మీరు ఇండేన్ గ్యాస్ కస్టమరా? సబ్సిడీలో ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తుంటారా? ఎప్పట్లాగే మీకు సబ్సిడీ డబ్బులు రావట్లేదా? అయితే మీ సబ్సిడీ కోసం మీరు కంప్లైంట్ చేయొచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసే కస్టమర్లలో చాలా మంది తమ అకౌంట్‌లోకి సబ్సిడీ వస్తుందో లేదో చెక్ చేసుకోరు. కొన్ని నెలలు సబ్సిడీ అకౌంట్‌లోకి రాకపోయినా పట్టించుకోరు. తర్వాత ఎప్పుడో చెక్ చేసుకుంటే సబ్సిడీ రాలేదన్న విషయం తెలుస్తుంది. అప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలో అర్థం కాదు. మీకు సబ్సిడీ రాకపోతే నేరుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు కంప్లైంట్ చేయొచ్చు. మీరు కంప్లైంట్ చేసిన కొన్ని గంటల్లోనే సబ్సిడీ మీ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. సాధారణంగా ప్రతీ కుటుంబానికి గరిష్టంగా 12 సిలిండర్లకు సబ్సిడీ వస్తుంది. అయితే కస్టమర్లు ముందుగా మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత సబ్సిడీ కస్టమర్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రతీ నెల మారుతుంది కాబట్టి సబ్సిడీ కూడా మారుతుంది. మరి ఇండేన్ గ్యాస్ కస్టమర్లు తమకు సబ్సిడీ రాకపోతే ఎలా కంప్లైంట్ చేయాలో, సబ్సిడీ ఎలా పొందాలో తెలుసుకోండి.
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు సబ్సిడీ విషయమై కంప్లైంట్ చేయడానికి ముందుగా https://cx.indianoil.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Contact Us పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో LPG పైన క్లిక్ చేయాలి. ఓ స్క్రీన్ కనిపిస్తుంది. అందులో మీ సమస్యను వివరించాల్సి ఉంటుంది. సమస్య మొత్తం వివరించాల్సిన అవసరం లేదు. Subsidy Related అని టైప్ చేసి Proceed పైన క్లిక్ చేస్తే చాలు. గ్రీవియెన్స్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Subsidy Related PAHAL పైన క్లిక్ చేయాలి. సబ్ కేటగిరీలో మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. Subsidy not received పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా LPG ID ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి. అందులో పూర్తి వివరాలు కనిపిస్తాయి. మరిన్ని వివరాలు ఏవైనా కావాలంటే ఇండేన్ గ్యాస్ కస్టమర్ కేర్ నెంబర్ 1800-233-3555 కు ఫోన్ చేసి మీ సమస్య వివరించొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.