news18-telugu
Updated: November 21, 2020, 5:37 PM IST
ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో భారత్ కీలక దశలోకి ప్రవేశించిందని, ఈ సమయంలో కరోనా ఫై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శనివారం అన్నారు. ప్రభుత్వం తీసుకునే సాహసోపేతమైన సంస్కరణలు వేగంగా ఈ సంక్షోభం నుంచి కోలుకోవటానికి అలాగే రాబోయే సంవత్సరాల్లో వేగంగా పురోగతి వైపు వెళ్లేందుకు దారితీస్తాయని ఆయన అన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న COVID-19 కేసుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అహ్మదాబాద్ వంటి పట్టణాల్లో తిరిగి ఆంక్షలను ప్రవేశపెట్టడంతో పాటు దేశ రాజధాని నుంచి పలు నగరాలకు ప్రయాణాలను పరిమితం చేయడం ఈ వ్యాఖ్యలు పూర్వరంగంగా పేర్కొనవచ్చు.
అలాగే ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. "COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం ఒక క్లిష్టమైన దశలోకి ప్రవేశించింది. ఈ సమయంలో రక్షణాత్మక ధోరణి విడనాడటం చాలా ఆందోళన కలిగించడంతో పాటు భరించ శక్యం కాని విషయం " అని పండిట్ దీన్దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం (పిడిపియు) ఎనిమిదవ కాన్వకేషన్ సందర్భంగా ముఖేష్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ ఈ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ హోదాలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అంతేకాదు ఆయన ఈసందర్భంగా మరిన్ని విషయాలను ఉటంకిస్తూ..”భారతదేశం ఒక పురాతన భూమి, గతంలో సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొందని, అయితే సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారీ చాలా బలంగా నిలబడిందని, ప్రజలలోనూ, సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిందని” గుర్తు చేశారు.
ఈ సమావేశంలో ప్రసంగించిన అంబానీ, కోవిడ్ అనంతర కాలంలో గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ఆందోళన చెందకుండా ఆశతో, విశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు.అంతేకాదు రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుందని ఆయన అన్నారు.
అలాగే ముఖేష్ అంబానీ మాట్లాడతూ...ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారాలలో ఒకటిగా ఉందని అయినప్టపికీ పర్యావరణం దెబ్బతినకుండా మన ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టడానికి ప్రత్యామ్నాయ ఇంధన శక్తిని ఉత్పత్తి చేయగలమా అనేది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలు అని గుర్తు చేశారు. అంతేకాదు ఆర్థిక సూపర్ పవర్ అవ్వడంతె పాటు స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీ సూపర్ పవర్ గా మారడానికి భారత్ ఏకకాలంలో రెండు లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని అంబానీ గుర్తుచేశారు.
అంతేకాదు ఈ లక్ష్యాన్ని సాధించడానికి పునరుత్పాదక, తక్కువ కార్బన్ మరియు కార్బన్ రీసైకిల్ టెక్నాలజీలలో మార్పు చూపించే పరిష్కారాలు అవసరమన్నారు. . గ్రీన్ అండ్ బ్లూ హైడ్రోజన్ వంటి కొత్త ఇంధన వనరులలో పురోగతి అవసరం అన్నారు. ఇంధన నిల్వ, పొదుపు మరియు వినియోగంలో కూడా గొప్ప ఆవిష్కరణలు అవసరం" అని ఆయన అన్నారు. ఈ వేడుకలో 39 దేశాల నుండి 284 మంది విద్యార్థులతో సహా 2,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. .
Published by:
Krishna Adithya
First published:
November 21, 2020, 5:35 PM IST