హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax: విదేశాల్లో సంపాదిస్తూ పన్ను కట్టే ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త రూల్..

Income Tax: విదేశాల్లో సంపాదిస్తూ పన్ను కట్టే ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. వారి కోసం కొత్త రూల్..

Foreign Tax Credit New Rule

Foreign Tax Credit New Rule

Income Tax: రూల్ 128 ప్రకారం, ఒక ఇండియన్ రెసిడెంట్ విదేశాల్లో లేదా భారతదేశం వెలుపల పేర్కొన్న భూభాగంలో పన్నుగా చెల్లించిన మొత్తానికి క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్(FTC)ని క్లెయిమ్ చేసే విషయంలో పన్ను చెల్లింపుదారుల (Tax Payers)కు ఉపశమనం లభించింది. ఆదాయ పన్ను నియమాలు (Income Tax Rules) 1962లోని 128వ నిబంధనలను తాజాగా సవరించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT). సవరణకు ముందు, పన్ను చెల్లింపుదారులు ఫారమ్ 67ను దాఖలు చేయడం ద్వారా మాత్రమే ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు గడువు తేదీలోపు అవసరమైన డాక్యుమెంట్స్‌తో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రూల్ ఇప్పుడు మారింది.


రూల్ 128 ప్రకారం, ఒక ఇండియన్ రెసిడెంట్ విదేశాల్లో లేదా భారతదేశం వెలుపల పేర్కొన్న భూభాగంలో పన్నుగా చెల్లించిన మొత్తానికి క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ ప్రకారం.. 2022-23 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి.


* కొత్త ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రూల్స్: తెలుసుకోవాల్సిన 5 పాయింట్లు ఇవే..


* సవరించిన నియమం ప్రకారం, పన్ను చెల్లింపుదారులు నిర్ణీత గడువు తేదీలోపు ITR దాఖలు చేస్తే, అసెస్‌మెంట్ ఇయర్‌ ముగిసేలోపు భారతదేశం వెలుపల చెల్లించిన పన్నులకు క్రెడిట్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఫారమ్ నెం. 67లోని స్టేట్‌మెంట్‌ను ఇప్పుడు సంబంధిత అసిట్ ఇయర్ ముగిసేలోపు లేదా ముందు అందించవచ్చని నోటిఫికేషన్ నం.100/2022లో ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.* కొత్త నిబంధన అమలుతో, పన్ను చెల్లింపుదారులు అటువంటి రిటర్న్‌ను దాఖలు చేయడానికి ముందు ఫారమ్ 67ని అందిస్తే, వారు అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ను దాఖలు చేసేటప్పుడు కూడా ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


* ఐటీఆర్‌ దాఖలు చేసిన గడువు తేదీలోపు ఫారమ్ 67ను ఫైల్ చేయడంలో విఫలమైతే.. పన్ను చెల్లింపుదారులు శాశ్వతంగా ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కోల్పోకుండా కొత్త నిబంధన అవకాశం కల్పిస్తుంది.


* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన అన్ని ఫారిన్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌లకు కొత్త నియమం ప్రయోజనం చేకూరుస్తుంది. ముందుగా సవరించిన నియమం ప్రకారం, ఆదాయ పన్ను రిటర్న్‌ను అందించడానికి గడువు తేదీలోగా ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ను దాఖలు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన అన్ని ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌లకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండేలా ఈ సవరణ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది.


* నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విదేశాలలో సంపాదిస్తున్నప్పుడు విదేశీ పన్నులు చెల్లించే భారతీయ నివాసితులకు మునుపటి నియమం సవాలును సృష్టించింది. అయితే వారి విదేశీ పన్ను రిటర్న్‌లు భారతదేశంలో ఐటీఆర్‌ గడువు తేదీ నాటికి ఖరారు కాలేదు.


కొత్త నియమం 2022 ఏప్రిల్ 01 నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి ఆర్థిక సంవత్సరం 2021-22 కోసం ఫారిన్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ని క్లెయిమ్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఫారమ్ 67, సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను 2023 మార్చి వరకు ఫైల్ చేయవచ్చు.


ఇది కూడా చదవండి : రెండు నెలల్లోనే 11 రెట్లు పెరిగింది..ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాల పంట


మరోవైపు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో కొత్త విదేశీ పెట్టుబడి నియమాలు, నిబంధనలను నోటిఫై చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 22 నాటి ఒక ప్రకటనలో..‘భారతదేశంలో పెరుగుతున్న వ్యాపారాల అవసరాల దృష్ట్యా, సమీకృత గ్లోబల్ మార్కెట్‌లో, గ్లోబల్ వాల్యూ చైన్‌లో భాగంగా భారతీయ కార్పొరేట్ల అవసరం ఉంది.


విదేశీ పెట్టుబడి కోసం సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ విదేశీ పెట్టుబడి కోసం ఇప్పటికే ఉన్న ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేస్తుంది. ప్రస్తుత వ్యాపారం, ఎకనమిక్‌ డైనమిక్స్‌తో అలైన్‌ అయ్యాయి. ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్, ఓవర్సీస్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌పై క్లారిటీ వచ్చింది. గతంలో అప్రూవల్‌ మార్గంలో ఉన్న వివిధ విదేశీ పెట్టుబడి సంబంధిత లావాదేవీలు ఇప్పుడు ఆటోమేటిక్ మార్గంలో ఉన్నాయి.’ అని పేర్కొంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Income tax, Personal Finance, Tax benefits, Tax payers

ఉత్తమ కథలు