బంగారం కావాలా నాయనా... కొనేవాడు కరువయ్యాడు...

పెళ్లిళ్ల సమయంలో తప్పదు కాబట్టి కొంటారు కానీ... సెంటిమెంట్ కోసం బంగారం కొని దాచుకునే పరిస్థితులు మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. మామూలుగా అయితే ఏడాదంతా బంగారం అమ్మకాలు ఎలా ఉన్నా... దసరా, ధంతేరాస్, దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్‌లో సేల్స్ జోరుగా ఉంటాయి. కానీ ఇదంతా గతం. ఈసారి సేల్స్ తక్కువగానే ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. దీంతో నగల వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది.

news18-telugu
Updated: November 1, 2018, 6:16 PM IST
బంగారం కావాలా నాయనా... కొనేవాడు కరువయ్యాడు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగారం... ప్రపంచమంతా ఇన్వెస్ట్‌మెంట్‌లా చూస్తే... భారతీయులకు మాత్రం బంగారం సెంటిమెంట్. బంగారం కొనకుండా ముఖ్యమైన పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరగవు. దీపావళి, ధంతేరాస్, అక్షయ తృతీయ లాంటి సీజన్‌లు వచ్చాయంటే నగల దుకాణాలన్నీ కళకళలాడుతుంటాయి. మరి ఈసారి ధంతేరాస్, దీపావళి సీజన్‌లో కూడా జ్యువెలరీ షాపులు ఇలాగే కళకళలాడుతాయా అంటే అనుమానమే అంటున్నారు నిపుణులు. ఇందుకు చాలా కారణాలున్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగకపోయినా... కొంతకాలంగా రేటు పెరుగుతూనే ఉంది. దీంతో కస్టమర్లు ఈసారి నగల దుకాణాలవైపు చూసే అవకాశాలు తక్కువే అన్న వాదన వినిపిస్తోంది.

ఈ ఏడాదిలో చూస్తే ఇప్పటి వరకు బంగారం ధరలు 6.5 శాతం పెరిగాయని అంచనా. ధరలు ఇలా పెరుగుతుంటే సామాన్యులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తారా అన్న అనుమానాలున్నాయి. పెళ్లిళ్ల సమయంలో తప్పదు కాబట్టి కొంటారు కానీ... సెంటిమెంట్ కోసం బంగారం కొని దాచుకునే పరిస్థితులు మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. మామూలుగా అయితే ఏడాదంతా బంగారం అమ్మకాలు ఎలా ఉన్నా... దసరా, ధంతేరాస్, దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్‌లో సేల్స్ జోరుగా ఉంటాయి. కానీ ఇదంతా గతం. ఈసారి సేల్స్ తక్కువగానే ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. దీంతో నగల వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది.

Ahead of Dhanteras, World Gold Council raises concerns on gold prices
ప్రతీకాత్మక చిత్రం


బంగారం అమ్మకాలు తగ్గుతాయనడానికి ధరల పెరుగుదల ఓ కారణం అయితే... ఈ వర్షాకాలంలో సరిగ్గా వానలు కురకపోవడం మరో కారణమంటున్నారు నిపుణులు. బంగారానికి, వర్షానికి సంబంధం ఏంటనుకుంటున్నారా? భారతదేశంలో బంగారం డిమాండ్‌లో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతం నుంచే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు, ఉపాధి మార్గాలన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉంటాయి. దీంతో ఈసారి వ్యవసాయం సరిగ్గా లేకపోవడం, జనం దగ్గర డబ్బులు లేకపోవడం, ఆ ప్రభావం పరోక్షంగా బంగారం అమ్మకాలపై పడుతోంది.ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.32,492. అంటే... రూ.33,000 వైపు పరుగులు తీస్తోంది. పండుగ సీజన్‌లో బంగారం ధరలు పెరుగుతుండటం ప్రపంచ బంగారం సమాఖ్య(డబ్ల్యూజీసీ)ను సైతం కలవరపరుస్తోంది. ఈసారి బంగారం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా.

 

ఇవి కూడా చదవండి:హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా?

ఇక ఆన్‌లైన్‌లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్

మీ బడ్జెట్‌లో ఈ 5 మార్పులు కనిపించాయా? అప్పులపాలవుతున్నట్టే...

Photos: షేర్ మార్కెట్‌లో రాణించాలా? ఈ సినిమాలు చూడండి!
First published: November 1, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు