ITR : ఐటీ రిటర్న్ ఫైల్ చేశారా... ఇవాళే ఆఖరి రోజు... ఇలా చెయ్యండి...

IT Return : తమ వేతనాలు ఆదాయపు పన్ను పరిధిలోకి రావని చాలామంది ఉద్యోగులు అనుకుంటారు. తాము ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి లేదా మరే ఆదాయం వస్తున్నా ఐటీఆర్ ఫైల్ చేయాలి. వచ్చిన ఆదాయమెంత? కట్టిన పన్నులెంత? అన్న లెక్కలు ఐటీఆర్‌లో చూపించడం మంచి పౌరుడి లక్షణం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 5:23 AM IST
ITR : ఐటీ రిటర్న్ ఫైల్ చేశారా... ఇవాళే ఆఖరి రోజు... ఇలా చెయ్యండి...
ITR filing 2019: ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఇలా చెయ్యండి. (ప్రతీకాత్మక చిత్రం)
Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 5:23 AM IST
Income Tax Return : ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చెయ్యడానికి ఇవాళే చివరి తేదీ. సోషల్ మీడియాలో పుకార్ల వల్ల... సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించారన్న ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమేనని తేల్చేశారు ఆదాయపు పన్ను అధికారులు. లేనిపోని అపోహలు పెట్టుకోవద్దనీ, ఐటీఆర్ ఫైల్ చెయ్యనివాళ్లు... ఇవాళ కొంత టైమ్ కేటాయించి... ఎలాగొలా... ఐటీఆర్ ఫైల్ చెయ్యమని సూచిస్తున్నారు. 2019-20 పన్ను మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్‌ల గడువు ఇవాళతోనే ముగుస్తుందని స్పష్టం చేశారు. పన్ను చెల్లించేవారు... ఇవాళ గడిచేలోపు తమ రిటర్న్‌లను ఫైల్‌ చేయాలని కోరింది. టాక్స్ నిల్ వచ్చినా... ఐటీఆర్ మాత్రం ఫైల్ చెయ్యాలని కోరింది.


ఒకవేళ ఇవాళ ముగిసేలోపు ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చెయ్యలేకపోతో... ఫైన్‌తో కలిపి... వచ్చే సంవత్సరం మార్చి 31లోగా రిటర్న్‌లు ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండి... వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటర్న్‌ ఫైల్‌ చేస్తే రూ.1,000 వరకు ఫైన్ ఉంటుంది. సంవత్సర ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉండి ఈ సంవత్సరం డిసెంబరు 31లోగా రిటర్న్‌ ఫైల్‌ చేస్తే రూ.5,000, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య ఫైల్‌ చేస్తే రూ.10,000 ఫైన్ వేస్తున్నారు. ఈ ఫైన్ల సమస్య ఉండకూడదనుకుంటే... మర్చిపోకుండా ఇవాళే ITR ఫైల్ చేసేయాలి. అదేమంత పెద్ద కష్టం కూడా కాదు. ఆన్‌లైన్‌లో ప్రాసెస్ చాలా తేలిగ్గానే ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.



ITR filing 2019: ఐటీఆర్ ఫైల్ చేయలేదా? ఈ 5 వెబ్‌సైట్స్ ట్రై చేయండి :
Loading...
1. Income Tax website: ఆదాయపు పన్ను శాఖకు చెందిన incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఆదాయపు పన్ను సంబంధిత సేవలన్నీ ఈ పోర్టల్‌లో పొందొచ్చు. మొదటిసారి ఇ-ఫైలింగ్ చేస్తున్నటైతే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫామ్ 16 (అందుబాటులో ఉంటే), పెట్టుబడుల వివరాలు ఉండాలి.

2. ClearTax: బెంగళూరుకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో మీరు ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్ ఇ-ఫైల్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ సేవల్నీ అందిస్తుంది. ఫామ్ 16 ఉన్నవారు ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తే చాలు ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్ చాలా సులువు. చివర్లో మీకు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఐటీ రిటర్న్స్ ఇ-ఫైలింగ్‌కు కేవలం 7 నిమిషాలు పడుతుందని క్లియర్‌ట్యాక్స్ వెబ్‌సైట్ చెబుతోంది.

3. myITreturn: 2006 సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టరైన ఇ-రిటర్న్ ప్లాట్‌ఫామ్ ఇది. స్కోరీడోవ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. వేతనం, పెట్టుబడులు, లాభాలు, ఆదాయం లాంటి వివరాలతో ఐటీఆర్ ఇ-ఫైల్ చేయొచ్చు. ఇంగ్లీష్‌తో పాటు 9 భారతీయ భాషల్లో సేవలు లభిస్తాయి.

4. TaxSpanner: ట్యాక్స్ స్పానర్ 2007 లో న్యూ ఢిల్లీ, బెంగళూరులో ప్రారంభమైన సంస్థ ఇది. ఇది కూడా ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టైరైంది. ఇందులో మీరు ఫామ్ 16 అప్‌లోడ్ చేస్తే ఐటీఆర్ ఫైల్ చేయడానికి కావాల్సిన సమాచారాన్ని స్కాన్ చేస్తుంది. మీరు ఎంచుకునే ప్యాకేజీని బట్టి నిపుణుల సేవలు లభిస్తాయి.

5. Paisabazaar: పాలసీబజార్ గ్రూప్‌కు చెందిన సంస్థ పైసాబజార్ కూడా ఉచితంగా ఐటీఆర్ ఇ-ఫైలింగ్ సేవల్ని అందిస్తోంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది ఈ వెబ్‌సైట్. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో నిపుణుల సలహాలు కూడా పొందొచ్చు.

