Home /News /business /

INCOME TAX RETURN FILING ADVANTAGES OF FILING ITR EVEN IF TOTAL INCOME IS BELOW EXEMPTION LIMIT GH VB

ITR Filing-Advantages: మీ ఆదాయం పన్ను పరిధిలోకి రానప్పటికీ ఐటీఆర్​ ఫైల్ చేయండి.. ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ITR Filing-Advantages: మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు కూడా ఐటీఆర్​ ఫైల్​ చేసుకోవచ్చు. దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో చూద్దాం.

2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్​ (ఐటీఆర్​) దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. డిసెంబర్ 31తో ఐటీఆర్​ ఫైలింగ్​ గడువు ముగియనుంది. గడవు సమీపిస్తున్నందున త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం, నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఐటీఆర్​ ఫైలింగ్ తప్పనిసరి. దాని కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఫైలింగ్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, మినహాయింపు పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు కూడా ఐటీఆర్​ ఫైల్​ చేసుకోవచ్చు. దీని ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో చూద్దాం.

Child Policy: జనాభా నియంత్రణపై యూటర్న్.. దంపతులకు బేబీ లోన్లు.. ఎక్కువ మందిని కంటే పన్ను రాయితీ..


లోన్​ ప్రాసెసింగ్​ మరింత వేగంగా..
ఆదాయ పన్ను చట్టం ప్రకారం, రూ. 2.5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అదే, 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు ఉన్న వారికైతే రూ. 3 లక్షల వరకు, 80 ఏళ్లు పైబడిన వారికైతే రూ. 5 లక్షల వరకు మినహాయింపు పరిమితి​ ఉంటుంది. అందువల్ల ఈ ఆదాయ పరిధిలోకి వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది ఐటీఆర్​ ఫైల్​ చేయరు. దీని వల్ల ప్రభుత్వం కూడా వారికి ఎటువంటి జరిమానా విధించదు.

అయితే అవసరం లేకపోయినా.. ఐటీఆర్ ఫైల్ చేస్తే వారికి ఎన్నో లాభాలుంటాయి. స్థిరమైన ఆదాయం పొందే ప్రతి వ్యక్తి ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. వారి వార్షికాదాయం మొత్తం పన్ను మినహాయింపు పరిమితికి లోబడే ఉన్నప్పటికీ ఐటీఆర్​ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఐటీఆర్​ ఫైల్​ చేయడం ద్వారా లోన్​ ప్రాసెసింగ్​ వేగవంతంగా, సులభంగా పూర్తవుతుంది.

Fitness and Alcohol: ఫిట్‌గా ఉన్నవారే ఎక్కువగా తాగుతారట.. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే..


క్రెడిట్​ కార్డు ప్రాసెసింగ్​ వేగంగా..
లోన్ మాత్రమే కాకుండా, సులభంగా క్రెడిట్ కార్డ్ లేదా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్‌లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే, మీ ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఐటీఆర్​ ఫైల్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. మీ ఐటీఆర్​ ఫైలింగ్​ ఆయా బ్యాంకులకు మీ క్రెడిట్ యోగ్యతను తెలియజేస్తుంది. తద్వారా వేగంగా మీ లోన్​ ప్రాసెస్​ పూర్తవుతుంది. అంతేకాదు, తక్కువ వడ్డీకే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంటుంది.

ఐటీఆర్​ ఫైలింగ్​ చేయడం ద్వారా టీడీఎస్​ రీఫండ్ కూడా లభిస్తుంది, అలాగే, ప్రమాదవశాత్తు మరణం లేదా ప్రమాదంలో వైకల్యం సంభవించినప్పుడు పరిహారం పొందడానికి ఐటీఆర్​ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్​గా ఉపయోగపడుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: ITR, ITR Filing

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు