• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • INCREASE YOUR HEALTH INSURANCE COVERAGE WITH TOP UP POLICY KNOW HOW TO CHOOSE AND HOW IT WORKS SS GH

Top-Up Health Insurance: టాప్-అప్ పాలసీతో మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజీ పెంచుకోండి ఇలా

Top-Up Health Insurance: టాప్-అప్ పాలసీతో మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజీ పెంచుకోండి ఇలా

Top-Up Health Insurance: టాప్-అప్ పాలసీతో మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజీ పెంచుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Top-Up Health Insurance | మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా? మీ కవరేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే తక్కువ ప్రీమియంతో టాప్ అప్ పాలసీ తీసుకొని మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజీని పెంచుకోండి.

  • Share this:
కరోనా భయం పెరగడంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై ప్రజలకు అవగాహన పెరిగింది. ఇవి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను భర్తీ చేస్తాయి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీ పరిధిని టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా పెంచుకోవచ్చు. ఇది ఒక అనుబంధ ఆరోగ్య బీమా ప్లాన్ వంటిది. కొద్దిపాటి అదనపు ప్రీమియం ద్వారా కవరేజీని పెంచుకునే టాప్ అప్ ప్లాన్లను వైద్య అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవాలి. టాప్ అప్ పాలసీలో డిడక్టబుల్ లిమిట్ ఆధారంగా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అంటే వైద్య ఖర్చులు ఈ డిడక్టబుల్ లిమిట్ దాటితేనే.. ఆ మొత్తానికి క్లెయిమ్ వర్తిస్తుంది. డిడక్టబుల్ లిమిట్‌ను ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్దేశిస్తాయి. బీమా విలువను బట్టి ఇది మారుతుంది.

ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ.5 లక్షల విలువైన టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకుందాం. పాలసీకి రూ.2 లక్షలు డిడక్టబుల్ లిమిట్ ఉందనుకుందాం. పాలసీదారుడికి హాస్పిటల్లో చికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చులు రూ.2 లక్షలు దాటితేనే టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. చికిత్సకు అంతకంటే తక్కువ ఖర్చయితే టాప్ అప్ పాలసీ ద్వారా అదనపు క్లెయిం వర్తించదు. కానీ ఈ సందర్భంలో రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని క్లెయిమ్ చేసుకోవచ్చు.

Curie Doc App: టీ-హబ్ నుంచి 'క్యూరీ డాక్' స్టార్టప్... ఈ యాప్ ఉంటే డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే

SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... ఏ కార్డుపై ఎంతంటే

టాప్ అప్ పాలసీ రకాలు


టాప్ అప్ పాలసీ వల్ల పాలసీదారులు అదనంగా లబ్ధి పొందవచ్చు. ఈ విభాగంలో రెండు రకాల పాలసీలు ఉన్నాయి. ఒకటి టాప్ అప్ ఇన్సూరెన్స్, రెండోది సూపర్ టాప్ అప్ ఇన్సూరెన్స్ పాలసీ. టాప్ అప్ ప్లాన్‌లో ప్రతి క్లెయిమ్‌ను డిడక్టబుల్ లిమిట్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ లిమిట్ దాటితేనే అదనపు క్లెయిమ్ వర్తిస్తుంది. సూపర్ టాప్ అప్ ప్లాన్‌లో.. ఒక సంవత్సరంలో అయ్యే మొత్తం క్లెయిమ్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మొత్తం ఖర్చులు డిడక్టబుల్ లిమిట్ దాటితేనే అదనపు క్లెయిమ్ వర్తిస్తుంది.

పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు


ఇప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బీమా మొత్తం (sum insured) కంటే ఎక్కువ డిడక్టబుల్ లిమిట్ ఉండే టాప్ అప్ ప్లాన్లను ఎంచుకోవాలి. ఒకవేళ వైద్య ఖర్చులు డిడక్టబుల్ లిమిట్ కంటే తక్కువ ఉంటే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతకు మించి అయ్యే ఖర్చులను టాప్ అప్ ప్లాన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతోపాటు టాప్ అప్ ప్లాన్ల వెయిటింగ్ పీరియడ్‌ను కూడా పరిశీలించాలి. క్లెయిమ్ కోసం వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండే కంపెనీలను ఎంచుకోవడం మంచిది. కవరేజీ లిమిట్స్, ఇతర నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండే కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల పాలసీలను పోల్చి చూసి, సరైన ప్లాన్‌ను ఎంచుకోవాలి.

Tata Sky: టాటా స్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఈ ప్రోమో కోడ్స్‌తో కొత్త ఆఫర్స్ పొందండి

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

టాప్ అప్ ప్లాన్‌ల పనితీరు ఎలా ఉంటుంది?


హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న బేసిక్ పాలసీ పరిధిని పెంచుకోవచ్చు. ఇందుకు అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక 35 ఏళ్ల వ్యక్తికి రూ.5 లక్షలకు ఆరోగ్య బీమా ఉందనుకుందాం. ఇందుకు అతడు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ వ్యక్తి పాలసీ కవరేజీని రూ.10 లక్షలకు పెంచాలనుకుంటే.. అతడికి రెండు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత బేసిక్ పాలసీ పరిధిని రూ.10 లక్షలకు విస్తరించుకోవచ్చు. కానీ ఇందుకు చెల్లించాల్సిన ప్రీమియం రూ.10,000 నుంచి రూ.12,000కు పెరుగుతుంది. అంటే రూ.5 లక్షల అదనపు బీమా విలువ కోసం రూ.4,000 వరకు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి.

ఇలా కాకుండా ఆ వ్యక్తి అదనంగా టాప్ అప్ ప్లాన్‌ను తీసుకుంటే ప్రీమియం చాలా వరకు ఆదా అవుతుంది. అంటే ఇప్పటికే ఉన్న రూ.5 లక్షల పాలసీని అలాగే కొనసాగించాలి. దీనికి అదనంగా రూ.5 లక్షల టాప్ అప్ ప్లాన్‌ తీసుకోవాలి. దీనికి ప్రీమియం రూ.1,000 నుంచి రూ.2,000 వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది కంపెనీని బట్టి కొంత వరకు మారవచ్చు. ఈ విధానంలో తక్కువ ప్రీమియంతో పాలసీ పరిధిని పెంచుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడానికి ఇదే ఉత్తమ మార్గమని ఇన్సూరెన్స్ అడ్వైజర్లు సూచిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు