ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుక్కోవడం కామన్. ఐతే... చాలా సందర్భాల్లో వస్తువులు ఒకటి కొంటే మరొకటి వస్తుండటం, వచ్చినవి కూడా డూప్లికేటో, పాడైపోయినవో వస్తుండటం ఇలా చాలా రకాల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల నష్టపోతున్నది వినియోగదారులే. మరెలా అని ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్‌పై ప్రత్యేక బిల్లు రెడీ చేస్తోంది. ఈ చట్టం ద్వారా మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాతోపాటూ... ఆయా రంగాల అభివృద్ధికి అవకాశాలు కల్పించబోతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో వస్తువులు కొన్నప్పుడు వినియోగదారులు ఇచ్చే వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించే అంశాలు కూడా ఇందులో ఉండబోతున్నాయి. కొత్త రూల్స్‌ని ఏవైనా సంస్థలు వ్యతిరేకించినా, ఉల్లంఘించిన కఠిన చర్యలు ఉండేలా బిల్లు రూపొందుతోందని తెలిసింది. ఐతే... పెట్టుబడిదారులు, వ్యాపారులు, రిటైలర్లు, వినియోగదారులు అందరి నిర్ణయం తర్వాతే అమల్లోకి తెస్తారని తెలిసింది.
వినియోగదారులతోపాటూ ఈ-కామర్స్ సంస్థలు కూడా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా కొంతమంది ఆన్‌లైన్‌లో మంచి వస్తువే ఇచ్చినా... దాని స్థానంలో పాడైన వస్తువు ఉంచి... అదే తమకు పంపారని మోసాలు చేస్తున్నారు. ఇలాంటి అంశాల్ని కూడా లెక్కలోకి తీసుకుంటూ ఆరు అంశాలతో డ్రాఫ్ట్ ప్రతిని తయారు చేసింది కేంద్రం.
ఇందులో డేటా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ-కామర్స్ మార్కెట్ స్థలం, రెగ్యులేటరీ సమస్యలు, దేశీయ డిజిటల్ ఆర్థికం, ఎగుమతుల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్చల్ని చెబుతూ 41 పేజీల్లో ఈ-కామర్స్ పాలసీని రూపొందించింది.
బిల్లు చట్టమై... అమల్లోకి వస్తే ప్రతి ఉత్పత్తిపై గరిష్ఠ రిటైల్ ధరను, కొనుగోలు చేసిన వారికి ఇన్వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్వాయిస్‌పై అమ్మిన వారి పేరు, పూర్తి వివరాలు, అడ్రెస్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది.
ట్రేడ్ మార్క్ కలిగిన యజమానులు... ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ కింద రిజిస్టార్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ డ్రాఫ్ట్ పాలసీపై వాటాదారులకు ఏవైనా సందేహాలు ఉంటే మార్చి 9 లోగా పంపాలని కేంద్రం సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, E-commerce