INCOME TAX RETURN GOVT EXTENDS DEADLINE ANNOUNCES FURTHER RELAXATIONS FOR E FILING OF ITR HERE FULL DETAILS NS GH
Income Tax Return: ట్యాక్స్ చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
ట్యాక్స్ చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ శుభవార్త చెప్పింది. వివిధ ఫారంలను ఎలక్ట్రానిక్ విధానంలో ఫైలింగ్ చేసేందుకు గతంలో ప్రకటించిన గడువును పొడిగించింది.
ట్యాక్స్ చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ఫారంలను ఎలక్ట్రానిక్ విధానంలో ఫైలింగ్ చేసేందుకు గతంలో ప్రకటించిన గడువును పొడిగించింది. ఈ- ఫారమ్‌లను దాఖలు చేయడంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు, సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల తుది గడువును పెంచినట్లు ఆదాయ పన్ను శాఖ ట్వీట్లో పేర్కొంది. ఐటీ చట్టం-1961 ప్రకారం ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేయాల్సిన కొన్ని ఫారంల విషయంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నామని సీబీడీటీ మంగళవారం ట్వీట్ చేసింది. గడుపు పొడిగింపుకు సంబంధించిన సర్క్యులర్‌ను సైతం ఈ ట్వీట్లో జత చేసింది. Health Insurance: వృద్ధుల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారా? ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి.. PMSMY Pension Scheme: రోజూ రూ.2 జమ చెయ్యండి... రూ.36,000 పెన్షన్ పొందండి
పెరిగిన గడువు తేదీలు ఇవే..
జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి చేసిన చెల్లింపులకు సంబంధించి.. ఫారం-15CC లోని త్రైమాసిక స్టేట్మెంట్ను ఆథరైజ్డ్ డీలర్ సమర్పించాల్సి ఉంటుంది. రూల్ 37BB ప్రకారం ఇందుకు తుది గడువు జులై 15గా ఉంటుంది. అయితే గతంలోనే దీన్ని జులై 31 వరకు పొడిగించారు. ఈ గడువును తాజాగా ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఖాతాదారులకు SBI హెచ్చరిక.. ఇలా జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఫారం నంబర్ 1 లో ఈక్వలైజేషన్ లెవీ స్టేట్మెంట్ ఫైలింగ్ గడువును కూడా ఆగస్టు 31 వరకు పొడిగించారు. రూల్ 12CB ప్రకారం.. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఫారమ్ నంబర్ 64Dను, ఈ ఏడాది జూన్ 15 లోపు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో దీన్ని జులై 15 వరకు పొడిగించారు. తాజాగా ఈ గడువును ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు పొడిగించారు.
రూల్ 12CB ప్రకారం.. 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఫారమ్ నంబర్ 64Cను ఈ ఏడాది జూన్ 30 లోపు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువును జులై 31 వరకు పొడిగించారు. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను విభాగం ప్రకటించింది. కొన్ని ఫారమ్‌ల ఈ-ఫైలింగ్ కోసం యుటిలిటీ అందుబాటులో లేనందువల్ల.. ఎలక్ట్రానిక్ ఫైలింగ్ గడువు తేదీలను పొడిగించాలని సీబీడీటీ నిర్ణయించింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.