కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం అనేక అంశాలకు డెడ్‌లైన్స్ పొడిగించింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY స్కీమ్, పాన్-ఆధార్ లింక్... ఇలా చాలా అంశాల్లో చివరి తేదీలను పొడిగించి అందరికీ ఊరట కలిగించింది. అయితే ఆ డెడ్‌లైన్స్ సమీపిస్తున్నాయి. చివరి తేదీల్లోగా చేయాల్సిన పనులు చేయకపోతే నష్టపోక తప్పదు. మరి ఆ డెడ్‌లైన్స్ ఏవో తెలుసుకోండి.
2021 జనవరి 10: మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2021 జనవరి 10 చివరి తేదీ. వాస్తవానికి ఈ గడువు 2020 డిసెంబర్ 31న ముగుస్తుందనగా కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. అంతలోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఎంత జరిమానా చెల్లించాలో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
2021 జనవరి 15: ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి 2021 జనవరి 15 చివరి తేదీ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ చివరి తేదీలోగా సబ్మిట్ చేయాలి.
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? 2021 వడ్డీ రేట్లు ఇవే
Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే
2021 జనవరి 31: వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌లో భాగంగా డిక్లరేషన్ ఫైల్ చేయడానికి 2021 జనవరి 31 చివరి తేదీ. ఆదాయపు పన్ను వివాదాలను, పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ లిటిగేషన్లను పరిష్కరించేందుకు 2020 బడ్జెట్లో ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రకటించింది.
2021 ఫిబ్రవరి 15: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 90ఈ కింద రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన వారికి, అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన వారికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ.
2021 ఫిబ్రవరి 28: పెన్షన్ పొందుతున్నవారు తమ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి 2021 ఫిబ్రవరి 28. ఈ గడువు గతంలోనే ముగిసింది. దీంతో 2020 నవంబర్ 30 నుంచి 2021 ఫిబ్రవరి 28 తేదీకి గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.
2021 మార్చి 15: డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయం 2020 ఏప్రిల్ 1 నుంచి పన్ను పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కన్నా ఎక్కువ డివిడెండ్ వస్తే పన్ను చెల్లించాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 2021 మార్చి 15 లోగా చేయాలి.
SBI Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి కనువిప్పు కలిగించే సంఘటన ఇది... ఏం జరిగిందంటే
SBI Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువ ఉందా? పెంచుకోండి ఇలా
2021 మార్చి 31: పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్లు లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ గడువు 2020 జూన్ 30న ముగియడంతో గడువును 2021 మార్చి 31 తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అప్పట్లోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు. పాన్, ఆధార్ నెంబర్లను ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
2021 మార్చి 31: ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. 2020 అక్టోబర్‌లో ఈ స్కీమ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అమలు చేసింది.
2021 మార్చి 31: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించాలి.
2021 మార్చి 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.
EPFO: ఈపీఎఫ్ వడ్డీపై కేంద్ర మంత్రి క్లారిటీ... వెంటనే బ్యాలెన్స్ చెక్ చేయండిలా
ATM: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు ఇవే
2021 మార్చి 31: వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌కు సంబంధించి పేమెంట్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. అంటే 2021 జనవరి 31 లోగా డిక్లరేషన్ ఇచ్చి 2021 మార్చి 31లోగా పేమెంట్ చేయాలి.
2021 మార్చి 31: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2021 మార్చి 31న ముగుస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 13న ఈ స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
2021 మార్చి 31: ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా రూ.10,000 పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
2021 మార్చి 31: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY స్కీమ్‌లో భాగంగా క్రెడిట్ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 లాస్ట్ డేట్. మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందొచ్చు.
2021 జూన్ 30: కొత్త ఇల్లు కొని పన్ను లాభాలు పొందేందుకు 2021 జూన్ 30 చివరి తేదీ. రూ.2 కోట్ల లోపు మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇది వర్తిస్తుంది.
2021 జూలై 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2021 జూలై 31 చివరి తేదీ.