ఇవే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఐటీఆర్ ఫైలింగ్‌ సేవల్ని అందిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా ఇ-ఫైలింగ్ చేయొచ్చు. ఇ-ఫైల్ ఐటీఆర్, అప్‌లోడ్ రిటర్న్, ట్యాక్స్ క్యాలిక్యులేటర్, ఇ-పే ట్యాక్స్, ఇ-వెరిఫై రిటర్న్స్ లాంటి సేవలు పొందొచ్చు.

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? అప్‌లోడ్ చేసే ప్రాసెస్ ఇదే :
ITR Filing: Part-A
ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. Download సెక్షన్‌లో IT Return Preparation Software పైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి. అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ అయిన జిప్ ఫైల్‌లో ఐటీఆర్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్‌లో మీ ఆదాయం, పన్ను చెల్లింపులు, డిడక్షన్స్ లాంటి వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయండి. వాటితో పాటు వ్యక్తిగత వివరాలు, పన్ను చెల్లింపులు లేదా టీడీఎస్ లాంటివి ఎంటర్ చేయండి. వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేశారో లేదో ఓసారి సరిచూసుకోవడం మంచిది. డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత 'Calculate' పైన క్లిక్ చేయండి. మీరు చెల్లించాల్సిన పన్ను లేదా రీఫండ్ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే వెంటనే పన్ను చెల్లించేయండి. ఆ తర్వాత మళ్లీ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేసి 'Calculate' చేయాలి. మీరు చెల్లించాల్సిన పన్ను సున్నా వచ్చేవరకు ఈ ప్రాసెస్ చేయాలి. తర్వాత జెనరేట్ పైన క్లిక్ చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ డేటాను XML ఫార్మాట్‌లో కంప్యూటర్‌లో సేవ్ చేయాలి.

ITR Filing: Part-B
ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇ-ఫైల్‌లోకి వెళ్లి 'Upload Return' పైన క్లిక్ చేయాలి. ఐటీఆర్ వివరాలు, అసెస్‌మెంట్ ఇయర్ సరిగ్గా సెలెక్ట్ చేయాలి. పార్ట్-ఏలో సేవ్ చేసిన ఎక్స్ఎంఎల్ ఫైల్ అప్‌లోడ్ చేయాలి. దాంతో పాటు మీ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్-DSC అప్‌లోడ్ చేయాలి. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఇ-ఫైలింగ్‌తో రిజిస్టరై ఉండటం తప్పనిసరి. చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఉపయోగించకపోతే ITR-V కనిపిస్తుంది. ITR-V డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌తో ఐటీఆర్ ఫైల్ చేస్తే రిటర్న్ ఫైలింగ్ పూర్తయినట్టే. ఒకవేళ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయకపోతే ITR-V ప్రింట్ తీసుకొని, సంతకం చేసి 120 రోజుల్లో సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపాలి.

పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల లాభాలు :
1. ఐటీఆర్ రసీదు ఉండటం ఫామ్ 16 కన్నా ఎక్కువ ఉపయోగకరం. మీకు ఆదాయం వచ్చే మార్గాలు, పన్నుల వివరాలన్నీ అందులో ఉంటాయి.
2. ఐటీఆర్ రసీదు మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు పంపిస్తారు. ఆ రసీదును నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చు.
3. మీరు బ్యాంకులో హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్‌లాంటి రుణాలకు దరఖాస్తు చేసినప్పుడు మీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వివరాల ఆధారంగా మీకు ఆదాయం వచ్చే మార్గాలను బ్యాంకు అధికారులు సులువుగా లెక్కించగలరు.
4. మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, మీ గత ఆర్థిక సంవత్సరంలోని ఖర్చులు/నష్టాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి మార్చుకోలేరు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, నష్టాల వివరాలను భవిష్యత్తు సంవత్సరాలకు మార్చుకోలేరు. అందుకే అలాంటి నష్టాలు భవిష్యత్తులో అడ్జస్ట్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.
5. ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆ ఆలస్యానికి పన్నుపై నెలకు 1% చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు నిర్దిష్ట స్థాయిని మించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ నుంచి పన్నును తీసివేస్తాయి. ఆ పన్ను రీఫండ్ పొందాలనుకుంటే ఐటీఆర్ అవసరం.
6. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ.10,000 జరిమానా విధిస్తారు. తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆ రిమార్క్ అలాగే ఉంటుంది.
7. మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తిరస్కరించే అవకాశముంది.
8. గతంలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన కాపీలను వీసా అధికారులు అడిగే అవకాశముంది. యూఎస్, యూకె, కెనెడా లాంటి దౌత్య కార్యాలయాలు ఫారిన్ వీసా అప్లికేషన్‌ ప్రాసెస్‌లో భాగంగా మీ ఐటీఆర్ గురించి పరిశీలించి చూస్తారు.
9. ఎక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఇబ్బందులొస్తాయి. మీరు పన్ను ఎగ్గొట్టేవారి జాబితాలో ఉన్నారన్న అనుమానం వస్తే మీకు ఎక్కువ మొత్తంలో జీవిత బీమా ఇవ్వరు.
10. ఫ్రీ లాన్సర్, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఫామ్16 ఉండదు. అలాంటివారికి ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. వారి దగ్గర ఉండే ఒకే డాక్యుమెంట్ ఇది. లేకపోతే లోన్లు, ఇతర లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సో... ఈ లాభాలు ఉంటాయి కాబట్టి మీరు పన్ను పరిధిలోకి రాకపోయినా ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేయడం మీకే ఉపయోగకరం. టెన్షన్ పడకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి.
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...