RCEP: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్‌) ఒప్పందానికి భారత్ దూరం...తేల్చిచెప్పిన మోదీ

ఆర్‌సెప్‌ ఒప్పందంపై సంతకం చేయకుండా దూరంగా ఉండాలని భారత్ తీర్మానించింది. అలాగే భారత్‌.. చైనా దిగుమతులపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వాణిజ్యంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది.

news18-telugu
Updated: November 4, 2019, 7:30 PM IST
RCEP: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్‌) ఒప్పందానికి భారత్ దూరం...తేల్చిచెప్పిన మోదీ
ఆసియన్ సదస్సులో ప్రధాని మోదీ
  • Share this:
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్‌) ఒప్పందంపై భారత్ సంతకం చేయడం లేదని భారత్ ప్రకటించింది. బ్యాంకాక్ లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో ఆర్‌సెప్ ఒప్పందంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, దేశ వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందం నుంచి దూరంగా ఉంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ముఖ్యంగా దేశంలోకి చైనా వస్తుత్పత్తులు వరదలా కొట్టుకువచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బృందం ఆసియన్ సదస్సులో ఆర్‌సెప్ ఒప్పందంపై నిర్ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఈ ఒప్పందం అమల్లోకి వస్తే దేశంలోకి చైనా నుంచి వచ్చే చౌక వస్తువులతో నిండిపోయి ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొంటుందని పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మూడు రోజుల పాటు బ్యాంకాక్‌లో జరిగే ఆసియాన్‌ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆర్‌సెప్‌ ఒప్పందంపై సంతకం చేయకుండా దూరంగా ఉండాలని భారత్ తీర్మానించింది. అలాగే భారత్‌.. చైనా దిగుమతులపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వాణిజ్యంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది.

అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌)లో మొత్తం 16 సభ్యదేశాలు ఉండగా.. అందులో భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్‌కి సంబంధించిన ఆర్‌సెప్‌ ఒప్పందంపై సంతకం చేస్తే ఆ మేరకు దిగుమతి సుంకాలను ఆయా దేశాలు తొలగించాల్సి ఉంటుంది.

First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...