2022-23 అసెస్‌మెంట్ ఇయర్ లేదా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి మొత్తం ఆదాయం బేసిక్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ లిమిట్‌ను మించి ఉంటే ITRను ఫైల్ చేయాలి. పన్ను చెల్లింపుదారులు తమ ట్యాక్స్ లయబిలిటీస్‌ను తగ్గించుకోవడానికి ఆదాయ పన్ను చట్టం, 1961 కింద వివిధ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. సెక్షన్ 80C కింద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా PPFలో పెట్టుబడులు వంటి డిడక్షన్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇతర ఆదాయ పన్ను మినహాయింపులు ఇవే..
* పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్
పెన్షన్ కోసం ఒక వ్యక్తి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఏదైనా యాన్యుటీ ప్లాన్‌కు కాంట్రిబ్యూట్ చేస్తే.. అతను లేదా ఆమె చెల్లించిన గ్రాస్ టోటల్ ఇన్‌కం మొత్తానికి డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80 CCC ప్రకారం పన్ను చెల్లింపుదారులు పెన్షన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి రూ.1.5 లక్షల వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. పెన్షన్ ఫండ్‌లకు చెల్లించే రెసిడెంట్, నాన్-రెసిడెంట్ వ్యక్తులు ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80CCD కింద నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)కి తమ కాంట్రిబ్యూషన్ కోసం రూ.50,000 అదనపు ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. 2015 వరకు, పన్ను చెల్లింపుదారులు ఎన్‌పీఎస్‌కి చేసిన కాంట్రిబ్యూషన్‌పై రూ.లక్ష వరకు ఆదాయ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. 2015 బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడానికి అనుమతించిన గరిష్ట మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచింది. ఎన్‌పీఎస్ కింద ఏదైనా వ్యక్తి చేసిన కాంట్రిబ్యూషన్‌పై రూ.50,000 వరకు అదనపు మినహాయింపును అందించడానికి కొత్త సబ్-సెక్షన్ 1బి కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి, ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడానికి మొత్తం రూ.2 లక్షల (సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షలు, సెక్షన్ 80CCD కింద రూ.50,000 లక్షలు) తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు.
* సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ
సేవింగ్స్ అకౌంట్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన వడ్డీకి ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80TTA కింద రూ.10,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. సేవింగ్స్ అకౌంట్స్, కో-ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ కోసం డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు.
* సెక్షన్ 80D: మెడికల్ ఇన్సూరెన్స్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్
కోవిడ్-19 మహమ్మారి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ డిమాండ్ బాగా పెరిగింది. భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తే, సెక్షన్ 80D కింద హెల్త్ ప్రీమియంలపై డడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు కోసం రూ.25,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి వ్యక్తి తనకు లేదా తనకు లేదా తల్లిదండ్రులు, వారిపై ఆధారపడిన పిల్లలతో సహా కుటుంబ సభ్యుల ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం సెక్షన్ 80D కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.5,000 క్లెయిమ్ చేయడానికి అర్హులు. సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల డిడక్షన్ కంటే ఎక్కువ లేదా తక్కువ ఉంటే ఈ డిడక్షన్ అందుబాటులో ఉంటుందని గమనించాలి.
* తల్లిదండ్రులకు అద్దె చెల్లింపులు
పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 10(13A) ప్రకారం వారి తల్లిదండ్రులకు అద్దె చెల్లించినప్పటికీ, ఇంటి అద్దె భత్యం (HRA) మినహాయింపును పొందవచ్చు. ఈ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి, HRA తప్పనిసరిగా జీతం ప్యాకేజీలో భాగంగా ఉండాలి. మీరు పొందే ఇంటి అద్దె భత్యం కింది వాటిలో అతి తక్కువగా ఉంటుంది - జీతంగా పొందిన హెచ్‌ఆర్‌ఎ మొత్తం, ఢిల్లీ, ముంబై, చెన్నై లేదా కోల్‌కతాలో ఇల్లు అద్దెకు తీసుకుంటే జీతంలో 50 శాతం, నాన్-మెట్రో నగరాల్లో అద్దె ఇంట్లో ఉండేవారికి, HRA జీతంలో 40 శాతం, చెల్లించిన అద్దె — జీతంలో 10 శాతం (బేసిక్ కాంపోనెంట్ + డియర్‌నెస్ అలవెన్స్). ఈ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయడానికి అద్దె ఒప్పందం, అద్దె రసీదులు తప్పనిసరి అని గమనించాలి. మరోవైపు తల్లిదండ్రులు ఆస్తి పన్నులను తీసివేయవచ్చు, అద్దె ఆదాయంపై ప్రామాణిక డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు.
* సెక్షన్ 80G కింద కాంట్రిబ్యూషన్
పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఆమోదం పొందిన సంస్థ లేదా స్వచ్ఛంద సంస్థకు కాంట్రిబ్యూట్ చేస్తే, చెల్లించిన మొత్తంపై ఆదాయ పన్ను డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. చెక్కు, డ్రాఫ్ట్ లేదా నగదు ద్వారా చేసిన కాంట్రిబ్యూషన్స్‌కు అర్హత ఉంటుంది. రూ.2,000 కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ కోసం, పన్ను చెల్లింపుదారులు మినహాయింపును క్లెయిమ్ చేయడానికి నగదు కాకుండా ఏదైనా ఇతర చెల్లింపు విధానాన్ని ఉపయోగించాలి. సెక్షన్ 80G కింద చేసిన కాంట్రిబ్యూషన్ కోసం క్లెయిమ్ చేయగల మినహాయింపునకు గరిష్ట పరిమితి లేదు. కాంట్రిబ్యూషన్ లిమిట్ లేకుండా 100 శాతం లేదా 50 శాతం డిడక్షన్‌కు అర్హులు. సెక్షన్ 80 GGA ప్రకారం వ్యక్తులు శాస్త్రీయ పరిశోధన లేదా గ్రామీణాభివృద్ధి కోసం చేసే కాంట్రిబ్యూషన్‌పై డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే సెక్షన్ 80GGB, సెక్షన్ 80GGC మాత్రం రాజకీయ పార్టీలకు ఇచ్చే కాంట్రిబ్యూషన్‌లకు సంబంధించినవి.
* సెక్షన్ 80EEB కింద ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు
2019 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సెక్షన్ 80EEB ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం రుణాలపై చెల్లించే వడ్డీకి డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80EEB కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిడక్షన్ లభిస్తుంది. రూ.1,50,000 కంటే ఎక్కువ వడ్డీ చెల్లింపులను వ్యాపార వ్యయంగా క్లెయిమ్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT Returns, ITR, ITR Filing, Tds