Home /News /business /

INCOME TAX RETURN FILING THESE MISTAKES OFTEN MADE BY TAXPAYERS JNK GH

ITR Filing Mistakes: ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. ఈ తప్పిదాలకు దూరంగా ఉండండి..

ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ తప్పులకు దూరంగా ఉండండి (ప్రతీకాత్మక చిత్రం)

ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ తప్పులకు దూరంగా ఉండండి (ప్రతీకాత్మక చిత్రం)

ITR Filing Mistakes: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్‌ చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వీటిపై దృష్టి సారించడం ద్వారా తప్పులను నివారించవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి తప్పులు చేస్తారంటే..

చాలా మంది పన్ను చెల్లింపుదారులు (Tax Payers) ఇప్పటికే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ (ITR) ఫైల్‌ చేసే ఉంటారు. చేయని వాళ్లు ఎవరైనా ఉంటే వీలైనంత వేగంగా రిటర్న్స్ (IT Returns) దాఖలు చేయడం ఉత్తమం. ఆదాయ పన్ను (Income Tax) చట్టంలోని సెక్షన్‌ 87A ప్రకారం రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతావారు వర్తించే ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ITR ఫైల్‌ చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వీటిపై దృష్టి సారించడం ద్వారా తప్పులను నివారించవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి తప్పులు చేస్తారంటే..

* తప్పు ఫామ్‌ ఎంచుకోవడం
రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు సరైన ITR ఫామ్‌ ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలా చేయకపోవడం వల్ల రిటర్న్స్‌ ప్రాసెస్‌ కావు. ఆదాయ స్వభావం లేదా పన్నుచెల్లింపుదారులు ఏ శ్రేణికి చెందుతారనే దాన్ని బట్టి ITR ఫామ్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు తప్పుడు రిటర్న్‌ ఫామ్‌ ద్వారా ఫైల్‌ చేస్తే, ఆదాయ పన్ను విభాగం నుంచి వారికి డిఫెక్ట్‌ నోటీసు వస్తుంది. దాన్ని నిర్దేశిత సమయంలోపు సరిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు వేతనం అందుకున్న ఉద్యోగి అయి ఉండి మీ ఆదాయం రూ.50 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు ITR-1 ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అదే వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం కలిగిన వ్యక్తులు ITR-3 ఎంచుకోవాల్సి ఉంటుంది

Indian Railways: వారికి గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే... ఇక కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు


* తప్పు అసెస్‌మెంట్‌ సంవత్సరం పేర్కొనడం
రిటర్న్స్‌ ఫైల్స్ చేసేటప్పుడు సరైన అసెస్‌మెంట్‌ ఇయర్‌ (AY) పేర్కోవాలి. AY తప్పుగా నమోదు చేస్తే అనవసర జరిమానాలు, డబుల్‌ ట్యాక్సేషన్‌ వంటివి భరించాల్సి వస్తుంది.

* వడ్డీ ఆదాయం
చాలా మంది పన్ను చెల్లింపుదారులు చేసే సాధారణ తప్పు.. వడ్డీ ఆదాయాన్ని సరిగా నమోదు చేయకపోవడం. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేటప్పుడు సేవింగ్స్‌ అకౌంట్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని పన్నుచెల్లింపుదారులు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ వడ్డీ ఆదాయాన్ని వెలడ్డించిన పన్నుచెల్లింపుదారులు, మినహాయింపులు పొందేందుకు అర్హులై ఉంటారు. సెక్షన్ 80TTA ప్రకారం వారు పొదుపు ఖాతాలపై వడ్డీ ఆదాయం నుంచి రూ.10,000 వరకు మినహాయింపు పొందేందుకు అర్హత కలిగి ఉంటారు. అదే సీనియర్‌ సిటిజన్లు అయితే, సెక్షన్‌ 80 TTB ప్రకారం ఈ పరిమితి రూ.50,000 వరకు ఉంటుంది.

Group Term Insurance: గ్రూప్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నారా.. ఇందులో ఫ్రీ కవర్‌ లిమిట్‌ గురించి తెలుసుకోండి..


* బ్యాంకు వివరాల్లో తప్పులు
సాధారణంగా చేసే ఇంకొన్ని తప్పులు Form 26AS స్టేట్‌మెంట్‌ను సరిగ్గా లెక్కించకపోవడం, బ్యాంకు వివరాలు తప్పుగా పేర్కొనడం. పన్ను రిటర్నులు దాఖలు చేయడమన్నది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ కాబట్టి అవి సబ్మిట్‌ చేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా చూసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ITR పైలింగ్‌ తుది గడువు
కొత్త ఈ-పైలింగ్‌ పోర్టల్‌ను లాంచ్ చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ సంవత్సరం ITR ఫైలింగ్‌ కోసం చివరి తేదీని ఆదాయ పన్ను విభాగం డిసెంబర్‌ 31, 2021 వరకు పొడిగించింది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Income tax, IT Returns, ITR, ITR Filing

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు