Home /News /business /

INCOME TAX RETURN FILING A LIST OF I T RULES THAT HAVE CHANGED THIS YEAR GH VB

ITR Filing: 2021లో మారిన ఐటీ రూల్స్‌.. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌కమ్ టాక్స్ సిస్టంను బలపరిచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉన్న రూల్స్‌ను తరచూ సమీక్షిస్తుంది. ఈ ఏడాది ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో కూడా ఆదాయపు పన్ను నిబంధనలలో కీలక మార్పులు ఉన్నాయి. మరి 2021లో ఐటీ రూల్స్‌లో వచ్చిన ఆ మార్పుల ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ఆదాయపు పన్ను వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే దేశంలో ఆర్థికాభివృద్ధి అంత గొప్పగా ఉంటుంది. అయితే మన ఇన్‌కమ్ టాక్స్ సిస్టంను బలపరిచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉన్న రూల్స్‌ను తరచూ సమీక్షిస్తుంది. ఈ రూల్స్‌పై పార్లమెంటులో అనేక చర్చలను లేవనెత్తుతుంది. సమాలోచనలు చేశాక దేశ ఆర్థిక అభివృద్ధిని పెంచే దిశగా టాక్స్ రూల్స్‌లో మార్పులు తీసుకొస్తుంది. ఈ ఏడాది ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో కూడా ఆదాయపు పన్ను నిబంధనలలో కీలక మార్పులు ఉన్నాయి. మరి 2021లో ఐటీ రూల్స్‌లో వచ్చిన ఆ మార్పుల ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ప్రావిడెంట్ ఫండ్ వడ్డీపై పన్ను
ఈ ఏడాది పీఎఫ్ పథకంలో పెట్టిన పెట్టుబడిని పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ఏడాదికి ముందు ధనికులు పన్ను-మినహాయింపు పొందడానికి పీఎఫ్ పథకంలో డబ్బులు దాచుకున్నారు. వీరు కేవలం ఒక నెలలో ఒక పాన్‌ కార్డు ద్వారా దాదాపు కోట్ల రూపాయలను డిపాజిట్‌ చేశారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్థిక శాఖ ఒక ఏడాదిలో ఒక వ్యక్తి కేవలం రూ.2.5 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేసేలా ఒక లిమిట్ తీసుకొచ్చింది. దీని ప్రకారం పీఎఫ్ ఖాతాల్లో ఒక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తే.. ఆ మొత్తంపై సంపాదించే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం, పీఎఫ్ ఖాతాల్లో రెండున్నర లక్షలకు మించి జమచేసే మొత్తాలపై వచ్చే వడ్డీ మీద ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన 1 ఏప్రిల్ 2021న లేదా ఆ తర్వాత చేసిన అన్ని డిపాజిట్‌లకు వర్తిస్తుంది.

Online Payments: క్రెడిట్​, డెబిట్​ కార్డు పేమెంట్ నిబంధనల్లో మార్పులు.. జనవరి 1 నుంచి అమల్లోకి.. వివరాలివే..


75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉపశమనం
కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే సంపాదిస్తున్న 75 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చెయ్యాల్సిన అవసరం లేదని కేంద్ర బడ్జెట్ వెల్లడించింది. అయితే పెద్దవారికి రిటర్న్ ఫైలింగ్ ద్వారా మాత్రమే మినహాయింపు లభిస్తుందని గమనించాలి. ఈ సీనియర్ సిటిజన్ల పెన్షన్, వడ్డీ ఆదాయాన్ని పొందే బ్యాంకులు కొన్ని షరతులు ప్రకారం టీడీఎస్ కట్ చేసి ప్రభుత్వానికి సమర్పిస్తాయి. ఈ మార్పు 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.

