హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్‌ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదా..? ఆన్‌లైన్‌లో స్టేటస్‌ ఇలా చెక్‌ చేయండి..

ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్‌ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదా..? ఆన్‌లైన్‌లో స్టేటస్‌ ఇలా చెక్‌ చేయండి..

ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్‌ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదా..?

ITR Refund: ఐటీఆర్‌ రీఫండ్‌ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదా..?

యాక్చువల్‌ ట్యాక్స్‌ లయబిలిటీ కంటే చెల్లించిన ట్యాక్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌ వస్తుంది. ఈ రీఫండ్‌లను మాత్రమే పొందడానికి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు తమ రీఫండ్ స్టేటస్‌ను చెక్‌ చేసుకుంటున్నారు. యాక్చువల్‌ ట్యాక్స్‌ లయబిలిటీ కంటే చెల్లించిన ట్యాక్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌ వస్తుంది. ఈ రీఫండ్‌లను మాత్రమే పొందడానికి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌లో ITR రీఫండ్ స్టేటస్‌ని ఎలా చెక్‌ చేయాలి? 

ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా అసెస్సీలు ఆన్‌లైన్‌లో ట్యాక్స్‌ రీఫండ్‌ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ‘స్టేటస్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ రీఫండ్స్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పేమెంట్‌ మోడ్‌, రిఫరెన్స్ నంబర్, స్టేటస్‌, రీఫండ్‌ స్టేటస్‌ తేదీని తెలియజేస్తూ ఓ మెసేజ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) - tin.tin.nsdl.com ఇ-గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో కూడా స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

* ITR రీఫండ్‌ స్టేటస్‌లో రకాలు ఏంటి?

- ప్రాసెస్డ్‌:

రిటర్న్ విజయవంతంగా ప్రాసెస్ అయినప్పుడు ఈ స్టేటస్‌ కనిపిస్తుంది.

- సబ్‌మిటెడ్‌ అండ్‌ పెండింగ్‌ ఫర్‌ఇ-వెరిఫికేషన్‌/వెరిఫికేషన్‌:

పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ దాఖలు చేసినప్పటికీ, దానిని ఇ-వెరిఫికేషన్‌ లేదా సక్రమంగా సంతకం చేసిన ITR-V ఇంకా CPCకి అందనపుడు ఈ స్టేటస్‌ వస్తుంది.

- సక్సస్‌ఫుల్లీ ఇ-వెరిఫైడ్‌/వెరిఫైడ్‌:

పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌ను సమర్పించారు, సక్రమంగా ఇ-వెరిఫైడ్‌/వెరిఫైడ్‌ అయింది, కానీ రిటర్న్ ఇంకా ప్రాసెస్ కాని సందర్భంలో ఈ స్టేటస్‌ కనిపిస్తుంది.

- డిఫెక్టివ్‌:

చట్ట ప్రకారం అవసరమైన సమాచారం లేకపోవడం లేదా రిటర్న్‌లో ఏవైనా డిఫెక్ట్స్‌ డిపార్ట్‌మెంట్ గుర్తిస్తే ఈ స్టేటస్‌ చూపుతుంది.

- కేస్‌ ట్రాన్స్‌ఫర్డ్‌ టూ అస్సెసింగ్‌ ఆఫీసర్‌(AO):

CPC ఐటీఆర్‌ని అస్సెసింగ్‌ ఆఫీసర్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసినప్పుడు ఈ స్టేటస్‌ వస్తుంది.

* ట్యాక్స్‌ రీఫండ్‌ డిలే అవుతుందా?

ఐటీఆర్‌ దాఖలు చేసిన కొద్ది వారాల్లోనే ట్యాక్స్‌ రీఫండ్‌లు ఎక్కువ భాగం అసెస్‌ల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. కొన్ని పరిస్థితులలో ఆలస్యం కావచ్చు.

* ట్యాక్స్‌ రీఫండ్‌ ఆలస్యం కావడానికి ఇవే ప్రధాన కారణాలు..

- తప్పు బ్యాంక్ అకౌంట్‌ వివరాలు:

ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు సరైన బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ ఇతర వివరాలు ఇవ్వకపోయి ఉండవచ్చు.

- అదనపు డాక్యుమెంటేషన్/సమాచారం అవసరం:

రీఫండ్‌ పొందకపోవడానికి సాధారణ కారణాలలో ఒకటి అదనపు డాక్యుమెంటేషన్ లేదా సమాచారం అవసరం. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను చెల్లింపుదారులు ఏదైనా సమాచారాన్ని నమోదు చేయకుండా ఉండవచ్చు.

- కల్పిత సమాచారం:

ఏదైనా ప్రయోజనం పొందేందుకు పన్ను చెల్లింపుదారులు సరిపోని లేదా కల్పిత సమాచారాన్ని ఎంటర్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

- TDS/TCSలో మిస్‌మ్యాచ్‌:

టీడీఎస్‌లో మిస్‌మ్యాచ్‌లను 26ASలో క్లెయిమ్ చేయడంలో తప్పులు జరిగి ఉండవచ్చు.

- రీఫండ్ రిక్వెస్ట్‌ అండర్‌ ప్రాసెస్‌:

ఆలస్యం ఆదాయ పన్ను శాఖ స్థాయిలో కూడా ఉండవచ్చు. రిక్వెస్ట్‌ ప్రాసెస్ చేయడానికి సమయం పట్టవచ్చు. బ్యాంక్ వద్ద కూడా ఆలస్యం కావచ్చు.

* పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్‌ రీఫండ్‌ పొందకపోతే ఏం చేయాలి?

ఆదాయ పన్ను శాఖ నుంచి ఏదైనా సమాచారం ఉందా, లేదా అని పన్ను చెల్లింపుదారులు ఇ-మెయిల్ చెక్‌ చేసుకోవాలి. ఇ- మెయిల్ ఏదైనా ఉంటే, వీలైనంత త్వరగా దానికి స్పందించాలి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సర్వీస్‌ రిక్వెస్ట్‌ కూడా చేయవచ్చు.

First published:

Tags: Income tax, IT Returns

ఉత్తమ కథలు