Home /News /business /

INCOME TAX RETURN FILING HERES YOUR STEP BY STEP GUIDE GH VB

ITR Filing Guide: ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కు ముగుస్తున్న గడువు.. ఈ 10 స్టెప్స్ తో ఐటీఆర్ ఫైల్ చేయండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2021. గడువు తర్వాత ITR ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీని ప్రభుత్వం సగానికి తగ్గించినప్పటికీ, సకాలంలో ITR దాఖలు చేయడం మంచిది.

ఇంకా చదవండి ...
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2021. గడువు తర్వాత ITR ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీని ప్రభుత్వం సగానికి తగ్గించినప్పటికీ, సకాలంలో ITR దాఖలు చేయడం మంచిది. మీరు ఇంకా ITR ఫైల్ చేయకపోతే.. రిటర్న్ ఈ-ఫైలింగ్‌ (E returns filling) కోసం ఈ స్టెప్స్ ఫాలో అయ్యి, సకాలంలో ఐటీఆర్(ITR) ప్రక్రియను పూర్తి చేయండి. అయితే ముందు మీరు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌(Website)లో నమోదు చేసుకుంటేనే ఈ-ఫైలింగ్(E-filling) చేయడం సాధ్యమవుతుంది.

ITR Filing: ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ చేయాలి.. లేదంటే.. ఈ నష్టాలు తప్పవు..!


ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

1. సర్టిఫికెట్లు సేకరించాలి
TDS సర్టిఫికేట్లు (Form16/16A), క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు సేకరించండి. ఈ డాక్యుమెంట్లు మీ స్థూల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని, FY 2020-21లో TDSను లెక్కించడంలో సహాయపడతాయి.

2. ఫారమ్ 26AS లేదా AIS డౌన్‌లోడ్ చేసి తనిఖీ చేయండి
ఈ సంవత్సరం ఆదాయ పన్ను శాఖ యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ (AIS)ను ప్రారంభించింది. ఇది ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన వివిధ లావాదేవీల గురించి పన్ను చెల్లింపుదారులకు తెలియజేస్తుంది. అయితే కొత్తగా ప్రారంభించినందువల్ల AISలో లోపాలు ఉండవచ్చు. AISలో ఏవైనా లోపాలు ఉంటే, ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 26AS ఉపయోగించవచ్చు. ఫారమ్ 26AS అనేది 2020-21 ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం, ట్యాక్స్‌కు సంబంధించిన అన్ని వివరాలను కలిగి ఉండే పన్ను పాస్‌బుక్ లాంటిది. ట్యాక్స్ చెల్లింపుదారులు తప్పనిసరిగా ఫారమ్ 26ASతో TDS సర్టిఫికేట్‌లను క్రాస్-చెక్ చేయాలి.

EPFO Alert: వడ్డీ జమ చేస్తున్న ఈపీఎఫ్ఓ... పాస్‌బుక్ చెక్ చేయండి ఇలా

3. ఫారమ్ 26ASలో లోపాలు ఉంటే సరిదిద్దండి
TDS సర్టిఫికెట్లు (ఫారమ్-16, ఫారం-16A మొదలైనవి), ఫారం 26ASలో చూపిన మొత్తాలు సరిపోలకపోతే, లోపాలను సరిదిద్దడానికి డిడక్టర్‌ సాయం తీసుకొని, సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ డిడక్టర్ అంటే మీ యజమాని, బ్యాంక్ లేదా ఇతరులు కావచ్చు. సంబంధిత వివరాలను సరిచేయమని వారిని అభ్యర్థించవచ్చు. లోపాన్ని సరిదిద్దకుంటే, డిడక్ట్ అయిన ట్యాక్స్‌పై క్రెడిట్‌ను క్లెయిమ్ చేయలేరు.

4. ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయాన్ని లెక్కించండి
అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సేకరించి, ట్యాక్స్ డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్ తీసివేసిన తరువాత.. పన్ను వర్తించే మొత్తం ఆదాయాన్ని లెక్కించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం ఐదు వేర్వేరు హెడ్‌ల నుంచి వస్తుంది. వీటన్నింటిని సరిగా లెక్కిస్తేనే పన్ను ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. ITR ఫైల్ చేసే సమయంలో పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకుంటే మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చు. అయితే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, కామన్ డిడక్షన్స్, ట్యాక్స్ ఎగ్జమ్షన్స్ క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు.

Retirement Plan: ఈ రిటైర్మెంట్ ప్లాన్‌తో డబ్బులే డబ్బులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


5. ట్యాక్స్ లయబిలిటీ లెక్కించండి
ఈ సంవత్సరం ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ పాత పన్ను విధానాన్ని కొనసాగించవచ్చు లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. మీ మొత్తం ఆదాయాన్ని లెక్కించిన తర్వాత, మీ ఇన్‌కమ్ స్లాబ్ ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అమలులో ఉన్న పన్ను రేట్ల ప్రకారం ట్యాక్స్ లయబిలిటీని లెక్కించాలి. ఇది వ్యక్తి ఎంచుకున్న పన్ను విధానంపై ఆధారపడి లెక్కించబడుతుంది.

6. ఫైనల్ ట్యాక్స్‌ లెక్కించండి
ట్యాక్స్ లయబిలిటీ లెక్కించిన తర్వాత, సంవత్సరంలో TDS, TCS, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా మీరు ఇప్పటికే చెల్లించిన పన్నులను తీసివేయండి. సెక్షన్ 234A, 234B, 234C కింద చెల్లించాల్సిన వడ్డీ ఏదైనా ఉంటే యాడ్ చేయండి.

7. అన్ని పన్నులు చెల్లించిన తర్వాత రిటర్న్‌ ఫైల్ చేయండి
గతంలో బకాయి ఉన్న ట్యాక్స్ లేదా పెనాల్టీలు చెల్లించిన తర్వాత, ITR ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏదైనా రీఫండ్‌ క్లెయిమ్ చేయాలనుకుంటే, తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి. అందువల్ల నిబంధనల ప్రకారం పన్ను పరిధిలోకి రానివారు తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయనవసరం లేకపోయినా.. ఇతర ప్రయోజనాల కోసం ITR దాఖలు చేయాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అసెస్‌మెంట్ ఈయర్ 2020-21 అని గుర్తుంచుకోండి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రిటర్న్ ఫైలింగ్ పూర్తి చేయండి.

ITR Filing-Advantages: మీ ఆదాయం పన్ను పరిధిలోకి రానప్పటికీ ఐటీఆర్​ ఫైల్ చేయండి.. ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు..


8. ITR వెరిఫికేషన్
ITR ఫైలింగ్ ప్రక్రియలో చివరి దశ ఇది. మీ ITRను వెరిఫై చేసేందుకు 6 మార్గాలు ఉన్నాయి. వీటిలో 5 ఎలక్ట్రానిక్ మెథడ్స్, ఒకటి ఫిజికల్ వెరిఫికేషన్. మీరు ట్యాక్స్ రిటర్న్‌ను ఎలక్ట్రానిక్‌ విధానంలో వెరిఫై చేయాలనుకుంటే, ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఎలాంటి డాక్యుమెంట్స్ పంపాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఫిజికల్ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే.. సంబంధిత పత్రాలను ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు పంపాల్సి ఉంటుంది. ITR ఫైల్ చేసిన తర్వాత, దాన్ని వెరిఫై చేయడానికి 120 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, మీరు రిటర్న్ దాఖలు చేయనట్లుగానే పరిగణిస్తారు. ఒకవేళ ఈ గడువుకు ముందు ITR వెరిఫై చేయడం మర్చిపోతే, ఎసెస్సింగ్ ఆఫీసర్‌కు రిక్వెస్ట్ పెట్టుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

9. ఈ-వెరిఫికేషన్ రసీదు
మీరు ఎలక్ట్రానిక్ విధానంలో ITRను వెరిఫై చేస్తే, ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఆ వివరాలు అందుతాయి. అనంతరం మీ రిటర్న్ వెరిఫై అయిందని నిర్ధారిస్తూ మీకు ఈమెయిల్ వస్తుంది. ఈ వివరాలు సేవ్ చేసుకోండి.

10. వెరిఫికేషన్ తర్వాత IT డిపార్ట్‌మెంట్ రిటర్న్‌ను ప్రాసెస్ చేస్తుంది
మీరు దాఖలు చేసిన రిటర్న్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ఆదాయ పన్ను శాఖ మీ ట్యాక్స్ రిటర్న్‌ను ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది. రిటర్న్ ప్రాసెసింగ్ పూర్తయిన తరువాత, ఆ వివరాలను IT డిపార్ట్‌మెంట్ ఈమెయిల్ ద్వారా మీకు తెలియజేస్తుంది. ఏదైనా తప్పులను గుర్తిస్తే, వాటిని సరిచేయాలని ఈమెయిల్‌లో అధికారులు కోరతారు.
Published by:Veera Babu
First published:

Tags: Income tax, ITR, ITR Filing

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు