IT Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చిందా? స్టేటస్ తెలుసుకోండి ఇలా

Income Tax Refund Status | మీరు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? పన్నులు చెల్లించారా? ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్‌ స్టేటస్‌ని ట్రాక్ చేయొచ్చు.

news18-telugu
Updated: September 4, 2019, 3:56 PM IST
IT Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చిందా? స్టేటస్ తెలుసుకోండి ఇలా
IT Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చిందా? స్టేటస్ తెలుసుకోండి ఇలా
  • Share this:
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ క్యాలిక్యులేటెడ్ ట్యాక్స్, టీడీఎస్ లాంటి పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు ట్యాక్స్ పేయర్స్. మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మీ ఐటీఆర్‌ని ప్రాసెస్ చేసి ట్యాక్స్ రీఫండ్ ఏదైనా ఉంటే క్రెడిట్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఇమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీకు తెలుస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని 143(1) సెక్షన్ కింద మీకు ఈ సమాచారం లభిస్తుంది. రీఫండ్ ఏదైనా ఉంటే మీ బ్యాంకు అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. మరి మీరు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? పన్నులు చెల్లించారా? ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్‌ స్టేటస్‌ని ట్రాక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

IT Refund Status: ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి ఇలా



ముందుగా ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Portal login పైన క్లిక్ చేయండి.
పాన్ నెంబర్, ఇ-ఫైలింగ్ పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
View returns/forms పైన క్లిక్ చేయాలి.
డ్రాప్ డౌన్ మెనూలో Income Tax Returns పైన క్లిక్ చేసి Submit బటన్ ప్రెస్ చేయాలి.అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఐటీ రీఫండ్ వివరాలు కనిపిస్తాయి.
ఒకవేళ మీ రీఫండ్ ఫెయిల్ అయినట్టైతే రీఫండ్ రీఇష్యూ రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు.

IT Refund Status: TIN NSDL వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి ఇలా


TIN-NSDL వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Services ట్యాబ్‌లో Status of Tax Refunds పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Status of Income Tax Refunds పైన క్లిక్ చేయండి.
Refund Tracking పేజీ ఓపెన్ అవుతుంది.
PAN నెంబర్, అసెస్‌మెంట్ ఇయర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
Proceed పైన క్లిక్ చేస్తే మీకు రీఫండ్ వివరాలు తెలుస్తాయి.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

PF Balance: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత జమైందో తెలుసా? ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవండి

Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Android 10: ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది... ఆకట్టుకునే ఫీచర్స్ ఇవే
First published: September 4, 2019, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading