Home /News /business /

IT Returns: ఇదెక్కడి గోల.. ఇన్ కం ట్యాక్స్ చెల్లింపుదారుల ఆవేదన.. జేబులకు చిల్లు పడుతుందంటూ..

IT Returns: ఇదెక్కడి గోల.. ఇన్ కం ట్యాక్స్ చెల్లింపుదారుల ఆవేదన.. జేబులకు చిల్లు పడుతుందంటూ..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తాజాగా ట్యాక్స్ చెల్లింపుదారులకు ఎదురవుతున్న సమస్య.. కేవలం సాంకేతిక లోపమని చెబుతున్నారు నిపుణులు. ఆదాయపు పన్ను శాఖ పొడింగించిన ట్యాక్స్ ఫైలింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయలేదని తెలిపారు.

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ పైలింగ్ గడువును ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే తాము రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ, ఇన్ కం ట్యాక్స్ పోర్టల్‌లో ఆలస్యంగా దాఖలు చేసినట్లు చూపిస్తోందని చాలా మంది పన్ను చెల్లింపుదారులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సమస్య ఎదురవుతోందని, దీనికి ఆలస్య రుసుము సైతం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆలస్య రుసుం ఆప్షన్‌ను సర్వర్ నుంచి తీసివేయాలని సోషల్ మీడియాలో ఇన్‌కం ట్యాక్స్ విభాగానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

లేట్ ఫైలింగ్ ఫెనాల్టీ నియమాలు..
ఆదాయపు పన్ను నియమాల ప్రకారం.. ఓ వ్యక్తి ఆదాయ రిటర్నును తప్పకుండా ఫైల్ చేయాల్సిన అవసరముంది. కానీ నిర్దేశించిన వ్యవధిలో ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే.. వారు చెల్లించాల్సిన ట్యాక్స్‌పై జరిమానా కింద కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సెక్షన్ 234ఎఫ్ ప్రకారం ఆలస్యంగా దాఖలు చేసిన రిటర్న్స్‌కు ఫీజుగా 5 వేల రూపాయలు చెల్లించాలి. అయితే వ్యక్తి ఆదాయం రూ.5 లక్షలకు మించని సందర్భంలో.. ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేసినందుకు రూ.1000 జరిమానా చెల్లించాలి.

ఇలా ఎందుకు జరుగుతుంది?
తాజాగా ట్యాక్స్ చెల్లింపుదారులకు ఎదురవుతున్న సమస్య.. కేవలం సాంకేతిక లోపమని చెబుతున్నారు నిపుణులు. ఆదాయపు పన్ను శాఖ పొడింగించిన ట్యాక్స్ ఫైలింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయలేదని తెలిపారు. అందువల్ల రిటర్న్స్ దాఖలు చేసేవారు.. సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి, ఆలస్య రుసుం ఆప్షన్‌ను తొలగించే వరకు వేచి ఉండాలని సూచించారు.

కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సాప్ట్ వేర్.. లేట్ ఫైలింగ్ ఫీజును అనుమతించదని చెబుతున్నారు ఆర్థిక సలహాదారులు. కాబట్టి సీబీడీటీ ఈ సమస్యలను పరిష్కరించే వరకు వేచి ఉండాలని ఖాతాదారులకు సలహా ఇస్తున్నారు. లేట్ ఫైలింగ్ ఫీజును తిరిగి పొందడం మరింత శ్రమతో కూడుకున్న పని. ప్రస్తుతం రిటర్న్ దాఖలు చేయడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు.

ఈ టెక్నికల్ ఎర్రర్‌ను సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా పరిష్కరించే అవకాశం ఉంది. అయితే కొత్తగా అభివృద్ధి చేసిన ఐటీ పోర్టల్‌ యూజర్ ఫ్రెండ్లీగా లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. పోర్టల్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇతర సమస్యలు, అవాంతరాలను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Income tax

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు