పన్ను చెల్లింపు దారులకు ముఖ్యమైన హెచ్చరిక. జులై నుంచి కొంతమంది పన్ను చెల్లింపు దారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. వీరు డబుల్ టీడీఎస్ కట్టాల్సి రావచ్చు. ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో టీడీఎస్ చెల్లించని వారు, ప్రతి సంవత్సరం టీడీఎస్ రూ.50వేలు దాటినవారు జులై 1 నుంచి ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఆదాయపు పన్ను చట్టం కింద ఎక్కువ చార్జీ వసూలు చేస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే వారి సంఖ్య పెంచడానికి వీలుగా ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను తెరపైకి తీసుకువచ్చింది. ఎక్కువమంది ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడానికి 2021 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టీడీఎస్ రేట్లు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయనివారికి టీడీఎస్ అధికరేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా 206 ఏ,బి, 206 సి.సి.ఏ తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో కొంతమంది పన్ను చెల్లింపుదారులు జూలై మొదలుకొని టీడీఎస్ అధిక రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పన్ను చెల్లింపుదారుడు ప్రతి సంవత్సరం టీడీఎస్ తగ్గిస్తున్నా, గడిచిన రెండేళ్ళలో టిడిఎస్ దాఖలు చేయకపోయినా టీడీఎస్ రూ .50,000 మించి ఉంటే, జూలై 1 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటిఆర్) దాఖలు చేసేటప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఎక్కువ వసూలు చేస్తుంది. గత రెండేళ్లుగా ఐటీ రిటర్న్ దాఖలు చేయకుండా ఏటా టీడీఎస్ మినహాయింపు రూ.50,000 దాటితే అధిక రేట్లు వసూలు చేయనున్నారు. టిడిఎస్ రేటు సంబంధిత విభాగం / నిబంధన కింద పేర్కొన్నరేటు కంటే రెండు రెట్లు లేదా అమలులో ఉన్న రేటుకు రెండింతలు లేదా ఐదు శాతం రేటు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) 2021 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టిడిఎస్ దాఖలు చేసే చివరి తేదీని జూన్ 30వరకు పొడిగించింది. అలాగే ఫామ్ 16ని దాఖలు చేయాల్సిన తేదీని కూడా జూన్ 15 నుంచి జులై 15వరకు పొడిగించారు. ఈ పొడిగింపు ఎంతో మేలు చేస్తుందని టాక్స్ బడ్డీ.కామ్ వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ పేర్కొన్నారు.
ఇక గత రెండేళ్ళుగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేశారో లేదో తెలుసుకోవడానికి ఆదాయపుపన్ను రిటర్న్ ఈ ఫైలింగ్ పోర్టల్లో అవకాశం ఉండవచ్చని టాక్స్ కనెక్ట్ ఎడ్వైజరీ సర్వీసెస్ భాగస్వామి వివేక్ జలాన్ తెలిపారు. కొత్త సెక్షన్ 206 ఏబి కింద నిర్దుష్ట పన్ను చెల్లింపుదారులు గత రెండేళ్ళుగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే అధికమొత్తంలో టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది.. ఈ న్యూ పోర్టల్ లో గత రెండేళ్ళుగా ఆదాయపు పన్ను దాఖలు అయింది లేనిదీ పరిశీలించుకోవడానికి అవకాశం ఉండవచ్చు అని జలాన్ చెప్పారు. ఒక వేళ పన్ను రిటర్న్ దాఖలు చేసింది లేనిదీ తెలుసుకునే సదుపాయం లేకపోతే 206 ఏబి సెక్షన్ అమలు చేయడం సాధ్యం కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Income tax