insurance, Life Insurance, Personal Finance

తదుపరి వార్తలు