కొత్త పన్ను విధానం ఎంపిక
ప్రభుత్వం మునుపటి బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 1 ఏప్రిల్ 2020 నుంచి ఒక పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం లేదా ప్రస్తుత/పాత పన్ను విధానంలో నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులు పాత విధానంలో ఆఫర్ చేసిన ప్రధాన మినహాయింపులు, తగ్గింపులు వదులుకోవాల్సి ఉంటుంది. న్యూ టాక్స్ పాలసీ ద్వారా రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారు చాప్టర్ VI-A కింద ఉన్న ఏ మినహాయింపు ప్రయోజనాలు పొందలేరు. తక్కువ ఆదాయం ఉన్నవారికి రిటర్న్‌ ఫైలింగ్‌ను సులభతరం చేయడానికే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

Hyundai Verna: లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా పేలవం.. కేవలం జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సొంతం..


నాన్-ఫైలర్లకు అధిక TDS
ఐటీఆర్ ఫైల్ చేయని పన్ను చెల్లింపుదారుల నుంచి టీడీఎస్(మూలం వ‌ద్ద ప‌న్ను) అధికంగా డిడక్ట్/వసూలు చేసేందుకు కొత్త నిబంధనలను కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ మేరకు సెక్షన్ 206AB తీసుకొచ్చింది. దీని ప్రకారం నాన్-ఫైలర్లకు అధిక రేటుతో టీడీఎస్(TDS)ని డిడక్ట్ చేస్తాయి బ్యాంకులు లేదా డిడక్టర్లు.

-గత రెండేళ్లుగా ఐటీఆర్ దాఖలు చేయని వారు అధిక టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

-గత రెండేళ్లలో రూ.50,000 కంటే ఎక్కువ టీడీఎస్ ఉన్నా అధిక టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

అధిక పన్ను వసూలు కోసం ఇదే విధమైన నిబంధనను (సెక్షన్ 206CCA) ప్రవేశపెట్టారు.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీల(ULIPs)పై పన్ను
అధిక ప్రీమియంలతో ఉన్న యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలను పన్ను పరిధిలోకి తెచ్చింది బడ్జెట్. దీని ప్రకారం, 1 ఫిబ్రవరి 2021 నుంచి ప్రారంభమయ్యే పాలసీల సంచిత ప్రీమియం రూ.2.5 లక్షలకు మించితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆలస్యమైన రిటర్న్ డ్యూ డేట్ పొడిగింపు
ఆర్థిక శాఖ ఆలస్యమైన రిటర్న్‌ను దాఖలు చేసే గడువు తేదీని మూడు నెలలు తగ్గించింది. ఆలస్యంగా దాఖలు చేయడానికి గడువు తేదీ ఈ సంవత్సరం నుంచి అసెస్‌మెంట్ సంవత్సరంలో డిసెంబర్ 31కి మార్చడం జరిగింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21కి, కొత్త పోర్టల్ సమస్యలు, కోవిడ్-19 కారణంగా ఈ తేదీని 31 మార్చి 2022 వరకు పొడిగించారు.

Amazon: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలపై మరో ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌.. డీల్స్ ఇవే..!


యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) లాంచ్
ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే కొత్త పోర్టల్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS)ని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ఫారం 26ASని క్రమంగా భర్తీ చేసేందుకు ఏఈఎస్ ని తీసుకొచ్చింది.

ఆలస్యమైన రిటర్న్‌ల ఫైల్‌కి పెనాల్టీలో మార్పు
ఆడిట్ పరిధిలోకి రాని వ్యక్తుల కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌లను దాఖలు చేయడానికి అసలు గడువు తేదీ 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించారు. అంతకుముందు సంవత్సరం వరకు, పన్ను చెల్లింపుదారు అసెస్‌మెంట్ సంవత్సరంలో నిర్దిష్ట గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే గరిష్ట జరిమానా రూ.10,000గా ఉండేది. అయితే, ఆలస్యంగా దాఖలు చేసేవారికి ఇప్పుడు జరిమానా మొత్తాన్ని రూ. 5,000కు తగ్గించారు.
Published by:Veera Babu
First published:

Tags: ITR, ITR Filing

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు