Home /News /business /

INCOME TAX RETURNS HAVE NOT BEEN FILED YET BY THIS DATE WILL RESULT IN 50 PC PENALTY MK GH

Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా.. అయితే ఇది మీకోసం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆర్థిక సంవత్సరం ముగిశాక పన్ను కట్టేందుకు ఏటా ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలి. 2020-21 అసెస్మెంట్ ఇయర్(2019-20 ఆర్థిక సంవత్సరం) కోసం ఐటీఆర్ ను 2021 మార్చి 31లోపు దాఖలు చేయాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం ముగిశాక పన్ను కట్టేందుకు ఏటా ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలి. 2020-21 అసెస్మెంట్ ఇయర్(2019-20 ఆర్థిక సంవత్సరం) కోసం ఐటీఆర్ ను 2021 మార్చి 31లోపు దాఖలు చేయాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని ఖాతరు చేయని వాళ్లు ఆదాయపు పన్ను చట్టం-1961లోని నిబంధన 199(1) ప్రకారం అదనపు వడ్డీ, రుసుములు చెల్లించాల్సి ఉంటుందని ఆర్ఎస్ఎం వ్యవస్థాపకులు డాక్టర్ సురేశ్ సురానా తెలిపారు. అయితే మార్చి 31 నాటికి ఆదాయ రిటర్నులు సమర్పించకపోతే సంబంధిత వ్యక్తులను టైమ్ బార్డ్ చెల్లింపుదారుడిగా పరిగణిస్తారని ఆయన అన్నారు. టైమ్ బార్డ్ రిటర్నులను ఎలాంటి నిబంధనలు అనుమతించవని చెప్పారు.

"పన్ను చెల్లింపుదారుడికి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉండి రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైతే అతడు 50 శాతం పన్నుకు సమానమైన జరిమానాను సెక్షన్ 270ఏ కింద చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులను సెక్షన్ 276సీసీ కింద ప్రాసిక్యూషన్ చేసే అవకాశముంది. డిఫాల్ట్ పన్ను చెల్లింపుదారుడు 3 నెలల కంటే తక్కువ సమయం లేకపోయినా కఠినమైన జైలు శిక్షకు గురవుతారు. అయితే దీన్ని రెండేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. పన్ను ఎగవేత 25 లక్షల కంటే ఎక్కువ ఉండి రిటర్నులు దాఖలు చేయకపోతే వారికి 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుంది. 10 వేల లోపు రిటర్నులకు సంబంధించి ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు" అని సురేశ్ స్పష్టం చేశారు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 119(2) ప్రకారం కాలపరిమితి ముగిసిన తర్వాత లేదా ఏదైనా మినహాయింపు, వాపసు లేదా ఇతర ఉపశమనాల కోసం దరఖాస్తును అంగీకరించే అధికారం.. ఆదాయపు పన్ను అథారిటీ చెల్లింపుదారుడికి ఇస్తుంది. అందువల్ల 2021 మార్చి 31 లోపు రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైనవారు అనంతరం ఆలస్యానికి గల సహేతుకమైన కారణాన్ని చూపించి పన్ను అథారిటికీ దరఖాస్తు చేయవచ్చు. అయితే ఇది ఆదాయపు పన్ను అథారిటి విచక్షణపై ఆధారపడి ఉంటుంది" అని సురేశ్ అన్నారు. ఇక్కడ పేర్కోన్న పరిణామాలు కాకుండా సెక్షన్ 139 కింద నిర్ణీత తేదీలోపు రిటర్నులు దాఖలు చేయకపోతే కలిగే పరిణామాలు తర్వాత రిటర్నుల ఆమోదం పొందే సమయంలో119 సెక్షన్ కు సంబంధించిన జాబితా ఇక్కడ ఉంది.

-ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271 ఎఫ్ ప్రకారం అసెస్మెంట్ ఇయర్ 2020-21లో ఇచ్చిన సమయం కంటే రిటర్నులు ఆలస్యమైతే 10 వేల రూపాయల ఆలస్య రుసుము చెల్లించాలి. పన్ను చెల్లింపుదారు ఆదాయం 5 లక్షల వరకు ఉంటే అలాంటి వ్యక్తులకు ఆలస్య రుసుము రూ.1000లుగా నిర్దేశించారు.

-చట్టంలో సెక్షన్ 234ఏ ప్రకారం నెలకు ఒక్క శాతం లేదా చెల్లించని పన్ను మొత్తానికి నెలలో కొంత భాగం వర్తిస్తుంది.

- పన్ను చెల్లింపుదారుడు కొన్ని తగ్గింపులు కోల్పోయినా లేదా నిర్దేశించిన తేదీకి మించి రిటర్నులు దాఖలు చేసినా నష్టాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఇది ఐటీ చట్టంలోని 139(1) నిబంధన ప్రకారం నిర్ణీత తేదీని నిర్దేశిస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయనట్లయితే గడువు పొడిగింపు కోసం ఆలోచించకుండా వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయడం మంచిది.

అసెస్మెంట్ ఇయర్(AY) 2019-18(2018-19 ఆర్థిక సంవత్సరానికి )గాను ఐటీఆర్ ఫైల్ చేసేందుకు 2020 సెప్టెంబరు 30 వరకు గడువిచ్చింది ఆదాయపు పన్ను శాఖ. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది(2021-22) ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసేందుకు జనవరి 10 వరకు గడువిచ్చింది. ఆడిట్ కేసులకైతే ఫిబ్రవరి 15 వరకు సమయమిచ్చింది. అయితే ఆఖరి తేదీ వరకూ ఆగకుండా ముందే ఫైల్ చేయడం మంచిది.



మరిన్ని వీడియోల కోసం న్యూస్ 18 యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రయిబ్ చేయండి...
First published:

Tags: Business, Income tax

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు